Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, December 1, 2012

శ్రీసాయితో మధురక్షణాలు - 9 వ.భాగము

0 comments Posted by tyagaraju on 6:17 AM

                                                   
                                                 

01.12.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు - 9 వ.భాగము
                               

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం 12వ. శ్లోకం, తాత్పర్యం 

శ్లోకం: వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః 

        అమోఘః  పుండరీకాక్షో వృష కర్మా వృషా కృతిః  ||

సృష్టియందలి సంపదగానూ, ఆసంపదను గోరు మనస్సుగనూ, సత్యముగను, ధర్మముగానూ, సామ్యము గలవానిగను, చక్కగా కొలువబడువానిగనూ, సముడుగనూ, వ్యర్ధముకానివానిగను, పద్మము వంటి కన్నులు కలవానిగనూ, వర్షము కలిగించువానిగనూ, వర్షమే తానైనవానిగనూ ధ్యానము చేయవలయును.      

శ్రీసాయితో మధుర క్షణాలు 8వ.భాగములో పేరు చెప్పడానికిష్టపడని బాబా భక్తులు చెప్పిన లీలలలో 4 వ. లీల.

బాబాగారు జీవించి ఉన్న రోజులలో జరిగిన సంఘటనలలో ఒక సంఘటనను మహదీ బువా గారు ఈ క్రింది విధంగా వివరించారు. 

చైనా బజార్ లో గొప్ప సంపన్నుడు ఉండేవాడు.  అతనికి ఒక కుమారుడు ఉన్నాడు.  అతనికి  వ్యసనాలు బాగా ఎక్కువ. ఆ యువకుడు బాగా అత్యాస గల వడ్డీ వ్యాపారులవద్ద అప్పులు చేశాడు. ఆ వడ్డీ వ్యాపారులు ఇతని వద్ద ఉన్నదంతా లాగేసుకొని, వారు తాము ఇచ్చిన  అప్పుకంటే  అత్యంత అధిక మొత్తాలకి బాగా ఎక్కువ వడ్డీకి ప్రామిసరీ నోట్లు వ్రాయించుకొన్నారు. ఆ యువకుడు హీన స్థితికి దిగజారాడు. ఆ దౌర్భాగ్య స్థితి మరియు దివాల పరిస్థితినుండి బయటపడటానికి షిరిడీ వెళ్ళి సాయిబాబా ఆశీర్వాదములు తీసుకొమ్మని సలహా ఇచ్చారు. అతను షిరిడీ  మసీదుకు వెళ్ళినప్పుడు, బాబాఆగ్రహంతో , డబ్బు ఇవ్వడానికి బదులు, కఱ్ఱ తీసుకొని అతని వెనకాల పరుగెత్తి అతనిని కొట్టి ఇలా అన్నారు " సగ్లా పైసా పనిన్ తక్లా పూడె జా మీ ఎతో"   (నీ డబ్బునంతా నీటిలోకి విసిరి వేశావు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను, నీకంటే ముందు నేనక్కడ ఉంటాను).  ఆయువకుడు నిరుత్సాహంతో అణగారిపోయి బొంబాయికి తిరిగి వచ్చాడు. కాని అతను తన ఇంటిని సమీపించగానే  తన ఇంటిలో జరుగుతున్నదానిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తనకు అప్పు ఇచ్చిన ఒక వడ్డీవ్యాపారి అక్కడ ఉన్నాడు. బాబా ఆ వడ్డీవ్యాపారితో "నువ్వు మళ్ళి ఈ అప్పుతీసుకున్నవాడి దగ్గరకు వచ్చావంటే నీ మెడ విరిచేస్తాను" అంటూ ఆవడ్డీ వ్యాపారిని బెదిరిస్తూ కనిపించారు. అతని వద్ద తాకట్టుపెట్టిన నగలు, పత్రాలన్నిటినీ వ్యసనపరుడైన ఋణగ్రస్తునికి తిరిగి ఇచ్చివేయమని ఆజ్ఞాపించారు. తీసుకున్న అప్పుమొత్తం ముట్టినట్లుగా కూడా పత్రం రాసి యిమ్మని వత్తిడి చేశారు. వ్యసనపరుడయిన యువకుడు బాబాని చూడగలిగాడు, కాని ఆ వడ్డివ్యాపారి ఒక దెయ్యాన్ని చూశాడు. ఏమయినప్పటికీ ఆ వడ్డివ్యాపారి భయంకరమైన దెయ్యాన్ని చూసి, తనను బలవంతపెట్టడంతో భయంతో  అతను చెప్పినట్లే  చేశాడు. అతను తన వద్ద తాకట్టు పెట్టిన నగలన్నిటినీ , పత్రాలనూ, తిరిగి ఇచ్చివేసి, అప్పుమొత్తం తీరిపోయినట్లుగా దస్తావేజు కూడా రాసి ఇచ్చాడు. బాబా వ్స్యనపరుడయిన యువకుడి వైపు తిరిగి "నేను నిన్ను విడిచిపెట్టేశాననుకున్నావు. కాని ఎవరయితే నన్ను శరణు వేడుతారో వారిని నేనెప్పుడు విడిచిపెట్టను (మాలా కోనీ శరణ్ ఘెయున్ ఆలె, త్యానా మీ కెవ్హం సొడ్నర్ నహీ)
                                   
                                               
శ్రీ బీ.వీ.నరసిం హస్వామీజీ గారి వివరణ

బొంబాయిలో నివసిస్తున్న ఈ నిజమైన భక్తుని నేను చూశాను. అతను చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను.  

సౌజన్యం:

సాఇ సుధ
మార్చ్ 1950

సాయిసుధ
ఏప్రిల్, 1950 

(యింకా మరికొన్ని మధురక్షణాలు .....)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు 

Friday, November 30, 2012

సాయితో మధురక్షణాలు - 8

0 comments Posted by tyagaraju on 8:07 AM

                                                  
                                                   
30.11.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయితో మధురక్షణాలు - 8
                                                         
                             

ముందుగా శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రం 11వ. శ్లోకం, తాత్పర్యము. 

శ్లోకం:      అజః సర్వేశ్వరః సిధ్ధః సిధ్ధిః సర్వాదిరచ్యుతః  

             వృషా కపి రమే యాత్మా సర్వయోగ వినిస్సృతః   ||

తాత్పర్యము: పరమాత్మను పుట్టనివానిగనూ, అన్నిటికినీ అధిపతిగనూ, సాధింపబడిన మరియూ సాధించుటయను రెండునూ తానే  యైనవాడుగ, అన్నిటికన్నా మొదటగా నున్నవాడుగ, జారిపోవుట లేనివానిగా, వర్షములు కలిగించి మరల నీటిని స్వీకరించువానిగ, కొలత కందని ఆత్మ తత్త్వము కలవానిగ, అన్ని లోకములయందలి సామ్యముగా, సృష్టిని పుట్టించువానిగా, ధ్యానము చేయవలయును.   
  

శ్రీసాయితో మధుర క్షణాలు 8వ.భాగములో పేరు చెప్పడానికిష్టపడని బాబా భక్తులు చెప్పిన లీలలలో 3వ. లీల.

బాబావారి అనుగ్రహపు జల్లు నామీద నిరంతరం ఎంతగా కురుస్తోందంటే, ఆయనతో నాకు కలిగిన అనుభూతిని, వాటిలో నుండి  ఏది నిర్ణయించుకొని చెప్పాలో కష్టం. 

ఇటీవలి సంవత్సరాలలో సాయిబాబా నాకు దర్శనమిచ్చినవాటిలో  మహదీ బువాగారికి కి కూడా సంబంధించినది ఒకటి ఉంది.  నేను మహదీ బువాగారి వద్దకు వెళ్ళి కొంత సమయం ఆయనతో గడిపి వస్తూ ఉండేవాడిని.  1943 ప్రాంతంలో ఒకరోజు నేను మహదీ బువాగారిని  కలుసుకున్న తరువాత, అక్కడినుంచి నేనొక్కడినే హోటల్ లో భోజనం చేయడానికి బయలుదేరాను. బ్రహ్మచారిని అయినందువల్ల, హోటల్లో భోజనం చేయవలసిన పరిస్థితి వచ్చి, నేను స్వయంగా వండి బాబాకు నైవేద్యం పెట్టే అవకాశం లేకుండా పోయిందే అని ఒక్కక్షణం అకస్మాత్తుగ నామనసుకు అనిపించింది.  

ఇలా ఈ పరిస్థితి  వచ్చినందుకు చాలా ఖిన్నుడినయి, వంటరిగా నేనొక్కడినే భోజనం చేస్తున్నందుకు  క్షమించమని బాబాను ప్రార్థించాను.

 అకస్మాత్తుగా, నా ఆశ్చర్యానికనుగుణంగా, నా బల్లకెదురుగా మహదీబువ గారు, బాబా, ఇద్దరూ భోజనం చేస్తూ ఉండటం చూశాను. మొట్టమొదటగా నాకెంతో సంతోషం కలిగింది. తరువాత నన్ను నేనే నిందించుకొన్నాను.  అఱచేతులతో కణతలు నొక్కుకొని, కన్నీళ్ళతో "బాబా నేను పాపిని" అన్నాను బాబాతో. ఇక్కడ మీరు  భోజనం చేస్తున్నట్లుగా నాకు దర్శనమిచ్చి ,  నాకు మీరు ప్రసాదించిన ఇంతటి గొప్ప గౌరవానికి నేను తగను. కొద్ది సమయంలోనే బాబా, మహదీబువా ఇద్దరూ అదృశ్యమయారు. ఆరోజున బాబా, మహదీబువా వాస్తవంగా హోటల్ కి వచ్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకొని హోటల్ నుండి బయటకు వచ్చాను.  అలా నిశ్చయించుకొని నేను మహదీ బువా గారి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరంగా చెప్పి, "ఆ దృశ్యం నిజమేనా"" అని ఆయనను అడిగాను. బాబా మీద నాకున్నటువంటి అత్యంత భక్తి, బాబాతో నాకున్నటువంటి తీవ్రమయిన, నిరంతరమయిన ఏకాగ్రత వల్లనే ఆయన దర్శనం కలిగిందని, అది నిజమేనని చెప్పారు.  అయినప్పటికీ నేనాయనను ఒక ప్రశ్న అడిగాను  "మీరు కూడా కనిపించారు కదా? మీరెందుకు వచ్చారు?"  తాను ఆరోజు భౌతిక శరీరంతో హోటల్ కు రాలేదని ఒప్పుకున్నారు. ఇంకా ఆయన, బాబా తన అద్భుతమయిన శక్తితో ఒకే సమయంలో రెండు శరీరాలను ధరించగలరని చెప్పారు.     

     క్రింద శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీ గారి వివరణ.

బొంబాయిలో నివసిస్తున్న, పేరు చెప్పడానికిష్టపడని ఈ నిజమైన భక్తుడిని నేను చూశాను. ఆయన చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను. 

సాయిసుధ 
మార్చ్, 1950 

సాయిసుధ
ఏప్రిల్, 1950 


(ఇంకా క్షణ క్షణం మధుర క్షణాలకు ఎదురు చూడండి)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago