Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, May 28, 2015

శ్రీ షిరిడీసాయి వైభవం మన సమస్యలు - శ్రీసాయి సత్ చరిత్ర సమాధానాలు

Posted by tyagaraju on 1:36 AM
                                    Image result for images of shirdisaibaba
                            Image result for image of rose hd

28.05.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మా స్వస్థలం నరసాపురం నుండి హైదరాబాదు కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాను.  ఈ కారణం చేత బ్లాగులో ప్రచురణలకు చాలా ఆలశ్యమవుతూ వచ్చింది.  బాబా ఆశీర్వాదంతో నిజాంపేటలో ఫ్లాటు కొనుక్కొని క్రిందటి నెలలోనే గృహప్రవేశం కూడా అయ్యాము.  ఇకనుంచి వీలువెంబడి బ్లాగులో బాబావారి కి సంబంధించిన లీలలు, తత్వం ప్రచురిస్తూ ఉంటాను.

అమెరికాలో సాయిదర్బార్ ను నిర్వహిస్తున్న బదరీ నరసిం హన్ గారు ప్రచురించే "ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి" ఈ మాగజైన్ నుండి సాయిబాబా వారి లీలలు, ఇతర ఆధ్యాత్మిక విషయాలు శ్రీ షిరిడీ సాయి వైభవం పేరుతో ప్రచురిస్తాను.  తెలుగులోకి అనువదించి ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన సాయిదర్బార్ యూ. ఎస్. ఏ.ఓఆర్గ్.  (saidarbarusa.org) నిర్వాహకులు శ్రీ బదరీ నరసిం  హన్  గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.   

ఈ రోజు దీ గ్లోరీఆఫ్ షిరిడీసాయి పాతసంచిక అక్టోబరు 2009 వ.సంవత్సరం లోని ఒక బాబా లీల చదవండి. 

శ్రీ షిరిడీసాయి వైభవం 
మన సమస్యలు - శ్రీసాయి సత్ చరిత్ర సమాధానాలు

శ్రీసాయి సత్ చరిత్ర ఒక మహిమాన్విత గ్రంధమని మన సాయి భక్తులందరికీ అనుభవమే.  శ్రీ సాయి సత్ చరిత్ర, బాబా, వేరు కాదు.  సాయి సత్చరిత్రలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి.   ప్రతీ మాట, పదం అన్నీ కూడా బాబా వారు స్వయంగా చెప్పిన మధుర వాక్కులు.  సత్ చరిత్రను ప్రతీ రోజు పారాయణ చేసేవారు తమ సమస్యలకు బాబా వారి సమధానాలను కూడా సత్ చరిత్ర ద్వారానే తెలుసుకుంటూ ఉంటారు.  ఏదయినా సమస్య ఎదురయినప్పుడు కనులు మూసుకొని బాబాని మనస్పూర్తిగా ప్రార్ధించి పరిష్కారం చూపించమని చరిత్రలోని ఏదో ఒకపేజీ తీసి చూస్తే ఆ సమస్యకు పరిష్కారం కనపడుతుంది.


ఈ రోజు మీరు చదవబోయేది అటువంటి సంఘటనే.  ఇక చదవండి.

ఇది శ్రీహరికిరణ్, హైదరాబాదు వాస్తవ్యులు గారు వ్రాసిన అనుభవం.  

ఈ మధ్యనే నాభర్తకు కలిగిన అనుభవాన్ని వివరిస్తాను. ప్రతిరోజు నేను నా భర్తకన్నా ముందుగానే నిద్రనుండి మేల్కొంటాను.  ఒకరోజు ఉదయాన్నే ఆయన నాకన్నా ముందే నిద్రలేచి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నారు.  తను మాట్లాడే మాటలవల్ల నాకర్ధమైందేమిటంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్లలో పెట్టుబడి పెట్టడానికి తన స్నేహితునితో సంప్రదిస్తున్నారు.  ఆయన స్నేహితుడు ఒక షేర్ బ్రోకరు.  నాభర్త షేర్లలో పెట్టుబడి పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.  ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే త్వరలోనే ఆ కంపెనీ షేరు విలువ బాగా పెరిగి లాభాలు విపరీతంగా  వస్తాయని ఆతరువాత నాతో చెప్పారు.  
Image result for shares images

నా భర్తకి బాబా అంటే చాలా నమ్మకం.  కొద్ది రోజులుగా సాయి సత్ చరిత్ర పారాయణ కూడా మొదలు పెట్టారు.  ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే సత్ చరిత్రలోని ఏదో ఒక పేజీ తీసి చదువుతారు.  ఆరోజున స్నానం చేసిన తరువాత పూజా మందిరం లో కూర్చొని సత్ చరిత్ర చేతిలోకి తీసుకొని ఒక పేజీ తెరిచారు.  ఆశ్చర్యం, అది 25వ. అధ్యాయం.  ఆ అధ్యాయంలో దామూ అన్నా ప్రత్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అధిక లాబాలను గడిద్దామని, దాని కోసం బాబా సహాయం కోరదలచిన సంఘటన ఉంది.  దామూ అన్నా మాధవరావుకు ఉత్తరం వ్రాశాడు.  మాధవరావు బాబాకు ఆ ఉత్తరం చదివి వినిపించగానె బాబా " ఉన్నదానితో తృప్తి పడమను.  అతనికి యింటిలో ఏలోటూ లేదు.  లక్షల కోసం వెంటపడవద్దని చెప్పు" అన్నారు.  నాభర్త ఆ అధ్యాయాన్ని చదివిన తరువాత అది బాబా యిచ్చిన సలహాగా భావించారు.  అసలు ఆరోజున చాలా పెద్ద మొత్తంలో తను అనుకున్న కంపెనీ షేర్ లలో పెట్టుబడి పెడదామనుకున్నారు.  ఈ సంఘటన బాబా చేసిన హెచ్చరిక అనుకొని, పెట్టుబడి పెట్టకూడని నిర్ణయించుకొన్నారు.  కాని ఆయన స్నేహితునికి నా భర్త అటువంటి నిర్ణయం తీసుకోవడం నచ్చలేదు.  అతను చాలా హతాసుడయ్యాడు.  కనీసం కొద్ది మొత్తమయిన పెట్టుబడి పెట్టమని బలవంతపెట్టి ఒప్పించాడు.  రెండురోజులలోనే ఆ షేరు విలువ బాగా పడిపోయి, పెట్టుబడి పెట్టినవాళ్ళందరూ బాగా నష్టపోయారు. 
Image result for images of loss of share
 ముందే అనుకున్న ప్రకారం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉంటే మేము బాగా నష్టపోయి కష్టాలు పడేవాళ్ళం.  ఎప్పటికీ పూడ్చలేని నష్టాలను అనుభవించి ఉండేవాళ్ళం.  అటువంటి కష్టానికి లోనుకాకుండా సమయానికి సలహా యిచ్చిన బాబావారికి ఎంతో ఋణపడి ఉన్నాము.  బాబా హెచ్చరించినా కూడా నా భర్త తెగించి పెట్టిన కొద్దిపాటి మొత్తం నష్టాన్ని మిగిల్చింది.  బాబా యిచ్చిన సలహాని నాభర్త పూర్తిగా పాటించలేదు.  మానవుడు ఒక్కసారిగా శిఖరాగ్రం నుండి ఏవిధంగా కిందకు జారిపోతాడొ నిరూపిస్తుంది ఈ సంఘటన.  ఇది ఒక కనువిప్పు.       

కావలసినదల్లా పూర్తి నమ్మకం.  

ఓం శ్రీ సమర్ధ సద్గురు శ్రీసాయినాధ్ మహరాజ్ కీ జై.

(సాయిదర్బార్ యూ ఎస్ ఏ వారి సౌజన్యంతో)   

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  


Kindly Bookmark and Share it:

1 comments:

Unknown on June 1, 2015 at 9:40 AM said...

ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List