11.02.2017 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
13
వ.తారీకున దుబాయికి వెడుతున్నాము. మరలా దుబాయినుండి
ప్రచురిస్తూ ఉంటాను.
ఊదీ
యొక్క అమోఘమైన శక్తి
బాబా
వారి ఊదీ యొక్క అమోఘమైన శక్తి గురించి ఈ రోజు ఒక అధ్భుతమయిన సంఘటన తెలుసుకుందాము.
శ్రీమూలే
నాసిక్ లో ప్రముఖ న్యాయవాది. ఆయన, ఆయన భార్య
ఇద్దరూ బాబా భక్తులు. మూలే గారు ఎన్నో ఆధ్యాత్మిక
సాంప్రదాయాలను పాటించేవారు. అంతే కాదు ధ్యానం,
యోగా కూడా చేసేవారు. ఎక్కువసార్లు ఉపవాసాలు
ఉంటూ ఉండేవారు.
ఆయన ఉపవాసాలు చాలా కఠినంగా
ఉండేవి. ఆయన రోజుల తరబడి, వారాలు, ఒక్కొక్కసారి నెలలపాటు ఉపవాసాలు
ఉండేవారు. ఆయన పాలు మాత్రమే తీసుకుంటూ, ఆయా
కాలాలలో దొరికే పండ్లను మాత్రమే చాలాసార్లు ఆహారంగా తీసుకునేవారు. అయినప్పటికీ ఆయన చాలా చురుకుగాను, బలంగాను ఉండేవారు. ఆయన శరీరం చుట్టూ ప్రకాశవంతమయిన వెలుగు (ఆరా) ప్రసరిస్తూ
ఉండేది. ఆయన వదనం ప్రకాశవంతమయిన వెలుగుతో కాంతవంతంగా
ఉండేది.
ఒకరోజు
ఆయన ఇంటిలోకి ఒక సర్పం ప్రవేశించింది. ఆసమయంలో
ఇంటిలో ఆయన భార్య ఒక్కతే ఉంది. మూలేగారు కోర్టుకు
వెళ్ళారు. ఇంటిలో మగవారెవరూ లేరు. మూలేగారి భార్య సర్పాన్ని చూసి, మనఃస్ఫూర్తిగా ఎంతో
వేగంగా బాబాని ప్రార్ధించసాగింది. ఆసర్పం గదిలో
ఒక మూలకు వెళ్ళి చుట్టచుట్టుకుని కూర్చుంది.
మూలేగారి భార్య ధైర్యాన్ని కూడదీసుకుని పూజగదిలోకి వెళ్ళి ఊదీ ఉన్న చిన్న పెట్టెను
తీసుకుని వచ్చింది. ఆమె బాబాకు శిరసువంచి నమస్కరించుకుని
సర్పం చుట్టచుట్టుకుని పడుకున్న చోటకి వెళ్ళింది.
ఆ సర్పంతో “ఓ! నాగదేవతా! ఇది బాబా ఊదీ.
నువ్వు ఈ ఊదీని గౌరవిస్తావని నేను అనుకుంటున్నాను. నేను ఈఊదీతో లక్ష్మణరేఖను గీస్తున్నాను. నువ్వు ఈ గీత దాటి రావటానికి వీల్లేదు” ఇలా అని
ఆమె ఊదీతో ఒక పొడవాటి రేఖను గీసింది.
ఆశ్చర్యకరంగా
ఆసర్పం ఊదీ రేఖను దాటి బయటకు రాలేదు. ఆతరువాత
ఆమె ఇంటిలోకి వెళ్ళి ప్రశాంతంగా తన పనులు తాను చేసుకోసాగింది. మూలేగారు కోర్టునుంచి వచ్ఛిన తరువత మంత్రం చదివి ఆసర్పాన్ని ఇంటి బయటకు పోయేలా చేశారు.
“ఊదీయొక్క
శక్తిని మాటలలో వర్ణించలేము.” ఊదీని మనం నొసట
ధరించినా, లేక నోటిలో వేసుకున్నా దాని ప్రభావం మనలోని అహంకారమనే సర్పం యొక్క కోరలను
పెరికి వేస్తుంది. ఇంకా ముఖ్యమయిన విశేషమేమిటంటే
అది మనలోని కుండలినీ శక్తిని జాగృతం చేసి ఆత్మానుభూతిని కలిగిస్తుంది.
అధారం: సాయిలీల మాసపత్రిక 58 వాల్యూమ్, 1978మే సంచిక
Baabaa’s
Divine Manifestations by Vinny Chitluri
సాయి
లీలా వాట్ స్ ఆప్ గ్రూప్ నుండి సేకరణ
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment