16.02. 2016 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి అజయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ధన సంపాదనపై సాయి బానిస గారి ఆలోచనలను మరికొన్ని చూద్దాము.
ధన సంపాదన - సాయిబానిస ఆలోచనలు - 3
30.08.2007
21. ధనానికి గౌరవం యివ్వాలి.
ధనము లక్ష్మీస్వరూపము. ఆ ధనము మనందరికి జీవనాధారము. జీవనాధారానికి భగవంతుని దయ అవసరము. ప్రశాంతంగా జీవించటానికి కావలసిన ధనమును ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్ధించాలి. భగవంతుడు
ప్రసాదించిన ధనాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయరాదు.
08.09.2007
22. దొంగలు దొంగతనం చేయడానికి నీయింటికి వస్తున్నారని తెలిసిన తరువాత, నీవస్తువులన్ని పక్కవాడింట్లో దాచుకోవడం, ఆ పక్కవాడు దానిని దోచుకుంటాడా, దాచి ఉంచుతాడా అనే
ఆలోచన నిన్ను చికాకు పరుస్తుంది. అందుచేత
నీకు కావలసినంత ధనాన్ని మాత్రమే సంపాదించుకుని నీ దగ్గిరే ఉంచుకో. నీవే
ఆ ధనాన్ని దొంగల బారినుంచి కాపాడుకో.
23. భుక్తి కోసం కొందరు తమ శరీరానికి సూదులతో
రుద్రాక్షలను గుచ్చుకొని తాము దైవ స్వరూపులమని
చెప్పుకుంటూ ప్రజలను తమ చుట్టూ తిప్పుకుంటూ
ధనాన్ని ఆర్జిస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. వారికి
ధన సంపాదన ఒకటే తెలుసు. వారికి ఆధ్యాత్మికము ఏమీ తెలియదు.
24. నీవు నివసిస్తున్న ఇల్లు
ఎంత ఖరీదు చేస్తుంది అని
ఆలోచించటము అవివేకము. ఆ
యింటిలో నీవు ప్రశాంతముగా జీవించగలుగుతున్నావా లేదా అని ఆలోచించటం
వివేకము.
11.09.2007
25. జీవితంలో ధనము ఒక్కటే ప్రధానం
కాదు. ప్రశాంత
జీవితం గడిపే హక్కు అందరికీ
ఉంది. ప్రశాంత
జీవితం గడపడానికి కావలసినంత ధనము మాత్రమే సంపాదించి
జీవిత ప్రయాణం కొనసాగించాలి. ధనము
ఏ ఒక్కరి సొత్తు కాదని గ్రహించాలి.
15.01.2008
26. జీవితంలో ధనసంపాదన ఒక్కటే ముఖ్యము కాదు. భార్యాభర్తల
మధ్య అన్యోన్య దాంపత్యము చాలా ముఖ్యము. భగవంతుని నమ్ముకుని జీవించేవారికి సుఖప్రదమయిన ప్రశాంత జీవితము లభిస్తుంది.
23.08.2008
27. మనిషి జీవితంలో బాగా
ధనము సంపాదించగలడు. సర్వ
సుఖాలను కొనగలడు. కాని,
అతని మనసులో ఏదో తెలియని బాధ.
చెప్పుకోలేని బాధతో కుమిలిపోతూ ఉంటాడు. అటువంటివానికి
నాతత్వ ప్రచారం చేస్తున్నవారు వెళ్ళి వారికి మనోధైర్యం కలిగించాలి.
02.09.2008
28. నా విగ్రహాన్ని కొనేటప్పుడు
విగ్రహాన్ని మలచడంలో ఆ శిల్పి పడిన కష్టాన్ని చూడు. ఆ
కష్టానికి తగిన కూలి అందచేసినప్పుడే
నీవు నాకు చేసిన నిజమయిన
పూజ అవుతుంది.
12.02.2008
29. అప్పుతీర్చగలము అనే నమ్మకం ఉన్ననాడే
అప్పు చేయాలి. లేనినాడు
అప్పు యిచ్చినవాడు నీపాలిట యముడిగా మారి నీకు నరకాన్ని
చూపిస్తాడు.
13.09.2008
30. ధనసంపాదనలో విలువలకు కాలరాసినా ప్రమాణాలకు తిలోదకాలిచ్చినా, అటువంటి ధనసంపాదన (నల్లధనం) తలనొప్పులను మిగులుస్తుంది జాగ్రత్త.
(మరికొన్ని ఆలోచనలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment