04.02.2018 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని
విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.
SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్
గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
శ్రీస్వామీజీ భక్తులతో
జరిపిన అనుగ్రహ భాషణమ్ - 6 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
15.06.1971 : స్వామీజీ – “మనము యిక్కడికి భగవంతుని గురించి మాట్లాదుకోవటానికి మాత్రమే వచ్చాము. అటువంటప్పుడు మనం ఇతరులలోని దోషాలను ఎపుడూ గమనించరాదు. బీదవారికి, ధనికులకి మధ్య భేదాలను చూడరాదు. మంచి, చెడు, సత్ప్రవర్తన, దుష్ప్రవర్తన వీటిలోని
తారతమ్యాలను కూడా గమనించరాదు. భగవంతుడు అటువంటి
వ్యత్యాసాలను చూడడు. భగవంతుడు ‘సమత్వభావన’ కలిగి
ఉంటాడు. అనగా ఆయన దృష్ష్టిలో అందరూ సమానమే.




