Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, September 11, 2012

నిష్కామ భక్తి (మొదటి భాగం)

Posted by tyagaraju on 8:55 AM


                                
11.09.2012  మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు. 

ఈ రోజు పేరు చెప్పని ఒక సాయిభక్తుని బాబా లీలను తెలుసుకుందాము.  ఇందులో మనకు నిష్కామ భక్తి గురించి తెలుసుకోవచ్చు. 
ప్రతీ మానవుడు సహజంగా భగవంతుడిని కోరికలతోనే పూజిస్తారు.  కోరికలు లేకుండా పూజించేవారు చాలా అరుదు.  మమనకి జీవితంలో అన్నీ కావాలనిపిస్తుంది.  ఏవైతే మనకి లభ్యం కావో వాటి గురించి భగవంతుని పూజిస్తూ కోరికని వెళ్ళడించి వాటిని తీర్చమని అర్ధిస్తూ ఉంటాము.  మనం  కోరకపోయినా మనకేది కావాలో , ఎప్పుడు మనకి ఇవ్వాలో భగవంతునికి తప్ప మరెవరికి తెలుస్తుంది?  

ఇక చదవండి.



నిష్కామ భక్తి (మొదటి భాగం)


షిరిడి సాయిబాబా తో నా మొదటి అనుభవం. (స్కూల్ కి వెళ్ళే రొజుల్లో - బాబాగురించి   ,ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్న క్షణం)

నా స్కూల్ చదువు అంతా అహమ్మదాబాద్ లోజరిగింది. .నేను చిన్నపుడు స్కూల్ కి వెళ్ళే  రోజుల్లో  సాయిబాబా గురించి నాకు తెలుసు. కాని సాయిబాబా మీద అంత ఎక్కువ నమ్మకం,భక్తి వుండేవి కావు..అప్పుడప్పుడు బాబా గుడి కి వెల్లే వాడిని.మా అమ్మ గారికి  బాబా మీద గొప్ప నమ్మకం.ప్రతి రోజు సాయి సచ్చరిత్ర పారాయణం చేసేది­.మా అమ్మ నాతో ఎప్పుడు సచ్చరిత్ర పుస్తకం యొక్క గొప్పతనం,మహిమ గురుంచి, ఎవరైనా సరే పారాయణ  చేసిన తరువాత వారి కోరికలు నెరవేరతాయనీ చెపుతూ ఉండేదినేను 10 తరగతి చదువుతున్నపుడు ఒక రోజు నేను లెక్కలు హోంవర్క్ చేస్తూ వుండగ మా అమ్మ నా పక్కన కూర్చొని సాయి సత్చరిత్ర  చదువుతున్నది. అపుడు నేను మా అమ్మతో పుస్తకం యెందుకు చదువుతున్నావు, దీని వల్ల సమయం అంతా వ్యర్థమే కాని ప్రయోజనం ఏమి లేదు అన్నాను.నీ సచ్చరిత్ర పుస్తకానికి నా మాథ్స్ పుస్తకానికి (నవనీత్ ప్రకాషన్ బుక్-10 క్లాస్ మాథ్స్ పుస్తకంతేడా ఏముంది.రెండు పుస్తకాల పేజీల సంఖ్యబరువు ఒకటే. ఇందులో ఉన్న లెక్కలన్నీ చేయగలిగితే నాకు శక్తి వస్తుందిఅప్పుడు అమ్మ  " నీవు ఇంకా చిన్న వాడివి,నీకు బాబా మహిమ గురుంచి తెలీదు '  అని వంట గదిలోకి వెళ్ళింది.  అప్పుడు నేను సాయి సచ్చరిత్ర పుస్తకం ఎడమ చేతిలోకి  మరియు నా మాథ్స్ పుస్తకాన్ని కుడి చేతిలోకి తీసుకున్నానునేను ఐదు సార్లు ఇలానే చేసానునేను పుస్తకం యొక్క మహిమగొప్పతనం తెలుసుకోవాలని రెండు పుస్తకాలను నా నుదుటికి తగిలించానువెంటనే ఎవరో లాగినట్టు నా కుడి చేతిలోంచి మాథ్స్ పుస్తకం జారి క్రింద పడిందినా ఎడమ  చేతిలొ సచ్చరిత్ర పుస్తకం అలానె వుందినా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. భయంతో నా గుండె వేగంగ కొట్టుకోసాగిందిఅప్పుడు బాబా యొక్క శక్తి మరియు సచ్చరిత్ర గొప్పతనం తెలుసుకున్నానునాకు 10 తరగతిలో  బాబా దయ వలన  88 మార్కులు వచ్చాయి.

సాయిబాబా తో నా రెండవ అనుభవం   (డిగ్రీ 3 సంవత్సరం- నిజమయిన భక్తి అనే గురు మంత్రం ఇచ్చిన సమయం)


నా 12 తరగతి తర్వాత బి.ఫార్మసి డిగ్రీ చెయ్యడానికి పూనా వెళ్ళానుఅక్కడ మా అత్తయ్య  ఇంటి దగ్గర ఒక అందమైన బాబా గుడి వుంది (బ్రాంజ్ తో చేసిన బాబా విగ్రహం). రొజూ కాలేజ్ కి వెళ్ళే ముందు బాబా గుడి కి వెడుతూ ఉండేవాడిని. నేను  బాబా గుడి కి ఒకే ఒక కారణంతో వేళ్ళేవాడిని పోటీ  ప్రపంచం లో నెగ్గుకు రావా లంటే మంచి మార్కులు రావాలి.  కాబట్టి బాబాను మంచి మార్కుల కోసంఫస్ట్ రాంక్ కోసంనాకు సహాయం చేయమనీ ఇలా  ప్రార్థించేవాడిని. డిగ్రీ మూడవ సంవత్సరము చదువుతున్నపుడు ఒక రోజు రాత్రి  నిద్రపోతుండగ వేకువజామున చీకట్లో 2 గంటలకి మెలుకువ  వచ్చినా చేతులు అనుకోకుండ ఒక చిన్నపుస్తకం మీదపడ్డాయి. . ఆపుస్తకం ఏమిటా అని తీసి చూస్తే దాని మీద సాయిబాబా ఫోటో , దాని పైన "నిష్కామ భక్తిఅని రాసి వుందిఆపుస్తకం నా టేబుల్ మీదకి ఎలా వచ్చిందో నాకు అంతు బట్టలేదునేను పుస్తకం తీసుకొని చదవడం మొదలు పెట్టాను. చదవడం పూర్తి అయ్యేసరికి  నా కళ్ళు  పూర్తిగ చెమ్మగిల్లాయి. కంటి నుండి నీరు రావడం మొదలైందిఅప్పుడు నాకు పూర్తిగ అర్థం అయ్యింది .నాది నిజమైన భక్తి కాదునా భక్తి ప్రేమ తో కూడిన భక్తి కాదు ,స్వార్థం తో కూడిన భక్తి అని తెలుసుకున్నాను రోజు నుండి  నేను నిజమైన భక్తి కోసంనిజమైన దేవుడి కోసం అన్వేషించానునా కళ్ళుతెరుచుకున్నాయి.  నేను నిష్కామ భక్తి తో దేవుని ప్రార్థించడం మొదలు పెట్టానుమరుసటి రోజు మా అత్తయ్యని    పుస్తకం గురించి అడిగాను పుస్తకం  తనకు బాబా గుడి లో ఎవరో ఇచ్చారని ,తొందర్లో  వుండి పొరపాటున  క్రిందటి  రోజు ఆపుస్తకం నేను చదువుకునే టేబుల్  మీద పెట్టినట్లు చెప్పిందినాకు బాబా యొక్క దీవెనలు,ఆశీస్సులు అందాయినేను నా గురువైన బాబా మీద  భారం వేసి బాబా పాదాలను నమ్ముకున్నాను.

సాయిబాబా తో నా మూడవ అనుభవం.చివరికి బాబా నన్ను కలిసిన సమయం (4 సంవత్సరం)


అప్పటినుండీ నేను నిష్కామ భక్తితో పూజ చేయడం ప్రారంభించాను. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదవడం మొదలుపెట్టాను.నా డైరీలో బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడినినిజంగా నాకది ఎంతో ఇష్టంగా ఉండేది. .నేను  డిగ్రీ ఫోర్త్ ఇయర్ లో  వుండగ  స్పోర్ట్స్ వీక్ లో క్రికెట్ మ్యాచ్  జరిగింది. మ్యాచ్ లో మా జట్టు ఫైనల్స్ కి చేరింది.ఫైనల్స్ లో ఆడుతుండగ  ఒక రన్ పూర్తి కావడం కోసం దూకానుఅలా దూకడం లో నా కుడి భుజం నుండి నా కుడిచేయి పూర్తిగా పట్టు తొలగింది (భుజము వద్ద ఉండే కీలులోనించి ఎముక స్థానం తప్పిందిభరించలేనంత నొప్పికలిగిందిఅందరు నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు .నాకు ఆపరేషన్ చేసారు.  ఆపరేషన్ అయ్యాక సాయిబాబా ని తలచుకొని "బాబా నేను నీ బిడ్డను ,నీవు నా ప్రియమైన తండ్రివి.మరి నన్ను కనీసం చూడడానికైన  ఎందుకు రాలేదు బాబా.నా విషయం లో ఎందుకు ఇంత నిర్దయుడిగ ఉన్నారు"  అనుకుంటూ ఏడుస్తున్నానుమరుసటి రోజు నన్ను చూడడానికి నాసహాధ్యాయి,  ప్రియమైన  స్నేహితుడు మా అత్తయ్య ఇంటికి వచ్చాడుఅతడు నాకు ఒక బహుమతి ఇచ్చాడునేను బహుమతి తెరచి చూడగానే   నోట మాట రాకుండ స్తబ్దుణ్ని అయి  అలానే చూస్తుండిపోయాను.   బహుమతి మరేమిటో కాదు నా ప్రియమైన తండ్రి  బాబా మీడియం సైజ్ ఫోటో ఫ్రేంఅందులో బాబా పసుపు వస్త్రం ధరించి ఎంతో అందంగ వున్నారుబాబా నన్నే చూస్తున్నట్టు,పలకరిస్తునట్టునన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది.  



నేను బాబాను నన్ను చూడడానికి  రాలేదని క్రితం రోజు అడిగినందుకు బాబా నన్ను చూడడానికికలవడానికి వచ్చారు.నేను నా స్నేహితుడిని బాబా ఫోటో ఎలా వచ్చింది,ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడిగానుఅతడు  వాళ్ళ నాన్న గారు షిరిడికి వెళ్ళినపుడు , అందమైన బాబా ఫోటో ఫ్రేం  తెచ్చాడని చెప్పాడు. మీకు ఎవరికైతే ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళకివ్వమని వాళ్ళ నాన్నగారితో అతడు చెప్పాడట.   రోజు వరకు నేను బాబా ఫోటో ను  పూజిస్తున్నాను. నాకు బాబా గారు ఎప్పుడు నీతో నేను వున్నాను అని చెప్తునే వున్నారు.

(ఆఖరి భాగం రేపు)

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List