Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 19, 2012

నిత్య ప్రార్ధనలు

0 comments Posted by tyagaraju on 8:23 AM

19.05.2012  శనివారము








నిత్య ప్రార్ధనలు 


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు


గత నాలుగు రోజులుగా స్వస్థలం నించి విజయవాడకు వచ్చిన కారణంగా ప్రచురణకు కొంత ఆటంకము కలిగింది.  మరలా సోమవారమునుంచి సాయి.బా.ని.స. డైరీ 1997 మీకు అందిస్తాను.  ఈ రోజు కొన్ని నిత్య ప్రార్ధనలను ఇస్తున్నాను. 


ఒక ముఖ్య విషయం ::


 యింతకుముందు శ్రీషిరిడీ సాయిబాబాతో తార్ఖడ్ కుటుంబము వారి ప్రత్యక్ష అనుభవాలు ప్రచురించడం జరిగింది.  ఆ అనుభవాలన్నిటినీ పుస్తకరూపంలో తీసుకురావడం జరిగింది.  ఇది అంతా కూడా బాబావారి అనుగ్రహముతోనే జరిగింది.  మన సాయిబంధువులకు ఎన్ని పుస్తకాలు  కావాలో నాకు మైల్ ద్వారా తెలియపరిస్తే కొరియర్ ద్వారా పంపుతాను.  ఒక విషయం మాత్రం గుర్తు ఉంచుకోండి.  ఈ పుస్తకం కేవలం ఒక నవలలాగా, కధలపుస్తకం లాగ చదివి పక్కనపడవేయవద్దు.  దీనిని కూడా సాయి సత్చరిత్రతో సమానంగా ఆదరించి పారాయణ చేసి బాబావారి అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. 


కొరియర్ చార్జీలు మీకు కావలసిన పుస్తకాలను బట్టి యెంత అయేదీ మీ మైల్ ఐ. డీ. తెలియపరిస్తే మీకు మైల్ చేస్తాను.   


సెల్ నంబర్    :  9440375411 


 మైల్.ఐడి :  


tyagaraju.a@gmail.com  






ఉదయము నిద్రలేచి కుడి అఱచేతిని చూచుచు :: 


1.  కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ 


    కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం  


నేలపై కాలు పెడుతూ


2.  సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే 


    విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే  


స్నానము చేయుచు


3.  గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి


    నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు  


విభూతి ధారణ చేయుచు


4.  శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం 


    లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం  


తులసిమొక్కకు నీరు పోయుచు


5   యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః 


    యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం   


దీపారాధన చేయుచు


6.  దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహం 


    దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే 


ఇంటినుండి బయటకు వెళ్ళునపుడు


7.  ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం 


    లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం  


భోజనము చేయుటకు ముందు


8.  అహంవైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః 


     ప్రాణాపాన  సమాయుక్తః  పచామ్యన్నం  చతుర్విధం 


నిద్రపోవుటకు ముందు


9.  ఉత్తారణో దుష్కృతిహా   పుణ్యో దుస్స్వప్న నాశనః 


    వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః 


  



సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Wednesday, May 16, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (01)

0 comments Posted by tyagaraju on 6:14 PM


17.05.2012  గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజునుంచి సాయి.బా.ని.స. డైరీ - 1997 ప్రారంభము

సాయి.బా.ని.స. డైరీ -  1997 (01)

04.01.1997

నిన్న రాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

"ఆధ్యాత్మిక రంగములోని వ్యక్తులతో స్నేహానికి భాష, వయసు, మనిషి ఆకారము అనేవి అడ్డంకములు కావు.  మనిషి మనసు అతనికి భగవంతునిపై యున్న నమ్మకము ముఖ్యము.  భగవంతునిపైయున్న నమ్మకము ఉన్నవారితో కలసి ఆధ్యాత్మిక రంగములోని విషయాలు చర్చించాలి. కాని, ప్రయాణము మాత్రము ఏకాంతముగా చేయాలి.

08.01.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక ముసలివాని రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.

1) ఇతరులు చేసిన తప్పులు తెలుసుకోవటములో తప్పు లేదు.  నీవు మాత్రము ఆతప్పులు చేయకుండ జీవించటము ఒక గొప్పవిషయము.

2) ప్రశాంత జీవితము గడపాలి అంటే మంచి చెడులను గుర్తించాలి.  వాటిలో మంచివి మాత్రమే స్వీకరించాలి.      

19.01.1997

శ్రీసాయి ఒక తోటమాలి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 


"నీవు గతములో విషబీజాలు నాటితే అవి విష వృక్షాలుగా ఎదుగుతాయి.  ఆవృక్షాలు నీకు చల్లటి నీడను యిస్తాయి అని తలచటము నీభ్రమ. 

 ఆచెట్టు సమాజానికి పనికిరాదు కనుక ప్రజలే ఆచెట్టును కూకటి వేళ్ళతో పెకలించివేస్తారు.

22.01.1997

శ్రీసాయి ఒకబస్సు డ్రైవరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
"నీవు ఆధ్యాత్మిక రంగములో ముందుకు పయనించాలి అంటే, ప్రాపంచిక రంగములోని నీబరువు బాధ్యతలను భగవంతునిపై నమ్మకముతో నిర్వహించాలి.  అప్పుడే నీవు నీగమ్య స్థానమును ఒడిదుడుకులు లేకుండ చేరగలవు.   

24.01.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) ఈసమాజములో ధనవంతులు, మరియు బీదవారు సంతోషముగా జీవించుతున్నారు.  జీవించటానికి ధనము ఒక్కటే ప్రధానము కాదు. సంతోషముగా జీవించాలి అనే పట్టుదల ముఖ్యము.

2) నీవునివసించుతున్న నీస్వంత ఇల్లుకు ఖరీదు కట్టడము అవివేకము.  నీయింటిలో నీవు సుఖ శాంతులతో జీవించటానికి ప్రయత్నించటము వివేకము. 

3) జీవిత ప్రయాణములో నీబంధువులు, నీస్నేహితులు నీసుఖసంతోషాలను దోచుకోగలరు.  కాని నీకు ఉన్న భగవంతుని అనుగ్రహాన్ని ఎవరు దోచుకోలేరు.  అందుచేత భగవంతుని అనుగ్రహముతో ప్రశాంత జీవితము గడుపు.
 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago