Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, December 4, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 8 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:50 AM

 



04.12.2020  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 8 వ.భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ – సాకోరీ – షిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

ప్రశ్న   ---   బాబా మహాసమాధి చెందిన తరువాత షిరిడిలో ఏమి జరిగింది?

జవాబు   ---   తనకు ఇక మరణమాసన్నమయిందని తెలిసి, తాను తొందరలోనే దేహాన్ని వీడుతున్నానన్న విషయం బాబా కొద్దిమందికి చెప్పారు.  ఆసమయంలొ దాదాపు ఏడువేలమంది ప్రజలు షిరిడీలొ గుంపులు గుంపులుగా సమావేశమయ్యారు.  ప్రజలందరూ చాలా ఆందోళనకు గురయ్యి ఏడవసాగారు.  ఆప్రదేశమంతా చాలా గందరగోళంతో నిండిపోయింది.  ఆయన అంతిమయాత్ర ఎంతో వైభవంగా జరిగింది.  సుదీర్ఘమయిన యాత్ర జరిగింది.  ప్రజలందరూ ఎంతగానో శోకించారు.  ఆయన శరీరాన్ని బూటీవాడలో ఉంచారు.  అదే ఇప్పటి సమాధి మందిరం.  ఆప్పటినుండి ఆయన దేహం అక్కడే ఉంది.

Thursday, December 3, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 7 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:22 AM

 


03.12.2020  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 7 వ.భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీ – సాకోరీ – షిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

ప్రశ్న   ---   ఉపాసనీ మహరాజ్ గురించి ఏమయినా చెబుతారా?

జవాబు   ---   ఉపాసనీ మహరాజ్ గారు ఎప్పుడూ ఖండోబా మందిరం వద్దనే ఉండేవారు.  ఆయన బాబాకు సన్నిహితంగా ఉండేవారు.  ఆయన బాబాను మొట్టమొదటగా కలుసుకొన్న తరువాత ఖండోబా మందిరం వద్దనే నివసించడానికి వెళ్లారు.

ప్రశ్న   ---   బాబా గారు జీవించి ఉన్న కాలంలో ఏవిధమయిన కార్యక్రమాలు జరిగేవి?

జవాబు   ---   నాకు గుర్తున్నంతవరకు బాబా గారు జీవించి ఉన్న కాలంలో రెండే ఆరతులు జరిగేవి.  ఒకటి ఉదయం 5 గంటలకు మరొకటి మధ్యాహ్న ఆరతి.  సాయంత్రం  4, 5 గంటల మధ్య కీర్తనలు పాడేవారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago