మన మనస్సుని గమనించే బాబా
02.06.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభశీస్సులు
ఈ రోజు బాబా వారము. గురువారము నాడు కూడా యేమీ ఇవ్వలేకపోయానని నిరాశ పడకుండా బాబా అనుగ్రహంతో ఈ లీలని అందిస్తున్నాను. ఆఫీసు నించి వచ్చి, బాబా గుడికి వెళ్ళి పూర్తి చేసేటప్పటికి రాత్రి 10 గంటలు అయింది. చివరికి పూర్తి చేసి మన సాయి బంథువులందరికీ అందిస్తున్నాను. ఈ లీల యింతకుముందు శ్రీమతి ప్రియాంకా గారు బ్లాగులో ప్రచురింపబడింది.
యెవరైనా సరే బాబా విగ్రహం గానీ, ఫోటో గానీ, ఊదీ గాని, లేక పుస్తకమైనా గాని కావాలని కోరుకుంటే , బాబా వారి కోరికలని యేదోవిథంగా యెలాగోఅలా తీరుస్తారనేది నాకు అనుభవం ఇంకా విన్నాను కూడా. నేను ఈ పైన రాసిన దానికి సాక్ష్యం నేను ప్రచురించే రియాన్ యొక్క అనుభవం. సాయికి సంబంధించిన యేకోరికైనా సరే, అది యెంత కష్టమైనదైనా బాబా మనకోసం దానిని తీర్చి మన జీవితంలో తాను ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉంటారు. మనకు కావలసినదల్ల బాబా చెప్పిన రెండు నాణాలు, శ్రథ్థ, సహనం. ఇప్పుడు మీ అందరికోసం రియాన్ గారి మైల్ ని జత చేస్తున్నాను.
"సాయిరాం , ప్రియాన్ కా గారు, నేను ఈ రోజు సెలవులలో, అమెరికా లోని సురినాం లో జరిగిన నా అనుభవాన్ని చెపుతాను. డిసెంబరు 2008 లో నేను నా కుటుంబంతో సెలవులు గడపడానికి సురినాం వెళ్ళాను. నేనప్పుడూ నాతో కూడా బాబా ఫోటొ గాని, ఊదీ గాని, ధగా గాని తీసుకుని వెడుతూ ఉంటాను. సురినాం వెళ్ళినప్పుడు నేనెప్పుడూ యింటి బయటే ఉంటాను. నేను నా సంచీలో కొన్ని బాబా పోస్టర్స్, కొన్ని బాబా పుస్తకాలూ సద్దుకున్నాను. నాదగ్గిర ఊదీ కూడా ఉంది. సురినాం వెళ్ళగానే నేను మొట్టమొదట, బాబా పూజ చేసుకోవడానికి గది యెక్కడ ఉందా అని వెతికాను. విజిటింగ్ రూంలో ఒక పీఠం యేర్పాటు చేసి బాబా ఫోటోలతో చిన్న మందిరం తయారు చేశాను. మా అమ్మమ్మగారు సురినాం వచ్చినప్పుడు కొన్ని నెలల క్రితం నేనామెకు ఇచ్చిన కొన్ని బాబా ఫోటోలు కూడా పెట్టారు. ప్రతీరోజు ఉదయాన్నే నేను ఆమందిరం ముందు అంతటా నిండిఉన్న బాబా కి పూజ చేస్తూ ఉండేవాడిని. ప్రతీరోజు ఉదయాన్నే యేదైనా ఒక లీల చూపమని బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. ప్రతీసారి నేను మా కుటుంబంతో బజారుకి వెడుతూ ఉండేవాడిని. యెప్పుడు నేను "బాబా నీకు కూడా యేదైనా కొననీ, కానీ యెలా? యిది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ అమెరికాలో బాబా సామాగ్రికి సంబంధిచిన షాపులు యెక్కువ ఉండవు. కాలమలా గడిచిపోతోంది. రెండు వారాల తరువాత మేము ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాము. అది ఒక భారతీయ చీరల దుకాణం. అక్కడ నేను ఒక గాజు దానిలో ఉన్న బాబా విగ్రహాన్ని చూశాను. అదిచూడగానే పిచ్చెత్తినట్టయింది, అది యెంత అని అడిగాను. ఆ సాయి మూర్తిని చూశాక నేనెంతటి ఆనందం పొందానో నేను వర్ణించలేను. నేను నా తల్లితండ్రుల దగ్గిరకి వెళ్ళి కొందామని అడిగాను, కాని వాళ్ళు వద్దు అన్నారు. (నేనిక్కడ ఆ సాయి మూర్తిని కూడా జత చేస్తున్నాను).
నాకు చాలా విచారం వేసి, బాబా యెందుకిలా చేసావు అని అడిగాను. నాకు బాబా మీద చాలా కోపం వచ్చింది. నేను బాబాని " బాబా నేను రోజూ క్రమం తప్పకుండా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, నువ్వెందుకిలా చేస్తున్నావు" అని అడిగాను. ఆ రోజున షాపింగ్ అయిన తరువాత మేము మా కుటుంబ స్నేహితుల యింటికి వెళ్ళాము. మేము బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేద్దామనుకున్నాము. మా కుటుంబ స్నేహితులు ఒక షాపింగ్ మాల్ లో ప్రముఖమైన రెస్టారెంట్ ఉందని అక్కడికి రాత్రికి భోజనానికి వెడదామని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది యెందుకంటే నేను బాబా విగ్రహాన్ని యెక్కడైతే చూశానో అదే మేము వెళ్ళిన షాపింగ్ మాల్. నేను బాబాతో, "నువ్వు కనక నన్ను నిజమైన భక్తుడిగా భావిస్తే, నాలో నిజమైన శ్రథ్థ, సహనం ఉంటే, అందరు దేవుళ్ళూ ఒకరే అయితే, యింకా, అల్లాహ్, భగవాన్ ఒకరే అయితే, ఈ రోజు నీ సుందరమైన విగ్రహాన్ని నేను కొనేలా చెయ్యి" అన్నాను. మేము రెస్టారెంట్ కి వెళ్ళి రాత్రి భోజనం చేయడం మొదలుపెట్టాము. అప్పుడు సమయం రాత్రి 8,45 అయింది. నా సోదరి నన్ను రొయ్యలు ఇస్తావా అని అడిగింది. నేను అలాగే అని ఒప్పుకుని కాని ఒక షరతు, నేను రొయ్యలని ఇస్తే నువ్వు నాతో కూడా వచ్చి, నాకు బాబా విగ్రహాన్ని కొనిపెట్టాలి అన్నాను. ఆమె నవ్వుతూ సమాథానం చెప్పి సరే అంది. నేను, నా సోదరి బాబా విగ్రహాన్ని చూసిన అదే చీరెల దుకాణానికి వెళ్ళాము. ఈసారి నేను బాబా మూర్తిని కొనుక్కున్నాను. నేనింకా మిగతా బాబా విగ్రహాలని చూస్తున్నాను, కాని నా విగ్రహం మిగతావాటిక్నా ప్రత్యేకంగా ఉందని గ్రహించాను. ప్రత్యేకత యేమిటొ నేను మాటలలో వర్ణించలేను. అదే రోజు అదే షాపింగ్ మాల్ కి యెలా వెళ్ళామో , బాబా విగ్రహాని యెలా కొన్నానో నిజంగా నాకర్థం కాలేదు ఇప్పటికీ. ఇది బాబా నామీద చూపించిన లీల తప్ప మరేమీ కాదు. ఇది ఆయన చరణ కమలాల ముందు నా నమ్మకాన్ని మరింత పెంచింది. సురినాం లో ఉన్న సమయంలో బాబా నాకు తన దర్శనాన్ని కూడా ఇచ్చారు. ఆఖరి రోజున నేను బజారుకి వెళ్ళినప్పుడు తెల్లని దుస్తులలో ఉన్న ఒక మనిషిని చూశాను. అతను బాబా లాగా తలకు గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. అతను బాబా తప్ప మరెవరూ కాదని నాకు తెలుసు. నేను ఆ మనిషిని చూసిన మరుక్షణమే నేను, "బాబా నువ్విప్పుడు నీ భౌతిక శరీరంతో వచ్చావు, నా తప్పులన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాను" అన్నాను. బాబాని తన బిడ్డలనందరిని అనుగ్రహించమని కోరాను. నా జీవితాంతము వరకు ఈ లీలని మరచిపోలేను. తన బ్లాగులో ఈ సాయి లీలని ప్రచురించినందుకు ప్రియాంకా గారికి నా థన్యవాదాలు. బాబా అందరినీ దీవించుగాక. అల్లాహ్ మాలిక్ .
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
Sai Reunite You With Your Loved Ones - Experience By Sister Saba Khan
-
[image: shirdisaideva.com]
Sairam to all readers ,
When we develop our own spiritual health with our reflection the things
around us will also change an...
6 years ago
0 comments:
Post a Comment