Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 2, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు – 7

1 comments Posted by tyagaraju on 8:21 AM

       675 Best Sai baba images | Sai baba, Sai ram, Om sai ram
           Beautiful Yellow Roses Hd Wallpapers | Roses Gallery

02.05.2020  శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 7
ఇందులోని విషయాలను ఎవరయినా తమ స్వంత బ్లాగులో ప్రచురించదలచుకున్నట్లయితే ముందుగా నాకు తెలియపరచవలసిందిగా నా మనవి.

శ్రీ సాయి సత్ చరిత్ర సందేహాలు – బాబా సమాధానాలు - 6కు 
సాయిభక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై,  మీరు అన్వయించిన భగవద్గీత శ్లోకం ద్వారా చక్కగా అర్ధమవుతుంది అన్నిటిలోను బాబాగారిని చూడాలని.  చాలా విషయాలని సంగ్రహించే ఓపికని బాబాగారు మీకు ప్రసాదించి తద్వారా మా అందరికీ అందించారు.  బాబాగారి కోపం తల్లి తన పిల్లలపై చూపే కోపంలాంటిదని ఆయన  ఏమి చేసిన మనకోసమే అన్న విషయం చాలా చక్కగా అవగతం అవుతుంది. 
శ్రీ పార్ధసారధిగారు, పాలకొల్లు :  చక్కటి విశ్లేషణ.  బాబా కోపం గురించి నాకూ సందేహం ఉండేది.  కాని జ్ఞానికోపం వారిని అనుసరించే వారి సహనానికి పరీక్షగా భావించవచ్చు అనిపించింది.
శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్ : నిజంగా బాబా గురించి నాకు ఇదే సందేహం ఉండేది.  ఆయన ఎందుకు కోప్పడేవారు అని.  మీరు అన్నట్టు దేవుడికి అందరూ పిల్లలే.  పిల్లలు తప్పుచేస్తే దండించే తండ్రి కోపమే బాబాది కూడా.  మీరు రాసిన నారదీయ భక్తిసూత్రాల్లో విషయం లోకంలో జరిగే కీడు గురించి బాధపడకు.  దాని వెనుక రాబోయే దైవం యొక్క అనుగ్రహాన్ని తలుచుకుని నిశ్చింతగా ఉండు అని. విష్ణు సహస్ర నామాలలో ఉంది భయకృద్ ….  భయనాశన…. అని.  పరీక్ష పెట్టిన ఆయనే ఈ పరిస్థితిని బాగుచేస్తారు అని నమ్ముతున్నాను.  మంచి విషయాలు చెబుతున్నారు.  ధన్యవాదాలు.
శ్రీమతి శారద,  ముంబాయి : సత్ చరిత్రలోని కొన్ని సందర్బాలలో బాబా కోపించటం వెనుక ఇంత పరమార్ధం ఉందని, ఆధ్యాత్మిక దృష్టిననుసరించి దైవత్వాన్ని మేల్కొల్పడమనే సూక్ష్మ విషయాన్ని తెలుసుకున్నాం.  మీరు సరళమైన ఉదాహరణలతో వివరించారు.  అదే సమయంలో ఇతర గ్రంధాల్లో విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నాం.  శ్రీయుతులు త్యాగరాజు గారికి ధన్యవాదాలు.
  

17.04.2020 న నాకు కలిగిన సందేహం.  బాబాను ఈ విధంగా అడిగాను.  బాబా, మౌసీబాయి నీ పొత్తికడుపును తోము సందర్భములో ఇతర భక్తులు మెల్లగా తోముము అన్నపుడు నీవు వెంటనే లేచి కోపముతో సటకాను నీపొత్తికడుపులో గుచ్చుకొనుటకు కారణమేమిటి?  నా సందేహానికి సమాధానం 20.04.2020 ఇచ్చారు.


దానికి బాబా సమాధానమ్ : ఉధ్ధవగీత

అనగా నన్ను ఉద్ధవ గీత చదవమని చెప్పారు.
        The Uddhava-Gita: Krishna Speaks to Uddhava His Sequel to Bhagavad ...
మొట్టమొదటగా ఉధ్ధవుని గురించి సంగ్రహంగా తెలుసుకుందాము.
ఉధ్ధవుడు శ్రీ కృష్ణుడికి చిన్ననాటినుంచే ఎన్నో సేవలు చేసేవాడు.  ఆయనే కృష్ణుడికి రధసారధి కూడా.  తను చేసే సేవలకు ఎప్పుడూ శ్రీకృష్ణునినించి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. 

Thursday, April 30, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు బాబా సమాధానాలు - 6

1 comments Posted by tyagaraju on 7:48 AM
       Wallpics Shirdi Saibaba Wallpapers Glossy Photo Paper Poster for ...
        White Rose On The Black Background Free Stock Photo - Public ...

30.04.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు 
 బాబా సమాధానాలు - 6
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com


ఇందులోని విషయాలన్నిటిని ఎవరయినా తమ స్వంత బ్లాగులో ప్రచురించదలచుకున్నట్లయితే ముందుగా నాకు తెలియపరచవలెను.

శ్రీ సాయి సత్ చరిత్ర సంధేహాలు – బాబా సమాధానాలు - 5 కు సాయిభక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై – వేపచెట్టులో అణువణువు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది.  బాబాగారు వేపచెట్టు క్రింద ప్రశాంతంగా ఉంటుందని కూర్చొని ఉంటారనుకున్నాను.  కాని దాని వెనుక ఇన్ని విషయాలు దాగున్నాయని ఇప్పుడె తెలుసుకున్నాను.  మన అమ్మమ్మల కాలంలో ఇంటికి ఒక వేప చెట్టు ఉండేది.  ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ చెన్నైలో  అందరూ ఇంటి గుమ్మానికి మామిడి తోరణంగా కడుతున్నారు.  చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను.
శ్రీమతి కిరణ్మయి, షికాగో, ఇల్లినాయిస్ -  ఈ ప్రశ్న బాగుంది
శ్రీమతి మాధవి, భువనేశ్వర్ – మంచి సందేహాలు అడుగుతున్నారు.  అందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.  వేపచెట్టు గురించి చాలా బాగుంది.  ఇక్కడ పూరీ జగన్నాధ్ లో విగ్రహాలను వేపమద్దితోనే చేస్తారు.  అది శ్రీమహావిష్ణువు కూడాను.

శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్ : బాబా చెప్పటానికి ఇష్టపడలేదు అంటే అది భక్తులకు మంచికోసమే.  వేపచెట్టు గురించి విశేషాలు అధ్భుతం సర్.  మీ సహనం బాబా అనుగ్రహమే.
      
16.04.2020 : ఈ రోజు బాబాకు తెలిపిన నా సందేహం..  “బాబా, ఏదయినా కొత్తపని ప్రారంభించెనపుడెల్లా నువ్వు ఎందుకని కోపిస్తూ ఉండేవాడివి?
బాబా సమాధానమ్  :  ఆధ్యాత్మికత పెట్టు
           Sai Baba's Anger V/S Invisible Cruel Powers | Shirdi Sai Baba Life ...
ఇదే ఆయన చెప్పినది.  ఇక ధ్యానంలోనుండి లేచి, గూగుల్ లో Anger and Spirituality అని కొట్టి శోధించాను.  సమాచారం చాలా చిన్నది. ఒక అయిదు వాక్యాలు మాత్రమే ఉంది.  అంతకన్న ఎక్కువ సమాచారం దొరకలేదు.  నాలుగయిదు వాక్యాలు మాత్రమే ప్రచురించడానికి నాకే తృప్తి కలగలేదు.  దానినే కాస్త అనువాదం చేసి ఇంకా మరికొంత ఆధ్యాత్మిక విషయాలను జోడించి మీకు అందిస్తున్నాను.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago