03.06.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు శుభాశీస్సులు
నామస్మరణే రక్షణ
ఈ రోజు సుకన్యగారు సేకరించి పంపిన ఒక సాయి లీలను తెలుసుకుందాము. ఈ లీలని భూషన్ గారు పంపించారు.
మనం యెల్లప్పుడు ఆయన నామ స్మరణ కనక చేస్తూ ఉంటే యెటువంటి ప్రమాదాలనుంచైనా బాబా మనలని కాపాడుతారు. అలా నామస్మరణ చేసే అలవాటు ఉన్నప్పుడే మనం ప్రమాదం జరిగినప్పుడు అప్రయత్నంగా బాబా అంటాము. అన్న మరుక్షణమే బాబా మనలని ఆ ప్రమాదం నుంచి బయటపడవేస్తారు. ఈ లీల చదవండి బాబా జరగబోయే ప్రమాదం నించి సురక్షితంగా యెలా తప్పించారొ తెలుస్తుంది
ఈ లీల ఆయన మాటలలోనే.
ఆ రోజు దీపావళి (నవంబరు,5 2010). అందరూ కూడా ప్రతీచోటా దీపాలు వెలిగించి బాణా సంచాలు కాలుస్తూ ఆనందిస్తున్నారు. నేను కూడా, యెన్నో దీపాలు, లైట్లు వెలిగించి, బాణా సంచా కాలుస్తు, తీపి పదార్థాలు స్వీకరించి చాలా అనందంగా జరుపుకుంటున్నాను. అన్ని చోట్లా చిన్న పిల్లలతో కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకుంటూ వాతావరణమంతా చాలా ఆనందకరంగా ఉంది. రాత్రి 9.30 ప్రాతంలో మా కుటుంబమంతా కూడా అందరం కలిసి కూర్చుని బాణా సంచా కాలుస్తు, చూస్తూ చాలా ఆనందిస్తున్నాము. మా అబ్బాయి విథాన్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కాని వాడికి ఆటం బాంబు అంటే భయం. ( ఆ బాంబుకు చాలా గట్టిగా చుట్టబడిన ఆకుపచ్చరంగు తాడు ఉంది). అంచేత దానిని ముట్టుకోవడం కూడా చేయటల్లేదు. బాంబులున్న పెట్టెలు యెలా ఉన్నవి అలా పడి ఉండటం చూశాను నేను, ఆ బాంబు తీసి కాల్చమని చెప్పాను మా అబ్బాయికి. మా అబ్బాయి, " నాన్నా నేను కాల్చను, నువ్వే కాల్చు" అన్నాడు. నేను పెట్టిలోంచి కొన్ని బాబులు తీసి కాల్చడం మొదలు పెట్టాను. ఢాం... ఢాం... అని పేలుతున్నాయి. అలా వరుసగా 5-6 బాంబులదాకా పేల్చాను.
కాని అనుకోకుండా ఒక బాంబు హటాత్తుగా నా అరచేతిలోనే పేలిపోయింది. (దాని వత్తి చాలా చిన్నదిగా ఉంది). నేను వెంటనే "సాయిబాబా" అని గట్టిగా అరిచాను. నా చుట్టూ నల్లగా చీకట్లు కమ్ముకున్నాయి. నాకేమీ కనపడటంలేదు. నాకేమి జరిగిందో నాకర్థమవలేదు. నేను చాలా పెద్ద ప్రమాదంలో పడ్డాను. నా కుటుంబంలోనివారంతా ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామానికి చాలా ఆత్రుతతో నా దగ్గిరకి పిచ్చిగా పరిగెత్తుకుని వచ్చారు.
నా కుటుంబలోని వారు, చుట్టుపక్కలవారు కూడా నాకు చాలా పెద్ద గాయమే అయి ఉంటుందని భావించారు. నా కుడి చేయి పూర్తిగా నల్లగా, మంటగా ఉంది.
అందరూ కూడా, యెలా ఉన్నావు, యేమైంది?..యిపుడెలా ఉంది అని అడగటం మొదలెట్టారు.
చల్లటి నీరు పోసిన తరువాత నా చేయి చల్లగా, శుభ్రంగా, మామూలుగా ఉంది. నా అరచేతిలో యెటువంటి మచ్చా లేదు. నాకు యెటువంటి నొప్పి, మంటా లేదు. అసలేమీ లేదు.
అలా నా సాయి నన్ను మరొకసారి రక్షించాడు. ఈ విషయం విన్న అందరూ ఆశ్చర్యపోయి నమ్మలేదు. మా కుటుమబంలోనివారంతా కూడా ఒకే మాట అన్నారు "బాబాయే రక్షించారు" అని.
నేనెప్పుడూ నా భక్తుల యోగక్షేమాలు కనిపెడుతూ ఉంటాను, అన్ని ప్రమాదాలనుంచీ కాపాడుతూ ఉంటాను అన్న సాయినాథ్ మహరాజ్ మాటలు యెప్పుడు నిజమవుతూనే ఉన్నాయి.
నా జీవితంలో జరగవలసిన పెద్ద ప్రమాదాన్నించి బాబాగారు కాపాడారు. ఈ సంఘటన చిన్నదే కావచ్చు. కాని నాకు మరపురాని సంఘటన.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment