30.06.2011 గురువారము
నమ్మకం వమ్ము కాదు (సాయి వ్రత మహిమ)
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీస్సులు
ఇప్పుడే అందిన బాబా లీల
ఈ రోజు బ్లాగులో యేమి ప్రచురిద్దామా అని కూర్చున్నాను. ఇవాళ గురువారము. ఆంగ్లబ్లాగులోది తర్జుమా చేసి ప్రచురిద్దామంటే చాలా సమయం తీసుకుంటుంది. అందుకని వెతుకుతున్నాను. ఈ లోగా విశాఖపట్నమునుంచి మా మరదలు ఫొన్ చేసి 9 గురువారముల వ్రతం మొదలుపెట్టగానే బాబా చూపిన లీల చెప్పడం జరిగింది. దానిని ఈ రోజు మీకు తెలుపుతున్నాను.
మన నమ్మకమే మనని సదా రక్షిస్తుంది. అందులోనూ బాబా మీద మనం పెట్టుకున్న నమ్మకం అదే మన పెట్టుబడి. ఈ పెట్టుబడిలో మనకి నష్టం వస్తుందన్న చింతే లేదు. అంతా లాభమే. ఈ రోజు చదివే లీల లో చూడండి. సాయి వ్రతం మొదలు పెట్టిన మరుసటి రోజునే బాబా తన అనుగ్రహ వర్షాన్ని యెలా కురిపించారో. ఒకొసారి మనం చూస్తూ ఉంటాము. అనుకోకుండా పెద్ద వర్షం వచ్చి మనమంతా తడిసిపోవడం. అలాగే అనుకోని విథంగా బాబా అనుగ్రహపు జల్లులో మనం యెంతో సేద తీరతాము. ఆయన అనుగ్రహం కూడా మనం ఊహించని విథంగా ఉంటుంది. బాబా యెవరిని యెప్పుడు యెలా అనుగ్రహిస్తారో అది అనుభవించాకే మనకి అర్థమవుతుంది.
సాయీ నీ లీలలను పొగడతరమా, నిన్ను అర్థం చేసుకోవడం మా తరమా, ఆ శక్తి ని మాకు నువ్వే ఇవ్వాలి.
ఇంతకు ముందు మా తోడల్లుడుగారయిన శ్రీ నవుడూరు రామ కృష్ణమూర్తిగారి అనుభవాలని ప్రచురించాను. ఈ మధ్య వారి అక్కగారి అమ్మాయి, ఆమె కూడా విశాఖపట్నములోనే ఉంటారు 9 గురువారముల సాయి వ్రతము చేస్తూ, కొంతమందిని కూడా పిలిచి తాంబూలం ఇవ్వడం జరిగింది. అప్పుడు వీరి యింటి పక్కనే ఉన్నావిడ కూడా వచ్చి మాటల సందర్భంలో తన బాథలు చెప్పుకోవడం జరిగింది. వారు అంత స్థితిపరులు కాదు. వాళ్ళమ్మాయి చాల బాగా చదువుతుందనీ, యింటర్మీడియట్ లో చేర్పించడానికి తగిన ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఒకాయన తను ఆర్థికంగా సహాయం చేస్తానన్నాడట. కాని ఆఖరికికి అమ్మాయిని కాలేజీలో చేర్పించే సమయం వచ్చేటప్పటికి తను డబ్బు ఇవ్వలేనని. చెప్పడం జరిగిందిట. యెంత బతిమిలాడినా కుదరదని చెప్పాడ.ట యెలాగోలా తరువాత సద్ది మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తామని అన్నా కూడా ఆ వ్యక్తి డబ్బు సహాయం చేయలేనని చెప్పేటప్పట్కి వీరికి యేమి చేయాలో పాలు పోలేదు. సాయి 9 గురువారముల వ్రతం చూడటానికి వచ్చి తను కూడా వ్రతం చేస్తానని పుస్తకం ఇవ్వమని అడిగారట. మా తోడల్లుడుగారి అన్నగారి అమ్మాయి, (అంటే ఆడపడుచు కూతురు)మా మరదలు యింటికి వచ్చి "అత్తయ్యా పుస్తకం నా వద్ద ఒక్కటే ఉంది, నేను పూజ చేసుకుని హారతి ఈచ్చేటప్పటికి 12 అవుతుంది, యెలాగా అని మా మరదలుతో చెప్పింది. అప్పుడు మా మరదలు తను వ్రతం పూర్తి చేసుకున్న తరువాత మిగిలిన రెండు పుస్తకాలలో ఒకటి ఇచ్చి ఆమెకు ఇమ్మనమని చెప్పారు. మా తోడల్లుడుగారి అమ్మాయి ఆ పుస్తకం తీసుకుని వెళ్ళి ఇచ్చారు. ఆవిడ మొదటి గురువారము నాడు శ్రథ్థగా వ్రతం మొదలుపెట్టారట. వారి యింటి పక్కనే బాబా గుడి ఉంది. మరునాడు శుక్రవారమునాడు ఆమె యింటిలో కుర్చీలో కూర్చుని గుడిలో బాబా ఆరతి అవుతుంటే వింటు మనసులో ఇలా అనుకున్నారట, " బాబా నీమీద యెంతో నమ్మకంతో ఈ వ్రతం మొదలు పెట్టాను. అమ్మాయిని కాలేజీలో చేర్పించాలి. థన సహాయం చేస్తానన్న ఆయన డబ్బు సద్దలేనంటున్నాడు. యెలా బాబా" అని అనుకున్నారట. అనుకున్న 5 నిమిషాలలోనే యింతకు ముందు సహాయం చేస్తానన్న వ్యక్తి ఆవిడకి ఫోన్ చేసి తను డబ్బు ఇస్తానని, కాలేజీ ఫీజు కట్టడానికి నేరుగా కాలేజీ కే వచ్చి ఫీజు కట్టేయమంటారా, లేకె మీ యింటికే వచ్చి డబ్బు ఇమ్మంటారా అని అడిగాడట. ఈ విడకి బాబా వ్రతం మొదలుపెట్టగానే బాబా చూపించిన ఈ లీలకి యెంతో ఆశ్చర్యం, ఆనందం వేసి, యింటికే వచ్చి డబ్బు ఇమ్మని చెప్పడం జరిగింది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment