14.04.2011 గురువారము
బాబా 7 గురువారముల వ్రతము - బ్రెస్ట్ కాన్సర్ నివారణబాబా మీద సంపూర్ణమైన భక్తి, నమ్మకం, విశ్వాసము ఉండాలే కాని యాఎదీ కూడా అసాథ్యమనంది లేదు. ఈ రోజు ఈ బాబా లెలలో భక్తితో చేసిన బబ 7 గురువారముల వ్రతన్ని యెంతో నమ్మకంతో ఆచరించగానే ఒకామెకు బ్రెస్ట్ కానసరు యెలా నివారణ అయిందో తెలుసుకుందాము.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు మనము విశాఖపట్నమునుంచి శ్రీమతి నౌడూరు శారద గారు చెప్పిన బాబా లీలను తెలుసుకుందాము. బాబా మీద అచంచలమైన విశ్వాసము, నమ్మకము ఉండాలే గాని యేదీ అసాథ్యం కాదు అనే విషయం మనకు ఈ లీల చదువుతే తెలుస్తుంది.
శ్రీమతి శారద గారు విశాఖపట్నంలో టీచరుగా పని చేస్తున్నారు. ఆవిడ సహాథ్యాయి గారి అక్కగారు పోర్ట్ లో పనిచేస్తారట. ఆవిడకి బ్రెస్ట్ కాన్సర్. వారి అబ్బాయిలు బొంబాయిలో నావీలో పనిచేస్తూ ఉంటారు. ఈ మెను బొంబాయిలో ఆస్పత్రిలో వైద్యం చేయించారట. ఆపరేషన్ అయింది గాని, ఇంక కాన్సర్ కి సంబంథించిన లక్షణాలు ఉండిపోయి, ఇంక వైద్యానికి సహకరించడం లేని పరిస్థితుల్లో, అప్పుడప్పుడు జ్వరం రావడం జరుగుతూ ఉండేదిట. డాక్టర్లు కూడా ఇంక తామేమీ చేయలేమని, ఆఖరి దశలో ఉందని చెప్పారు. ఇలా ఉండగా, శారద గారు, సాయి వ్రతం చేసుకుని, ఒక పుస్తకాన్ని బొట్టు పెట్టి తన సహాథ్యాయికి ఇచ్చారు.
ఆమె తాను ఈ వ్రతాన్ని తన అక్క కొఱకు తప్పకుండా చేస్తానని చెప్పారు. వ్రతం నాలుగు వారములు చేయడం జరిగింది. ఆ సమయంలో మరల ఈమె అక్కగారు వైద్య పరీక్షలు చేయించుకోగా, కాన్సరు లక్షణాలు కొంతవరకు తగ్గినట్లు కనపడిందిట. మొత్తం తొమ్మిది వారాలలో ఒకవారము తప్పినా, మరల పూర్తి చేయడం జరిగిందిట. ఇక బాబా లీల చూడండి. ఆమె యెంతో, నమ్మకంతో, శ్రథ్థతో చేసిన వ్రతం వృథా కాలేదు.
మరలా ఆమె అక్కగారు వైద్య పరీక్ష చేయించుకోగా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విథంగా ఆవిడకు, కాన్సరు లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయిట.
చూశారా, బాబా లీల యెటువంటిదో. తనని నమ్మి శ్రథ్థా భక్తులతో తనని కొలిచేవారిని ఆయనెప్పుడు, యెల్లవేళలా, ప్రతిక్షణం, కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు.
ఈ వ్రతము పుస్తకాన్ని హిందీ నుంచి విశాఖపట్నము వాస్తవ్యులైన శ్రీ బాబూరావు గారు తెలుగులోనికి అనువదించారు. వారి చిరునామా కూడా ఇక్కడ ఇస్తున్నాను.
శ్రీ కె.వీ.సీహెచ్. బాబూరావు
యింటి. నం. ఎల్.ఐ.జీ. బీ.22
మిథిలాపురి ఉడా కోలనీ
మథురవాడ
విశాఖపట్నం 41
ఫొన్: 0891 2781290
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment