17.03.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయసాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిసగారికి
సాయి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలను మరికొన్ని అవగాహన చేసుకొందాము.
శ్రీ సాయి పుష్పగిరి
– ఆధ్యాత్మికం - 7వ.భాగం
07.01.2008
61. ఆధ్యాత్మిక రంగంలో గురువు బస్సును నడిపే డ్రైవరువంటివాడు.
నీ గమ్యస్థానము రాగానే వారు నిన్ను దిగిపొమ్మని
ఆదేశిస్తారు. మిగతావారిని
తనతో తీసుకుని వెళ్ళిపోతారు.
12.01.2008
గురు తత్వానికి దగ్గరగా జీవించు. మాయ
తత్వానికి దూరంగా జీవించు.
15.01.2008
62. భగవంతుని పూజించటంలో ఎవరినమ్మకం వారిది. పూజావిధానంలో
ఎవరినీ బలవంతం చేయరాదు. నీకు
ప్రాప్తమున్న అన్నం మాత్రమే నీవు
తినగలవు. నీ
చేతినుండి జారి పడిపోయిన అన్నము
గురించి బాధపడవద్దు.
12.02.2008
63. భగవంతుని అనుగ్రహమనే గుఱ్ఱం ఎక్కడానికి అహంకారమనే జీనును తొలగించు. ప్రేమతో
ఆ గుఱ్ఱపు మెడను గట్టిగా పట్టుకొని
నవ విధ భక్తిలోని ఒక మార్గాన్ని ఎన్నుకుని
గుఱ్ఱపు స్వారీని కొనసాగిస్తూ నీ గమ్యస్థానాన్ని చేరుకో.
05.04.2008
64. గృహస్థు
సంసార సాగరంలో మునిగి తన గృహస్థ బాధ్యతలను
పూర్తి చేసుకుని శరీరాన్ని భగవత్ సేవలో వినియోగించడానికి
వానప్రస్థాశ్రమం ప్రారంభించాలి. ఈ
వాన ప్రస్థాశ్రమంలో భార్యాభర్తలలో ఏ ఒక్కరు ముందుగా భగవంతుని చేరుకున్నా రెండవవారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. ఈ
సన్యాశాశ్రమంలో శరీర అందచందాలకు ప్రాధాన్యత
యివ్వకుండా శరీర సుఖాలకు దూరంగా
జీవించుతూ భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతునిలో
ఐక్యమవాలి.
14.05.2008
65. భగవంతుని కార్యంలో ఒక సాధారణ ప్రాణి
ఉడత తన వంతు సాయం
తను చేసి భగవంతుని ప్రేమను
పొందిందే! మరి ఉత్తమ జన్మయైన
మానవ జన్మ ఎత్తి నీవు
భగవంతుని ప్రేమ పొందడానికి ఏమి చేస్తున్నావు
ఆలోచించు.
19.06.2008
66. ఎవరయినా దానధర్మాలు చేసినప్పుడు ఆ విషయం పుచ్చుకున్నవారికి
మరియు భగవంతునికి మాత్రమే తెలియాలి. ప్రచారం కోసం దాత ఈ
విషయాన్ని ఎవరికీ
తెలియచేయరాదు.
03.08.2008
67. భగవంతుని
అనుగ్రహం పొందడానికి జపము తపము ఆచరించనవసరం
లేదు. భక్తి
అనే నిచ్చెన ఎక్కి సద్గురువు ఆశీర్వచనాలతో
ఆ భగవంతుని పాదాల చెంతకు చేరు.
15.08.2008
68. నీఆధ్యాత్మిక ప్రగతికి ధనము ఆటంకముగా ఉండకూడదు. ఆర్ధిక
వ్యవహారాలు నిన్ను నా భక్తులనుండి దూరం
చేస్తోంది. అందుచేత
ఆర్ధిక వ్యవహారాలకు దూరంగా జీవించు.
20.09.2008
69. ఈ ప్రాపంచిక రంగంలో కోరికలకు, బంధాలకు అంతులేదు. అదే
ఆధ్యాత్మిక రంగంలో ముక్తి పొందాలనె
కోరిక, గురువుతో అనుబంధము నిన్ను నీ గమ్యానికి చేరుస్తాయి.
21.03.2009
70. ప్రాపంచిక రంగంలో నీవునేను అనేవి మన శరీరాలకే
వర్తించుతాయి. అదే
ఆధ్యాత్మిక రంగంలో నీవు నేను ఒక్కటే
అనేది మన ఆత్మలకు వర్తిస్తాయి.
మరికొన్ని సందేశాలు
తరువాతి సంచికలో
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో భక్త శబరి??? (భక్తికి పరీక్షా?)
0 comments:
Post a Comment