Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, December 25, 2013

షిర్దీ సాయిబాబా తన లీలలను చూపించి సాయి ప్రచారకునిగా మార్చుట

0 comments Posted by tyagaraju on 3:57 AM
                          
                                        
                                 
25.12.2013 బుధవారము (దుబాయ్ నుండి)

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అద్భుతమైన సాయి  లీలల గురించి తెలుసుకుందాము. సాయిబాబా అంటే ఎవరో తెలియని వ్యక్తికి తనలీలలు చూపించి తనభక్తునిగా చేసుకొని ఆతరువాత అతను  సాయి ప్రచారకునిగా ఏవిధంగా మారాడొ చదవండి. 

ఇది షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు 2013 సంచికనుండి గ్రహింపబడినది. 

ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 102వ.శ్లోకం, తాత్పర్యం
                              
శ్రీవిష్ణుసహస్రనామం

శ్లోకం : ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః            |

         ఊర్ధ్వగః సత్పధాచారః ప్రాణదః ప్రణవః పణః     || 

తాత్పర్యం: నారాయణుని ఈ సృష్టి ఆధారమే తన నివాసమైనవానిగా, మరియూ అన్ని లోకములకూ ఆధారముగా, ధ్యానము చేయుము.  పుష్పము వికసించుటవంటి తన చిరునవ్వుతో సృష్టిని భౌతిక లోకముల లోనికి వ్యక్తీకరుంచువాడు, అన్నిటియందు నిరంతరమూ మేల్కొని యుండువాడు, జీవులలో మంచిపనులు చేయు ఆచారమే తన మార్గముగా పైకి ప్రయాణము చేయువాడు, ప్రాణశక్తి నిచ్చువాడు, శ్వాసను, వాక్కును, సృష్టియొక్క మూల్యమును కూడా నిచ్చువాడునై యున్నాడు.   

 షిర్దీ సాయిబాబా తన లీలలను చూపించి సాయి ప్రచారకునిగా మార్చుట

బెంగళూరులో నివసిస్తున్న శ్రీకాంత్ శర్మ 1980 సంవత్సరం చివరలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆరోజుల్లో అతను విపరీతమయిన ఆస్త్మాతో బాధ పడుతున్నాడు.  శ్వాస సరిగా ఆడాలంటే ప్రతిరోజు డెరిఫిలిన్ రెటార్డ్ మాత్రలు వేసుకోవలసిందే.  ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతను, అతని  కుటుంబం తగినంతగా ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళు కారు. 

Saturday, December 21, 2013

ప్రసవ సమయంలో ఆదుకున్న బాబా

0 comments Posted by tyagaraju on 8:59 AM
         
          
21.12.2013 శనివారము (దుబాయి నుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు బాబా చేసిన అద్భుతమైన సహాయం గురించి తెలుసుకుందాము.  ఒక్కొక్కసారి మనం ఆయనని ప్రార్ధించకపోయినా, వెంట ఉండి సహాయం చేసి, తను చేసిన సహాయం ఎలా జరిగిందో కూడా మన ఊహకు అందనంతగా చేసి చూపిస్తారు .  ఏనాటి జన్మలో ఋణానుబంధమో.  ఈజన్మలో తన భక్తునిగా చేసుకోవడానికి ముందుగా అద్భుతమైన లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు. 



ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 101వ.శ్లోకం, తాత్పర్యం


                
శ్రీవిష్ణుసహస్రనామం


శ్లోకం:  అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః  |

         జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః     || 


తాత్పర్యం:  పరమాత్మను అన్ని భూతముల పుట్టుకకూ ప్రారంభకునిగా, తనకు తాను ప్రారంభము లేనివానిగా, లక్ష్మిగా, స్వయముగా ప్రకాశించు ఆభరణములు ధరించిన గొప్ప వీరునిగా, సమస్తమునకు మొట్టమొదటవానిగా, మరియు పుట్టుకలకు కారణమైనవానిగా ధ్యానము చేయుము.  ఆయన రూపము భయము కలిగించును.  ఆయన భయంకరమైన పరాక్రమము కలవాడు.    



ప్రసవ సమయంలో ఆదుకున్న బాబా



ఈ రోజు బాబా చేసిన అద్భుతమైన సహాయం ఎటువంటిదో తెలుసుకొందాము.  ఇది 1940 సంవత్సరం ప్రాంతంలో  జరిగినది. ఇది సాయిలీల మాసపత్రిక 1940వ. సంవత్సరంలో ప్రచురింపబడింది..సాయిలీలాస్.ఆర్గ్ నుండి సంగ్రహింపబడింది. యధాతధంగా ప్రచురిస్తున్నాను. 


 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago