19.04.2016
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి అమృత ధార
పెళ్ళి
చూపులు
(చిత్రంగా జరిగిన నా వివాహం)
ఈ
రోజు మరొక అత్యద్భుతమైన అమృతధార ఒకటి తెలుసుకుని ఆనందిద్దాము. ఈ అద్భుతమైన లీల శ్రీసాయిలీల
మాస పత్రిక ఏప్రెల్, 1987 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది. బాబా ఎప్పుడు ఎవరికి ఎటువంటి విచిత్రాలు చూపిస్తారో
అంతు చిక్కదు. ఇప్పుడు మీరు చదవబోతున్న చిత్రమైన
లీలలో బాబా తన భక్తురాలికి వివాహం ఏవిధంగా జరిపించారో చూడండి. ఇంకా చెప్పేకంటే చదువుతేనే ఆ మాధుర్యాన్ని అనుభవించగలం.
అది
1980వ. సంవత్సరం. నా బి.ఎ. పరీక్షలు పూర్తయిపోయాయి. ఇక పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాను. నా భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందోనన్న ఆలోచనలతో సతమతమవుతూ
ఉన్న రోజులవి. 1975 వ. సంవత్సరంలో మా నాన్నగారు
చనిపోయారు. ఇంటిలో మా అమ్మగారు, మా అన్నయ్య,
వివాహమయిన నా అక్కలు ఉన్నారు. వారు నాకు తగిన
వరుడికోసం సంబంధాలు వెతుకుతున్నారు. ఎందుకనో
వారు చూసిన సంబంధాలేవీ నా అభిప్రాయాలకి తగినట్లుగా లేవు.




