01.09.2015 మంగళవారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిరామ చరిత్ర - మధుర ఘట్టములు - 2
ఈ రోజు శ్రీసాయి రామచరిత్రలోని గురువు మరియు ఆయన కుటుంబము అనే అధ్యాయములోని కొన్ని ఆసక్తికరమయిన, నాకు నచ్చిన ఘట్టాలను మీముందుంచుతున్నాను.
ఈ అధ్యాయం శ్రీసాయిబాబా యొక్క భక్తురాలయిన శ్రీమతి మేనేజరు యొక్క అనుభవాలతో ప్రారంభమయింది.
" శ్రీసాయిబాబాను మొదటిసారి ఏవరయినా చూస్తే ఆయన కళ్ళలోని శక్తిని గురించే మాట్లాడేవారు. ఆయన కళ్ళలో అధ్బుతమైన శక్తి ఉండేది. ఎవరయినా సరే తీక్షణముగా ఆయన కళ్ళలోకి చూడాలని ప్రయత్నించిన, చూడలేక తల దించుకొనేవారు. ఆయనను చూడటానికి వెళ్ళిన ప్రతివారు శ్రీసాయి తమ గుండెలలోనే కాదు, తమ శరీరములో ప్రతి అణువులోను ఉన్నారు అనే అనుభూతిని పొందేవారు. శ్రీసాయికి తమ గురించి అన్ని తెలుసు (భూత, భవిష్యత్, వర్తమానాలు) అనే భావన ఆయనను చూడటానికి వెళ్ళిన ప్రతివ్యక్తి పొందేవాడు. అటువంటి సమయములో ఆవ్యక్తికి శ్రీసాయి శరణు కోరడము తప్ప వేరే మార్గము ఉండేది కాదు.





