బాబాకి అసాథ్యమన్నది లేదు17.04.2011 ఆదివారముఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు సుకన్య గారు సేకరించి పంపిన బాబా లీలను తెలుసుకుందాము.
జయశ్రీ రమేష్ భక్తురాలి మాటలలోనే ఆమె అనుభవాన్ని తెలుసుకుందాము.
"బాబా గారు నామీద మాకుటుంబము మీద వర్షించిన లీలలను చెప్పడానికి నాకు మాటలు చాలవు. అటువంటి వాటిలో ఒక లీలను మీకు చెపుతానిప్పుడు.
నేను మామ్మాయినియేడవ నెల కడుపుతో ఉన్నప్పుడు,2007 సంవత్సరములో నేను, నాభర్త, మా అబ్బాయి (7 సంవత్సరముల వయసు) అమెరికాకి వచ్చాము. ఇది బాబాగారి అనుగ్రహమని అనుకుంటున్నాను. తరువాత నాకు అమ్మాయి పుట్టింది. మేము నివసించే ప్రదేశానికి మేము అక్కడే పుట్టామా అన్నంతగా అలవాటు పడిపోయాము.
2009 మే నెలకి నా భర్త డెప్యుటేషన్ పూర్తి కావస్తుండడంతో మాకేమీ పాలుపోలేదు. మా అబ్బాయి చదువు యెలాగా అని బెంగ పట్టుకుంది. మా అబ్బాయి అక్కడ స్కూలికి, చదువుకి బాగా అలవాటు పడ్డాడు. మేము ప్రతీచోటా ప్రయత్నించాము కాని యెక్కడా అనుకూలంగా సమాథానం రాలేదు. నేను మా స్నేహితులని బంథువులని కలుసుకున్న యేమీ ఫలితం లేకపోయింది. యేమయినప్పటికి మేము బాబా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము. మమ్మల్ని కనక అమెరికాలోనే ఉండేటట్లు చేస్తే, నాకిష్టమయిన కాఫీని వదలి వేస్తానని ప్రార్థించాను. ఒకరోజు ప్రొద్దున్న (యిండియాకి వెళ్ళడానికి నాలుగు రోజుల ముందు)
బాబా గారు మాస్నేహితులలో ఒకరుగా మమ్మల్ని రక్షించడానికి వచ్చారు.నా భర్త హెచ్ 1 కి ఫైల్ పిటిషన్ వేశారు. (వేసేముందు బాబాగారి అనుమతి తీసుకున్నారు , ఆశ్చర్యకరంగా అనుకూలంగా వచ్చింది) బాబా దయ వల్ల మేము మరలా తిరిగి అమెరికాకి వస్తామనే ఆశతో యిండియాకి వచ్చాము.
భారతదేశంలో మాకు చాలా దుర్భరంగా ఉంది యెందుకంటే మా అబ్బాయి చదువు పాడవుతోంది. అన్ని స్కూల్సు లోను ప్రవేశం కోసం ప్రయత్నిచినా లాభం లేకపోయింది. మా అబ్బాయి మనం తిరిగి అమెరికాకి యెప్పుడు వెడతాము అని అడగడం మొదలుపెట్టాడు. నేను మా అబ్బాయికి ప్రతిరోజు, బాబా ని ప్రార్థించమని ఆయన మన మొఱ ఆలకిస్తాడని చెప్పేదాన్ని. ఆఖరికి మేము వేసిన పిటిషన్కి అనుమతి వచ్చింది. ఈ లోగా నాభర్తకి యిండియాలోనే ఒకచొట ఉద్యోగం వచ్చింది. ఈ సమయంలో మేము అమేరికా వెళ్ళడమా లేక ఇక్కడే ఉద్యోగంలొ స్థిరపడాలా అని సందిగ్థంలో పడ్డాము. కాని మేము మనస్ఫుర్తిగా అమెరికాకే వెళ్ళాలని అనుకున్నాము కాబట్టి విసా యింటర్వ్యూకి వెడదామని నిర్ణయించుకున్నాము. మేము విసా యింటర్వ్యూకి వెళ్ళాము కాని అది ఒక నెల పెండింగులో పడింది. ఈ లోగా నాభర్త మమ్మల్ని మా తల్లితండ్రుల వద్ద వదలి తను ఉద్యోగంలో చేరారు.
నెల తరువాత మాకు విసా వచ్చింది. విసా రావడం అంతా బాబా ఆశీర్వాదమే అనుకున్నాము. నా భర్త ఇక్కడ యిండియాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, అమెరికాకి టిక్కట్స్ రిజర్వ్ చేశారు. బాబాగారు ఇచ్చిన ఉద్యోగాం ఆయన ఇచ్చేవి అన్నీకూడా శాశ్వతమైనవి మరియు వరం కూడా. ఆరు నెలల తరువాత (జూన్ 2009 నించి జాన్.2010) నేను, మా అబ్బాయి, అమ్మాయి, అందరముకూడా, యింతకుముందు ఉన్న పట్టణానికే వెళ్ళాము. ఇంకా, యింతకుముందు ఉన్నఅపార్ట్ మెంట్లోనే దిగాము. ఆరు నెలల తరువాత మా అబ్బాయి బాబా ఆశీర్వాదంతో యింతకుముందు చదివిన స్కూలులోనే చేరాడు. క్రితం సంవత్సరం మా అబ్బాయి పుట్టినరోజుకి, ప్రతి సంవత్సరం ఇక్కడే అబ్బాయి పుట్టినరోజు చేసుకోవాలని బాబాని ప్రార్థించాను. ఆరు నెలల తరువాత అమెరికాలో బాబా గుడికి వెళ్ళినతరువాత, నేను కాఫీ త్రాగాను.
నేను చెప్పేదేమంటే బాబా అనుగ్రహంతో ప్రతీదీ సాథ్యమే. ఆయనకి సరణాగతి చేస్తే ఆయనె మనలని ఒక ఒడ్డుకు చేరుస్తారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment