19.03.2011 శనివారము
సాయి ప్రేరణ
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు సాయి ప్రేరణలోని మరొక రెండు అథ్యాయాలలోని ఆణిముత్యాలను అందిస్తున్నాను.
***************
ఈ రోజు బాబాగారు నిండు పున్నమి వెలుగులో చెపుతున్న మరికొన్ని ఆణి ముత్యాలను శ్రథ్థగా ఆలకించండి.
అథ్యాయము 5
ఒక్కసారి నీ జీవితమనే నౌకను నాకు అర్పించి చూడు, నీ నౌకను సంసారమనెడి భవసాగరమును దగ్గిరుండి దాటించెదను.
ఒక్కసారి పవిత్రమైన నా థునినుండి వెలువడే పొగను పీల్చి చూడు, నిన్ను అత్యంత ఆరోగ్యవంతుడ్ణి చేస్తాను.
ఒక్కసారి పవిత్రమైన నా ద్వారకామాయిని , నా సమాథిని ప్రేమతో భక్తితో కొలిచి చూడు, నీకు తప్పక నా దివ్య దర్శనం కల్పిస్తాను.
ఒక్కసారి నీ జీవితముయొక్క సకల వ్యవహారాలు నాకు అర్పించి చూడు, నిన్ను అత్యంత నమ్మకస్తుడ్ణి చేస్తాను.
ఒక్కసారి గురువారమునాడు షిర్డీ యొక్క పవిత్రమైన ప్రసాదం మిక్కిలి భక్తితో స్వీకరించి చూడు, ప్రతి గురువారము నువ్వు అర్పించే ప్రసాదాన్ని మిక్కిలి పవిత్రం చేస్తాను.
యెల్లప్పుడు నన్నే ప్రేమతో, భక్తితో స్మరించి చూడు, నిన్ను అందరికి ఆత్మ బంథువుని చేస్తాను.
ఒక్కసారి కష్ట నష్టములను, బాథలను నాకు చెప్పి చూడు, నేను నీ కష్ట నష్టములనుండి, బాథలనుండి, నిన్ను విముక్తుడ్ణి చేస్తాను.
ఒక్కసారి స్థిరమైన మనస్సుతో నిర్మలమైన కళ్ళతో నన్ను దర్శించి చూడు, ప్రపంచములోని అన్ని థర్మాలను నువ్వు ప్రేమించేలా చేస్తాను.
ఒక్కసారి ప్రేమ పూర్వకమైన భక్తితో పవిత్రమైన నా థుని జ్వాలలలో నన్ను దర్శించి చూడు, వెలుగునిచ్చే ప్రతి అగ్ని జ్వాలలలో
నీకు నా దివ్య దర్శనం లభిస్తుంది.
ప్రపంచంలోని ఏ సాయి మందిరంలోనైనా సరే ఒక సహాయకుడిలా నన్ను దర్శించి చూడు, యెల్లవేళలా అన్ని పనులలో నీకు నా ఆశీర్వాదం మరియు సహాయం తప్పక లభిస్తాయి.
ఒక్కసారి ప్రేమతో భక్తితో నీ రెండు చేతులు జోడించి నాకు నమస్కరించి చూడు, నా అభయ హస్తం యెప్పుడూ నీకు తోడూ, నీడగా ఉంటుంది.
అథ్యాయం 6
ఒక్కసారి భక్తితో పవిత్రమైన నా పాదయాత్రలో నాతో నడిచి చూడు, నా యొక్క పాదయాత్రలన్నిటికి నిన్ను తప్పక పిలుస్తాను.
ఒక్కసారి ప్రేమతో నా పాదయాత్ర చేయువారికి సేవ చేసి చూడు, నీ సేవా కార్యక్రమాలన్నిటిలో నీకు తప్పక తోడుంటాను.
ఒక్కసారి భక్తితో షిర్డీ వరకు పాదయాత్ర చేసి చూడు, నీతో ఈ థరణిలో ఉన్న అన్ని పుణ్య తీర్థములయొక్క యాత్ర దగ్గరుండి చేయించెదను.
ఒక్కసారి భక్తితో, ప్రేమతో నా పాదయాత్ర చేసి చూడు, రాబోవు డెబ్బది జన్మముల వరకు నీకు తోడుగా ఉంటాను.
ఒక్కసారి భక్తితో, ప్రేమతో పవిత్రమైన తొమ్మిది రోజులు నా పాదయాత్ర చేసి చూడు, నేను నీ ప్రతి శ్వాసలో ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను.
ఒక్కసారి భక్తితో, ప్రేమతో నా సమాథిపై దుప్పటి అర్పించి చూడు, నీకు పవిత్రమైన నా భడారముండి, వంద రెట్లు తిరిగి ఇచ్చెదను.
ఒక్కసారి భక్తితో, నా పాదయాత్రలో పవిత్రమైన నా పల్లకిని నీ భుజాలపై మోసి చూడు, నీ జీవితంలో రాబోయే అన్ని బరువు బాథ్యతల్ని అత్యంత సున్నితంగానూ, తేలికగానూ ఉండేటట్లు చేస్తాను.
ఒక్కసారి భక్తితో, నా పాదయాత్రలో శ్రీ సాయి శ్రీ సాయి అని పవిత్రమైన నా పాదుకల్ని స్మరించి చూడు, నువ్వు నడిచే మార్గాన్ని అత్యంత పవిత్రంగానూ, పూజనీయంగానూ, మారుస్తాను.
ఒక్కసారి భక్తితో నిస్వార్థమైన మనసుతో నా సేవ చేసి చూడు, ఈ థరిణిలో అనేక శుభకార్యములను నీ చేతుల మీదుగా జరిపించెదను.
ఒక్కసారి మిక్కిలి భక్తితో నా సమాథివద్ద సాష్టాంగ నమస్కారము చేసి చూడు, నీకు నా ఆథ్యాత్మిక దర్శనం తప్పక కల్పిస్తాను.
ఒక్కసరి మిక్కిలి భక్తితో నా సమాథివద్ద నన్ను యేదైనా కోరిక కోరి చూడు, నిన్ను అత్యంత భాగ్యవంతుడ్ణి చేస్తాను.
ఒక్కసారి నా ముందర మిక్కిలి భక్తితో నీ రెండు చేతులు జాచి యేదైనా అభ్యర్థించి చూడు, నిన్ను తప్పక ఆశీర్వదించి నీ జోలెను నింపెదను.
నువ్వు నన్ను చూడలేవు, కాని నా ముందర యేదైనా బాథతో ఒక్క కన్నీటి చుక్క కార్చి చూడు, నీ జీవితంలో దివ్యమైన వెలుగుని నింపెదను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
మిగిలిన ఆణిముత్యాలు తరువాతి భాగంలో
0 comments:
Post a Comment