04.04.2017
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ శ్రీరామనవమి
శుభాకాంక్షలు
శ్రీసాయి
లీలా తరంగిణి –12 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనుబదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 9440375411
శ్రీసాయిబాబా
చేసిన అద్భుతమైన వైద్యం
1986
వ. సంవత్సరం వేసవికాలం రోజులు. ఒకరోజు బుధవారం
నాడు నా భర్త బజారుకు బయలుదేరారు. మరుసటిరోజు
ఉదయం బాబాకు అభిషేకం చేయడానికి పళ్ళు, పూలు ఇంకా ఇతర సామాగ్రి తేవడానికి మోపెడ్ మీద
బయలుదేరారు.
దారిలో మసాబ్ ట్యాంక్ (హైదరాబాద్)
చౌరాస్తా దగ్గర నాభర్త మోపెడ్ ని ఒక స్కూటర్ గుద్దింది. స్కూటర్ నడుపుతున్న వ్యక్తి ఆగకుండా వెళ్ళిపోయాడు. నాభర్త రోడ్డుమీద పడిపోయారు. చుట్టుప్రక్కల ఉన్న జనం వెంటనే వచ్చి నాభర్తను లేపి
కూర్చోబెట్టారు. ఆయన కళ్లజోడు, రిస్ట్ వాచీ
రోడ్డుమీద దూరంగా పడిపోయాయి. ఆతరువాత వాటిని
వెదకి తీసుకున్నారు. స్కూటర్, ఆయన కాలుమీద
పడటంవల్ల తొడవెనుక భాగంలోను, శరీరం వెనకాల గాయాలయి బాగా దెబ్బలు తగిలాయి. దానివల్ల ఆయన విపరీతమయిన నెప్పితో బాధపడ్డారు. తొడ బాబా వాచిపోయి గట్టిగా కదుము కట్టి రాయిలా తయారయింది. మరుసటిరోజు గురువారంనాడు బాబాకి అభిషేకం చేద్దామనుకున్నారు. కాని చేసే స్థితిలో లేరు. ఆరోజు సాయంత్రం శ్రీ వి.నారాయణరావుగారు మాయింటికి
వచ్చారు. ఆయన చేత బాబాకు అభిషేకం చేయించాము.
నాభర్త విపరీతమయిన నొప్పితో బాధపడుతున్నా నారాయణరావుగారు
చేస్తున్న పూజను గమనిస్తూ ఆయన ప్రక్కనే కూర్చున్నారు.
అదే
రోజు రాత్రి బాబా మావారి కలలో కనిపించి, ఆరోజు అభిషేకం జరిగే సమయంలో తాను అక్కడే నిలబడి
అంతా గమనించానని చెప్పారు. ఆ తరువాత బాబా మావారిని
మంచంమీద పడుకోబెట్టారు. తరువాత మావారికి కాలుకి
నొప్పి ఉన్న భాగంలో బాబా తన చేతిని మెల్లగా పామారు. “ఇప్పుడు నీనెప్పి తగ్గిపోతుంది”
అన్నారు బాబా. అపుడు నాభర్త “బాబా, నా నడుం
కూడా బాగా సలిపేస్తోంది. మీచేతిని అక్కడ కూడా
ఉంచండి” అని అన్నారు. అపుడు బాబా “ఆ నెప్పి
కూడా కొద్దిరోజులలో తగ్గిపోతుందిలే” అని మృదువయిన స్వరంతో నవ్వుతూ అన్నారు.
మరుసటిరోజు
ఉదయానికే మావారికి కాలు వెనకాల ఉన్న నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఎఱ్ఱగా కందిపోయినట్లున్న కదుము కూడా పూర్తిగా కరిగిపోయింది. రెండు రోజులలోనే మామూలుగా నడవగలిగే స్థితి వచ్చింది. నడుము నెప్పి కూడా తగ్గిపోయింది. యాక్సిడెంట్ వల్ల గాయాలయి తగిలిన దెబ్బలే కాకుండా
అంతకుముందు వీపు భాగంలో ఉన్న నెప్పులుకూడా తగ్గిపోయాయి. బాబా మనకి సహాయం చేయాలని సంకల్పించుకుంటే ఆయనకు
అసాధ్యమయినదేమీ లేదు.
1995
వ.సంవత్సరంలో నాభర్తకి వెన్నుపూసలోని రెండు పూసలు స్థానభ్రంశం చెంది క్రిందకి జారాయి. ఎక్స్ రే లో కూడా ఇది స్పష్టంగా కనిపించింది. వెన్నుపూస కూడా వంగిపోయి ఉండటం చూసేవాళ్ళకి కూడా
స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. డాక్టర్స్ బెడ్
రెస్ట్ తీసుకోమని చెప్పారు. కాని నాభర్త ఎటువంటి
విశ్రాంతి తీసుకోలేదు. ఆయన ఎప్పుడూ కూర్చుని
శ్రీసాయిబాబా గురించి పుస్తకాలు రాసుకోవడం, రాసినవాటిని టైప్ చేయడం వీటిలోనే నిమగ్నమయి
ఉండేవారు. అంతే కాదు నిటారుగా కూర్చుని ధ్యానం కూడా చేసుకుంటూఉండేవారు. ఆయన ఆ విధంగా
కూర్చునే పని చేసుకోవటం, నడవగలగడం చూస్తే మాకే కాదు డాక్టర్స్ కి కూడా చాలా ఆశ్చర్యం కలిగించేది.
స్కూటర్
ప్రమాదం జరిగినరోజు సాయిబాబా నాభర్త వీపుమీద, తొడమీద తమ పవిత్ర హస్తాన్ని ఉంచారు. ఆయన ఆ హస్త స్పర్శే నాభర్తకి ఎప్పుడూ రక్షణగా ఉండి
కాపాడుతూ ఉంది. బాబా తన భక్తుల యెడల అనంతమయిన
ప్రేమాభిమానాలను కురిపిస్తూ ఉంటారనడానికి ఈ అధ్బుత సంఘటనే తార్కాణం.
(రేపటి సంచికలో నమ్మశక్యం కాని బాబా లీల)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment