08.09.2013 ఆదివారము
ఒం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మీకనరకూ వినాయక చవితి శుభాకాంక్షలు
సాయిబంధువులందరకూ ఒక ముఖ్యమైన గమనిక.
రేపు అనగా 09.09.2013 సోమవారము వినాయకచవితి... దీని ప్రాముఖ్యం ఏమిటో మీకు తెలియచేస్తాను.
సరిగా 95 సంవత్సరాల క్రితం అనగా 09.09.1918 సోమవారం, వినాయక చతుర్ధి నాడు శ్రీదాసగణు మహరాజ్ గారు శ్రీసాయినాధస్త్జవన మంజరిని రచన ప్రారంభించి, 15.09.2013 గురువారమునాడు పూర్తి చేసి శ్రీషిరిడీ సాయిబాబావారికి అంకితమిచ్చారు. బాబా మహాసామాధికి 36 రోజుల ముందు ఈ గ్రంధము వ్రాయబడినది.




