09.05.2014 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
శ్రీసాయితో మధురక్షణాలు - 39
బాబా చూపిన కృప - బాబా దివ్యదర్శనం
సాయిబంధువులకు ఈ రోజు మరొక అద్భుతమైన బాబా లీలను అందిస్తున్నాను. పిలిచిన వెంటనే నేనున్నను నీచెంత, నీకెందుకా బెంగ అనిపించేలా తక్ష్ణం వచ్చి ఆదుకునే బాబా. అనుకోకుండా ఆయన చేసే అధ్బుతమైన లీలలు జన్మ జన్మలకూ మరపురాని మధురానుభూతులుగానే మిగిలిపోతాయి. అటువంటి అత్యధ్బుతమైన ఒక లీలను ఈ రోజు తెలుసుకొందాము. ఇక చదవండి. ఆనందాన్ని పొందండి.
దయగల సాయికి మొట్టమొదటగా నా వినమ్రపూర్వకమైన ప్రణామములు సమర్పించుకుంటున్నాను. 1960వ.సంవత్సరంలో నెల్లూరు లో మా పొరుగింటివారి ద్వారా నాకు సాయిబాబా గురించి తెలిసింది. వారు నాకు సాయిబాబాను ఆశ్రయించమని సలహానిచ్చారు.




