08.04.2016
శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి పుష్పగిరి - ఆధ్యాతిమికమ్ (ఆఖరి భాగమ్)
ఈ
రోజు బాబావారు సాయిబానిస గారికి ప్రసాదించిన ఆధ్యాత్మిక, జీవితం విషయాలకు సంబంధించి
మరికొన్ని.
03.11.2012
141. ఈ శరీరము
నీది కాదు. నీవు
ఆత్మవి అన్న విషయం నీకు
తెలుసు. మరి
అటువంటప్పుడు ఈశరీరాన్ని భగవంతుని సేవలో వినియోగించడం ఉత్తమము
కదా! ఒక్క
విషయం గుర్తుపెట్టుకో. ఏనాటికయినా
ఈ శరీరం పంచభూతాలలో కలసిపోవలసిందే.
06.11.2012
142. నీవు
నీఆత్మను చూడలేవు. కాని
నీఆత్మయొక్క అనుభూతిని నీవు నీ నీడలో
చూడగలవు. నీశరీరానికి
మరణం ప్రాప్తించేవరకు నీకు తోడుగా నీ
నీడ నీ వెంటనే ఉంటుంది.
ఈశరీరములోనుండి
ప్రాణముపోయిన తరవాత నీ నీడ కూడా
నిన్ను విడిచిపోతుంది. అందుచేత
నీ వెనక నీ నీడ ఉన్నంతవరకు నీలో
ఆత్మ ఉంటుంది. ఒకసారి
శరీరాన్ని వదలిన ఆత్మ తిరిగి
నూతన శరీరంలోనికి ప్రవేశించి నీకు పునర్జన్మని ప్రసాదిస్తుంది.
శ్రీ
సాయి పుష్పగిరి - జీవితం
– 1వ.భాగమ్
21.09.1999
1) జీవితంలో
కష్ట సుఖాలు రావడం సహజం. ఒడిదుడుకులను
తట్టుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తూ నీవు నీ గమ్యాన్ని
చేరుకోవాలి.
2) కుటుంబంలో
కష్టసుఖాలను కలసికట్టుగా అనుభవించాలి. దానికి
ఐకమత్యము ముఖ్యము
3 జీవితంలో
బంధుప్రీతి మేలు చేయదు. కాని, అశాంతిని మాత్రమే
రేకెత్తిస్తుంది
28.01.1999
4. నీ
విధి నిర్వహణలో లభించే ఫలము గురించి, ఆలోచించకు. నీ
విధి నిర్వహణ అనేది భగవంతుడు నీకు
ప్రసాదించిన అదృష్టము. ఈ అదృష్టాన్ని చక్కగా
నిర్వర్తించు. ఋణానుబంధాల వలయమునుండి బయట పడు. భగవంతుని దయకు పాత్రుడివి అవు.
27.03.1999
5. పరస్త్రీ
వ్యామోహము సుఖవ్యాధులను ప్రసాదిస్తుంది. పరులసొమ్ము
మీద వ్యామోహం నీకు మానసిక వ్యాధులను
ప్రసాదిస్తుంది. అందుచే
పరస్త్రీకి, పరుల సొమ్ముకు దూరంగా
ఉండు.
01.01.2000
6. విమానం
ప్రయాణం చేసేటపుడు నీవు పైలట్ మీద
నమ్మకంతో ప్రయాణం కొనసాగిస్తావు. నీజీవితంలో
నిన్ను నీ గమ్యస్థానానికి నేను
చేర్చుతాను అన్న నమ్మకం నామీద
నీకు ఉన్న రోజున నావిమానంలో
ఎక్కు. నిన్ను
నీగమ్యస్థానానికి చేర్చుతాను.
30.05.2000
7) జీవిత
సాగరము ఒడ్డున జీవించేవాడికి కష్టాలు, సుఖాలు అనే కెరటాలు తాకటం
సహజం. అటువంటి
సమయంలో సాగరంలో మునిగిపోకుండా ఉండటానికి మరియు సాగరంలోని విష
జంతువుల బారినుండి
కాపాడబడటానికి నీవు సాయి అనే
పడవలో ప్రయాణం చేయి. ప్రశాంత
జీవన యాత్ర కొనసాగించు.
01.01.2001
8) జీవిత
కాల ప్రవాహంలో కష్టాలు, సుఖాలు అనుభవించే సమయంలో నా నామస్మరణ చేసేవాడే
నా నిజమయిన భక్తుడు.
30.04.2001
9) జీవితంలో
వృధ్ధాప్యము శాపము కాదు. వృధ్ధాప్యంలో కూడా నీవు సమాజానికి
ఉపయోగపడగలవు అనే భావంతో జీవించుతూ
ఆఖరిక్షణం వరకు యితరులకు ఉపయోగపడు.
10) చదువు సంస్కారం
అనేవి తాజా వెన్నవంటిది.
ఆ వెన్నను తిని జీర్ణించుకోవాలి.
అంతేగాని గొప్పతనంకోసం ఆ వెన్నను వంటికి పూసుకొని తిరిగితే నీలో అహంకారం అనే
వేడికి ఆ వెన్న కరిగిపోయి
తిరిగి నీ నిజ స్థితినే బయటపెడుతుంది
(మరికొన్ని
జీవిత సత్యాలు ముందు ముందు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment