28.02.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై
సాయిబానిస ఆలోచనలు – 6
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
66. నీలోని ఆత్మజ్యోతి నీ మనసులోని చీకటిని తొలగించుతుంది. ఆ కాంతిలోనే నీవు ఆధ్యాత్మిక రంగములో స్వేఛ్చగా
విహరించగలవు.
67. ఏరోజున నీవు ఈ ప్రాపంచిక సుఖాలు, బంధాలనుండి బయటపడతావో
ఆరోజే నీజీవిత ఆఖరి పోరాటములో విజయము సాధించిన రోజు.
68. నీమనసులో మానవాళిపట్ల దయ, భగవంతుని వెతకటములో నీ కన్నులు
పడే ఆరాటం ఉన్నరోజున నీకంటే తక్కువవాడు అనే భావన లేకుండ అందరు నీవాళ్ళే అని భావించుతావు.
69. నీవు మాట్లాడె ప్రతిమాట, నీలోని ఆలోచనలు మరియు భావాలకు
అద్దం పడుతుంది. అందుచేత ఆచి తూచి మాట్లాడు.
70. నీశారీరక కోరికలు ఎక్కువయిన రోజున అవి నీమానసిక
పతనానికి కారణము అవుతుంది. ఆ మానసిక పతనము
నీలోని ఆత్మ జ్యోతి ఆరిపోవడానికి మూలము అవుతుంది.
అందుచేత శారీరక కోరికలను అదుపులో ఉంచుకో.
71. ఆధ్యాత్మికరంగములో నీ గమ్యము చేరడానికి కావలసిన మార్గమును
నీవే ఏర్పాటు చేసుకోవాలి. ఆమార్గములో పయనించేటప్పుడు
సద్గురువు నీకు మాట సాయము మాత్రమే చేయగలడు.
నీబాటలో నీవు పయనించుతూ నీ గమ్యాన్ని చేరాలి.
72. ప్రాపంచికరంగములో ఒకరికి ఇంకొకరు ఇచ్చి పుచ్చుకోవటాలు
ఉంటాయి. అదే ఆధ్యాత్మిక రంగములో నీవు ఇతరులకు
మాట సహాయము చేస్తు వారి ఉన్నతికి దోహదపడు.
73. నీవు ప్రశాంతముగా జీవించటనికి ఇతరులనుండి ఏమి ఆశించుతావో
అదే విధముగా నీనుండి ఎదుటివాడు ఆశించుతాడు అని గ్రహించు. అపుడు మనకు ఇతరులతో మనస్పర్ధలు ఉండవు.
74. నీకు, భగవంతుని మధ్య ఉన్న నేను, నాది, నావాళ్ళు
అనే మూడు అడ్డుగోడలను తొలగించు. అపుడు నీవు
భగవంతుడిని స్పష్ఠముగా చూడగలవు.
75. ఏనాడు నీవు నీశరీరములో దాగిఉన్న ఆత్మగురించి ఆలోచించలేదు. నేను ఈశరీరాన్ని అని భావించినపుడు నీవు భగవంతుని
గురించి ఏమి ఆలోచించగలవు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment