08.02.2017 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ నెల 13 వ.తారీకున దుబాయి వెడుతున్నాము. రెండు నెలలు అక్కడే ఉంటాము. దుబాయి నుండి సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారి “భగవంతుని గురించి మరియు ఆధ్యాత్మిక మార్గములో సాయిబానిస ఆలోచనలు” ప్రచురిస్తూ ఉంటాను. ఇది త్వరలోనే పుస్తక రూపంలో ప్రచురించబడుతోంది.
బాబా
మాట జవదాటవద్దు
ఈ
రోజు మరొక అద్భుతమైన సాయి లీల గురించి తెలుసుకుందాము. బాబాగారు జీవించి ఉన్న రోజులలో భక్తులందరూ ఆయన అనుమతి
తీసుకున్న తరువాతనే షిరిడీ నుండి బయలుదేరేవారు.
ఆయన అనుమతి లేకుండా బయలుదేరినవారు కష్టాలపాలయ్యేవారు. బాబా ఆజ్ఞలను ఉల్లంఘించకుండా సత్ప్రవర్తనతో జీవిస్తూ
ఉంటే ఆయన అనుక్షణం మనలను కనిపెట్టుకుని కాపాడుతూ ఉంటారు.
1956
సంవత్సరంలో సుభాష్ యొక్క తండ్రి కృష్ణారావు సప్తఋషి గారు ఒక క్రొత్త కారును కొన్నారు. ఆయన పూనా నివాసి. ఆయన బాబా భక్తుడు. తను కొత్తగా కొన్న కారును షిరిడీకి తీసుకునివెళ్ళి
పూజ చేయించి బాబా ఆశీస్సులు పొందుదామని నిశ్చయించుకున్నారు. మన భారతదేశంలో ఏదయినా
క్రొత్త వాహనాన్ని కొన్నపుడు గుడిదగ్గరకు తీసుకునివెళ్ళి పూజచేయించి భగవంతుని ఆశీస్సులు
పొందడం అనాదిగా వస్తున్న ఆచారం.
ఆరోజు
గురువారం. కృష్ణారావుగారు కుటుంబంతో సహా తమ క్రొత్త కారులో బయలుదేరి మధ్యాహ్నానికి
షిరిడీ చేరుకున్నారు. ఆరోజుల్లో షిరిడీ ఒక
చిన్న గ్రామం. ఇప్పుడున్నంతగా భక్తులతో రద్దీగా ఉండేది కాదు. షిరిడీ చేరుకున్నతరువాత కృష్ణారావుగారు తన కారుని
సమాధిమందిరం వద్ద నిలిపి, బాబాని ప్రార్ధించుకోవడానికి లోపలికి వెళ్ళారు. ఆతరువాత దర్శించుకోవలసిన అన్ని పవిత్ర ప్రదేశాలకు
వెళ్ళి, కారు దగ్గరకు వచ్చారు. పూజారి వచ్చి
క్రొత్త కారుకు పూజ చేశారు. అప్పటికి సాయంత్రం
దాటి పొద్దుగూకింది. పూజారిగారు పూజ చేసిన
వెంటనే, సుభాష్ తండ్రి వెంటనే పూనాకి తిరిగి వెళ్ళిపోదామనే ఆతృతలో ఉన్నారు. అక్కడ ఆయన అర్జంటుగా చూసుకోవలసిన వ్యాపారవ్యవహారాలు
ఉండటం వల్ల వెంటనే తిరుగుప్రయాణమవడానికి సిధ్ధంగా ఉన్నారు.
ఆరోజుల్లో
షిరిడీకి వచ్చినవాళ్ళెవరూ గురువారంనాడు తిరిగివెళ్ళే ఆలోచన చేసేవారు కాదు. ఇప్పటికీ భక్తులందరూ ఈపద్ధతినే పాటిస్తూ ఉన్నారు. మానాన్నగారు షిరిడీనుండి బయలుదేరబోతుండగా గ్రామస్తులు ఆయనను గురువారంనాడు బయలుదేరవద్దనీ,
రాత్రికి షిరిడీలో మకాం చేసి మరునాడు బయలుదేరమని చెప్పారు. ఈ విషయం సుభాష్ చెప్పాడు. గ్రామస్తులు చెప్పిన మాటను కాదనలేక వారిమీద గౌరవం
కొద్దీ మానాన్నగారు శేజ్ ఆరతి చూసిన తరువాత బయలుదేరదామన్నారు. శేజ్ ఆరతి అయిపోగానే మా నాన్నగారు ఇక బయలుదేరడానికి
తొందరపడ్డారు. అప్పుడు సమాధిమందిరంలో ఉన్న
పూజారిగారు, ఈరోజు గురువారం మీరు బయలుదేరవద్దు అని చెప్పారు. ఆయన మానాన్నగారితో “చూడు తమ్ముడూ, ఈరోజు బయలుదేరవద్దు. ఒకవేళ మీరు అత్యవసరంగా చూసుకోవలసిన వ్యవహారాలు ఏమన్నా
ఉంటే కనీసం అర్ధరాత్రి వరకు ఉండి ఆతరువాత బయలుదేరండి. అర్ధరాత్రి దాటితే శుక్రవారమే కాబట్టి నియమాన్ని
ఉల్లంఘించినట్లు కూడా అవదు” అని హితవు చెప్పారు.
మానాన్నగారు ఆయన మాటలని పట్టించుకోకుండా మమ్మల్నందరినీ కారులోకి ఎక్కమని పూనాకి
బయలుదేరదీశారు. వెంటనే కారు రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డుమీద వీధిదీపాలు కూడా లేకపోవడంవల్ల చిమ్మచీకటిగా
ఉంది. కారుకు ముందున్న హెడ్ లైట్ల కాంతి తప్ప
రోడ్డు చుట్టుప్రక్కల ఏమీ కనపడటల్లేదు. రోడ్డు
ఎదర ఏముందో తెలియదు. రోడ్డుకు ఇరువైపులా పొలాలు. కారు రోడ్డుమీదే వెడుతోందో లేక మలుపులు తిరిగిన
చోట పొలాల్లోకే వెళ్ళిపోతోందో తెలియని పరిస్థితి.
ఇరువైపులా ఉన్న పొలాలలోంచి కీచురాళ్ళ శబ్దంతో ఆచిమ్మచీకటిలో వాతావరణం భీతి గొలిపేలా
ఉంది. రోడ్డుమీద వచ్చేపోయే వాహనాలు ఏవీ కనపడటల్లేదు.
హటాత్తుగా మాకారు హెడ్ లైట్లు ఆరిపోయాయి. ఒక్క
కుదుపుతో మాకారు కీచుమని శబ్దం చేస్తూ ఎవరిదో పొలంలో ఆగిపోయింది. మానాన్నగారు కారు హెడ్ లైట్లు వేద్దామని, కారుని
స్టార్ట్ చేద్దామని ఎంతగానో ప్రయత్నించారు.
శ్రమ తప్ప కారు మాత్రం ముందుకు ఒక్క అంగుళం కూడా కదలలేదు. లైట్లు కూడా వెలగలేదు. మా నాన్నగారు కారు దిగి ఆ చీకటిలోనే రోడ్డుమీదకు
వచ్చి నుంచున్నారు. ఏదయినా వాహనం వస్తే వారి
సహాయం అర్ధిద్దామని ఎంతో ఆశతో ఉన్నారు. ఒకటి
రెండు ట్రక్కులు వెళ్ళాయిగాని, మమ్మల్ని పట్టించుకోకుండా ఆగకుండా వెళ్ళిపోయాయి. ఎవరో ఒకరు రాకపోతారా సహాయం చేయకపోతారా అనే ఆశతో
అలాగే రోడ్డుమీద నుంచున్నారు మానాన్నగారు.
గ్రామస్తులు పూజారిగారు వెళ్ళవద్దు అని ఎంతగానో చెప్పినా వినకుండా బయలుదేరినందుకు
చాలా బాధపడ్డారు. తనని ఆదురవస్థనుండి కాపాడమని
రెండు చేతులు ఎత్తి బాబాని ప్రార్ధించారు.
ఆక్షణంలోనే
ఒక మిలటరీ ట్రక్ వస్తూ ఉంది. ఆపమన్నట్లుగా మానాన్నగారు చేయి ఊపారు. వెంటనే ఆ ట్రక్ ఆగింది. అందులోనుండి ఒక సిపాయి దిగి ఏమయింది, ఏమిటి సమస్య
అని అడిగాడు. జరిగినది విని అతను ట్రక్ లోకి
వెళ్ళి ఒక పెద్ద ఫ్లాష్ లైట్ ను తీసుకుని వచ్చాడు. ఇద్దరూ కారు ఆగిపోయిన చోటుకు వచ్చారు. సిపాయి కారు బోయ్ నెట్ ఎత్తి లోపలికి తొంగిచూశాడు. బహుశ కారులోపల ఎటువంటి లోపం కనిపించలేదేమో, డ్రైవర్
సీటులోకి వచ్చి ఇగ్నిషన్ కీ తిప్పాడు. ఓహ్!
కారు స్టార్ట్ అయి హెడ్ లైట్లు వెలిగాయి.
ఆసిపాయి
కాస్త ఊపిరి పీల్చుకుని గట్టిగా “అయ్యా! మీరు ఎంతో అదృష్టవంతులు, లేకపోతే ఇక్కడ ముందున్న బావిలో పడి మీఅందరి ప్రాణాలు
పోయి ఉండేవి” అన్నాడు. కారు హేడ్ లైట్ల కాంతిలో
కారుకు ముందు ఒక పెద్ద బావి కనపడుతోంది.
ఆనుయ్యికి ఒక్క అడుగు దూరంలో మాకారు ఆగిపోయింది. ఆబావి నేలకు సమాంతరంగా ఉంది. బావి చుట్టూతా ఎటువంటి గోడ లేదు. దానిని చూడగానే నాగుండె చాలా వేగంగా కొట్టుకుంది. కారే కనక ఆగకపోయి ఉంటె మేమంతా జలసమాధి అయిపోయి ఉండేవాళ్ళం. ఆ దృశ్యాన్ని తలుచుకుని నావళ్ళు జలదరించింది. సిపాయి వెంటనే కారును వేగంగా వెనక్కు త్రిప్పి రోడ్డుమీదకు
తీసుకుని వచ్చాడు. సమయానికి వచ్చి సహాయం చేసినందుకు
కృష్ణారావుగారు ఆసిపాయికి మనఃస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అప్పుడు ఆయన ఆసిపాయిని ఇలా ప్రశ్నించారు. “ఇపుడు
మేమెక్కడున్నామో చెబుతారా?” అప్పుడా సిపాయి నవ్వుతూ “మీరు షిరిడీ సరిహద్దుల దగ్గర ఉన్నారు”
అని సమాధానమిచ్చి వెంటనే తన ట్రక్కులోకి దూకి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. తనకాక్షణంలో బాబాయే సిపాయి రూపంలో వచ్చి సమయానికి
సహాయం చేశారని మానాన్నగారికి అర్ధమయింది.
కృష్ణారావుగారు
వాచీలో టైమ్ ఎంతయిందోనని చూశారు. అర్ధరాత్రి
దాటి అయిదు నిమిషాలయింది. చేతులెత్తి తనను
క్షమించమని బాబాని మనసులోనే ప్రార్ధించుకున్నారు.
తనకు సహాయం చేసి రక్షించినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఆతరువాత
ఎటువంటి సమస్యలు లేకుండా కారు ముందుకు సాగింది.
మేమంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నాము.
సంవత్సరం
తరువాత కృష్ణారావుగారికి కలలో బాబా దర్శనమిచ్చారు. ఆకలలో బాబా ఆయన ముందు నుంచుని కోపంగా “నన్ను నువ్వు
అస్థిరంగా వేళ్ళాడదీశావు. నన్ను కూడ నిన్ను
అదే విధంగా వేళ్ళాడదీయమంటావా?” అన్నారు. ఆవెంటనే
కృష్ణారావుగారికి మెలకువ వచ్చింది. “బాబా నన్ను
ఈవిధంగా కోప్పడటానికి కారణం ఏమిటీ? నేనేమి
అపరాధం చేశాను” అని ఆలోచించారు. మరునాడు ఉదయాన్నే
ఆయన తన పూజాగదిలో గోడకు వేళ్ళాడుతున్న బాబా ఫొటో వదులుగా ఉండి ఏక్షణంలోనయినా పడిపోవడానికి
సిధ్ధింగా ఉండటం గమనించారు. వెంటనే ఆరోజే వడ్రంగిని
పిలిపించి, గోడకు గట్టిగా మేకులు కొట్టించారు.
ఫొటో క్రిందకు జారిపోకుండా ఫొటో క్రింద ఒక చిన్న పొడవాటి చెక్క బల్లను కూడా
ఏర్పాటు చేశారు.
గ్రామస్తులద్వారా,
పూజారిగారి ద్వారా, రాబొయే ప్రమాదాన్ని నివారించడానికి బాబా ముందరే హెచ్చరిక చేశారు. మన ఆత్మని (జీవాత్మ) మోసేది మన శరీరం. అందుచేత ఈశరీరాన్ని గౌరవిస్తు ఉండాలి మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. దానికి సాధన చేయాలి. అప్పుడు బాబా మనలని ప్రమాదాలవారిన పడకుండా తప్పక
రక్షిస్తారు. సైనికులు సరిహద్దులలో ఉండి దేశాన్ని
రక్షిస్తున్నట్లుగానే బాబాకూడా మన కర్మలనన్నిటినీ ధ్వంసం చేసి మనలను రక్షిస్తు ఉంటారు.
మూలం
: శ్రీసాయి సాగర్ పత్రిక 2010 వ.సం దీపావళి సంచిక.
Baabaa’s
divine manifestation – by VinnY Chitluri
సేకరణ
Saayileelaa
waats group నుంచి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment