27.07.2014 ఆదివారము (విజయవాడనుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 3వ.భాగం
ఇంతకుముందే నేను శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయంలో బాబా చెప్పిన మాటలు మీకు వివరించాను. బాబా తనమతం 'కబీర్ 'అని చెప్పారు. కబీర్ 1398 లో జన్మించాడు. కబీర్ 1518లో మహాసమాధి చెదాడు. అంటే కబీర్ 120 సంవత్సరాలు జీవించాడు. హేమాద్రిపంత్ శ్రీసాయి సత్ చరిత్రలో బాబా 1838సం. లో జన్మించి ఉండవచ్చని వ్రాశారు.
ఇప్పుడు మనం 1838 సం.వెనుకటి కాలానికి వెడదాము. బాబాకు ముందు ముగ్గురు బాలురు నేతపనివారుగా పని చేస్తున్నారు.
ఇప్పుడు మనం వారి వయస్సుల ప్రకారం వారు పొందిన జీతాలను విశ్లేషిద్దాము. మూడవ బాలుడు 1688లో జన్మించి ఉండవచ్చు. రెండవ బాలుడు 1588 లో జన్మించి ఉండవచ్చు. కబీర్ 1518లో మహాసమాధి చెందాడు. అంటే దానర్ధం కబీర్ శరీరంలోని ఎముకల ప్రభావం లేక శక్తి 1538సం.వరకు ఉంది. వాటి శక్తి కొంత కాలంవరకు మాత్రమే ఉంది. కారణం కబీర్ భౌతిక శరీరం దహనం చేయబడలేదు. భూమిలో పాతిపెట్టబడలేదు. ఆయన శరీరం పవిత్ర గంగానదిలో విసర్జింపబడింది. చుట్టుప్రక్కలనున్న వివిధ వాతావరణ ప్రభావాల వల్ల కబీర్ శరీరంలోని ఎముకలు బూడిదగా మారిపోయి ఉండవచ్చు.
అందువల్ల తార్కికంగా ఆలోచిస్తే సమాజం కోసం భగవంతుడు ఆనలుగురు బాలురను నియమించి ఉండవచ్చు. ఆనలుగురి బాలురలో నాలుగవవాడయిన సాయిబాబా 1838లో జన్మించి ఉండవచ్చు. ఆరువందల సంవత్సరాల వరకు ఆయన కీర్తి, ప్రభావం వ్యాప్తిలో ఉండేలాగ అనుగ్రహింపబడ్డారు.
సగటు మానవుని వయస్సు 100సంవత్సరాలకు మించి ఉండదు. ఎముకలు ఆరువందల సవత్సరాలకు పూర్తిగా శిధిలమయిపోతాయని శాస్త్రజ్ఞులు సిధ్ధాంతీకరించారు. నాలుగవ బాలుడు సాయిబాబా అనె భావించాలి. బాబా మహాసమాధి చెందిన 1918వ.సంవత్సరం నుండి ఆయన అస్థిత్వం, శక్తి 2518వ.సంవత్సరం వరకు నిలిచి ఉంటాయి.
ఆతరువాత, సమాధి మందిరంలో నున్న పొడి 2518సం.తరువాత వేరొక రూపంలో తన శక్తిని ప్రసరింపచేస్తుంది.
విజ్ఞాన శాస్త్రం ప్రకారం శక్తిని మనం స్శృష్టించలేము, నాశనం చేయలేము. మనము పరిశ్రమలలో యంత్రాలను నడపడానికి, వేడిని ఉత్పత్తి చేయడానికి, బల్బులు వెలిగించడానికి, నీటినుండి యితర వనరుల నుండి విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేస్తున్నాము.
అన్నింటిలో కూడా శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది. అదే విధంగా సమాధి మందిరంలో ఉన్న ఎముకలు 2518సం.తరువాత కూడా తన భక్తుల ప్రయోజనం కోసం, మరొక రూపంలో తమ శక్తిని వెదజల్లుతూనే ఉంటాయని నేను భావిస్గ్తున్నాను. ఇది నాప్రగాఢ విశ్వాసం.
శ్రీసాయి సత్ చరిత్ర 3వ.అధ్యాయంలో బాబా "సృష్టి స్థితి లయ కారకుడను నేనే, నేనే జగన్మాతను" అని చెప్పారు.
అందుచేత సాయి యొక్క ప్రభావం, శక్తి అనంతమని నేను నిర్ధారిస్తున్నాను. "నాసమాధి నుండే నా ఎముకలు మాటలాడును. నాభక్తులను నా సమాధినుండే రక్షిస్తాను" ఈ మాటలు సత్యమని నేను నిర్ధారిస్తున్నాను.
ఇప్పుడు మనం 'సాయిబాబా' అన్న పేరులోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము.
ఆర్థర్ ఆస్ బోర్న్ తన పుస్తకంలో పెర్షియన్ భాషలో 'సాయి ' అంటే సాధువు అని వ్రాశాడు. హిందీలో 'సాయీ అంటే తండ్రి అని అర్ధం. బాబా యువకుడయిన ఫకీరుగా 1858 సం.లో చాంద్ పాటిల్ పెళ్ళి బృందంతో షిరిడీలో అడుగు పెట్టారు.
మహల్సాపతి ఆయనను 'రండి సాయీ అని ఆహ్వానించారు.
ఆరోజునుండి ఆయన 'సాయిబాబా' గా మనకందరికీ ఆరాధ్య దైవమయ్యారు. నా ఉద్దేశ్యంలో 'సాయీ అన్నపదం మన సనాతన ధర్మంలో లక్షల సంవత్సరాలుగా వాడుకలో ఉంది.
మనం శ్రీమాహావిష్ణువును శేషసాయిగాను, శ్రీకృష్ణ పరమాత్మను వటపత్రసాయిగాను వ్యవహరిస్తున్నాము. ఇక్కడ ఈరెండిటిలోను 'సాయి ' అన్న పదానికి రెండు అర్ధాలు ఉన్నాయి.
ఒకటి 'స్వామీ మరొకటి 'భగవంతుడు శయనించినట్లుగా ఉన్న భంగిమ. ఆఖరికి రెండిటిలోను మనకి ఒకే విధమయిన పవిత్రత గోచరిస్తుంది. ఆంగ్లంలో 'సాయీ అన్న పదానికి అర్ధమేమయినా ఉందా అని ఆలోచించాను. ఈవిధంగా ఆలోచన చేస్తూ 20వ.శతాబ్దవు చాంబర్స్ డిక్ష్ణరీలో 'సాయీ అన్న పదానికి అర్ధం దొరకుతుందేమోనని పరిశీలించాను. నాకళ్ళను నేను నమ్మలేకపోయాను. దక్షిణ అమెరికాలోని బ్రెజలియన్ అడవులలోని వానరాన్ని అక్కడి ప్రజలు సాధారణంగా సాయి అని పిలుస్తారని ఉంది. లక్షల సంవత్సరాల క్రితం మానవుడు కోతినులంచే పుట్టాడని డార్విన్ సిధ్ధాంతీకరించాడు. అదే వానర రాజయిన 'మారుతీ.
(సాయి పాఠకులకు 20 th సెంచరీ చాంబర్స్ డిక్షనరీ లోని సాయి
అన్నపదానికిఅర్ధము ఉన్న పేజీ 833 లింక్ ఇక్కడ ఇస్తున్నాను. చూడండి.
బహుశ అందుకే మంత్రాలలో మనం సాయిని శివ,రామ,కృష్ణ,మారుతి, ఆదిత్య విశ్వరూపాయ అని చదువుతాము. అందుకనే సాయి అన్నది పవిత్రమయిన నామం.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment