Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, February 1, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (19)

Posted by tyagaraju on 7:17 AM


01.02.2012 బుధవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 19 వ. భాగాన్ని చదువుకుందాము

సాయి.బా.ని.. డైరీ - 1994 (19)

04.07.1994

నిన్నటిరోజున న్యాయము - అన్యాయము గురించి చాలా సేపు ఆలోచించి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధా - అన్యాయముతో నిండిన ప్రపంచములో సాయి బంధువులు ఎలాగ బ్రతకాలి చెప్పుతండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు మరియు శ్రీ సాయి యిచ్చిన సందేశము.

1. పది రోజులు రాత్రి పగలు కష్ఠపడి సైకిలు త్రొక్కి గిన్నీసు పుస్తకములో పేరు తెచ్చుకొన్న వ్యక్తిని కనీసము పలకరించరు ప్రజలు అదే రాజకీయనాయకుడు కాకపోయినా ఖద్దరు బట్టలు ధరించి రాజకీయనాయకుడిలాగ చలామణి అయితే వానికి ప్రజలు బ్రహ్మరధము పడతారు. యిది ఎక్కడి న్యాయము.

2. చదువురానివాడు బ్లేడ్స్ కంపెనీ పెట్టి లక్షలు కి లక్షలు సంపాదించుతున్నాడు. బాగా చదువుకున్నవాడు ఉద్యోగము లేక వానాకాలములో గొడుగులు బాగు చేస్తామని రోడ్డు మీద తిరుగుతున్నాడే, యిది ఎక్కడి న్యాయము.

3. పెళ్ళిళ్ళలో అందరి ఆకలి ఒక్కటే మరి మగ పెళ్ళివారు భోజనాలు పూర్తి చేస్తేగాని ఆడ పెళ్ళివారు భోజనాలు చేయకూడదు. యిది ఎక్కడి న్యాయము.

4. ఫ్యాక్టరీలో పని లేదని ఊరికే కూర్చోలేక మిషన్స్ కు ఉన్న కరెంటు తీగలు పీకటము, మరియు దొంగిలించటము - యిది ఎక్కడి న్యాయము. యిటువంటి అన్యాయాల గురించి ఆలోచించేబదులు నీవు న్యాయమైన మార్గములో ప్రయాణము చేస్తు శ్రీ సాయికి ప్రీతిపాత్రుడువి కావాలి.

05.07.1994

నిన్నటిరోజున జీవితములో ప్రశాంతత పొందటము ఎట్లాగ అని చాలా సేపు ఆలోచించినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయిని "ప్రశాంతతకు మార్గము చూపమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "ప్రసాంతి అనేది వేరేగా ఎక్కడ దొరకదు. ప్రశాంతముగా జీవించాలి అనె కోరిక మనిషిలో కలగాలి. అప్పుడే మనిషికి ప్రశాంతత లభించుతుంది." ఉదాహరణగా అటు చూడు. లేడీ డాక్టర్ తన భర్తతోను, యిద్దరు పిల్లలతోను ఎన్ని చికాకులు ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆ రోగులకు సేవ చేయుచున్నది.

2) ఆ ధనవంతురాలును చూడు ఆమె యిద్దరు పిల్లలు బస్సు ప్రమాదంలో చనిపోయిన ఆమె ప్రశాంతముగా బ్రతుకుచున్నది.

3) ఆ కూరగాయల మార్కెట్ లో ఆలంబాడి స్త్రీ తన యిద్దరు పిల్లలను చెంతనే యుంచుకొని కూరగాయలు అమ్ముకొంటు ప్రశాంతముగా జీవించుతున్నది. ఈ దృశ్యాలు చూసిన తర్వాత నాకు మెలుకువ వచ్చినది. లేచి శ్రీ సాయికి నమస్కరించినాను.

11.07.1994

నిన్నటి రోజున సత్ సంగాల గురించి ఆలోచించినాను. రాత్రి నిద్రకుముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ ఈ సత్ సంగాలగురించి నీ సలహా ఏమిటి?" దయచేసి తెలియచేయమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "సత్ సంగాలలో తెలుసుకొన్న విషయాలను ఆచరణలో పెట్టిననాడే ఆ సత్సంగాలకు ఒక ప్రయోజనము యుంటుంది. సత్ సంగాలలో యిష్ఠులు, అయిష్ఠులు అనే భావము యుండరారు. సత్సంగములో అందరూ సాయి బంధువులే అనే విషయాన్ని నమ్మాలి."

12.07.1994

రోజు ఉదయము రాత్రి శ్రీ సాయికి హారతి యిస్తున్నానే కాని మనసుకు తృప్తి కలగటము లేదు. శ్రీ సాయి నన్ను అనుగ్రహించటము లేదు అనే ఆలోచనలు కలగసాగినవి. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా సమస్యకు పరిష్కార మార్గము చూపమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నా సమస్యకు పరిష్కారము ప్రసాదించినది. వాటి వివరాలు. "నేను చిన్నప్పటినుండి నా ప్రాణ స్నేహితుడు హెచ్.ఆర్. తో కలసి మెలసి యున్నాను.

నాకు నా స్నేహితుడు ఆరవప్రాణము. నేను అతనికి ఎంత చేరువగా యున్న అతను నన్ను సాధారణ స్నేహితునిగానె చూడసాగినాడు. కాని అతని తల్లి, యితర కుటుంబ సభ్యులు నన్ను చాలా ప్రేమతో చూడసాగినారు. నా స్నేహితుడు ఏనాడు నాకు సహాయము చేయలేదు. విచిత్రము ఏమిటంటే నా స్నేహితుని కుటుంబ సభ్యులు నాకు జీవితములో చాలా సహాయము చేసినారు." నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఈ దృశ్యము నాగత జీవితమునకు సంబంధించినది. శ్రీ సాయికి నాగత జీవితము పూర్తిగా తెలుసు. ఈ దృశ్యము ద్వారా శ్రీ సాయి నాకు యిచ్చిన సందేశము ఏమిటి అని ఆలోచించినాను. నేను అర్థము చేసుకొన్న సందేశము "నీవు పవిత్రమైన ప్రేమతో నన్ను ఫుజించు. నేను ఏదో ఒక రూపములో నీకు సహాయ సహకారాలు అందించుతాను. యిది నా వాగ్దానము." యింకొన దృశ్యములో శ్రీ సాయి ఒక కంటి డాక్టర్ రూపములో దర్శనము యిచ్చినారు.

కొంతమంది సాయి భక్తులు ఆయన దగ్గరకు తమ కళ్ళు పరీక్షింపచేసుకోవటానికి వెళ్ళినారు. ఆ డాక్టర్ తన దగ్గరకు వచ్చినవారితో చిలిపిగా మాట్లాడసాగినారు. కొంతమంది ఆయన చిలిపి మాటలకు సహనము కోల్పోయి వెళ్ళిపోయినారు. అపుడు ఆ కంటి డాక్టర్ (శ్రీ సాయి) అంటారు "నా చిలిపి మాటలకి సహనము కోల్పోతే ఎవరికి నష్ఠము. శ్రధ్ధ, సహనముతో ఉన్నవారికే నేను జ్ఞాన నేత్రాలు ప్రసాదించుతాను.

(యింకా ఉంది)


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List