09.04.2017
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –17 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 9440375411
శ్రీ
సాయి – మార్గదర్శి, తత్వవేత్త
శ్రీ
అదృష్టరావుగారు మావారి స్నేహితులు. ఎంతటి అనారోగ్యం
చేసినా సరే ఆయన ఎటువంటి మందులు వాడరు. సాయినాధుని
ఊదీనే పరమౌషధంగా వాడుతూ ఉంటారు. జబ్బు తగ్గాలంటే
మానవప్రయత్నం కూడా అవసరమే అని మేము అన్నప్పుడెల్లా బాబాయే నాకు డాక్టర్, నాకు వేరే
డాక్టర్ తో అవసరం లేదనేవారు.
ఒకసారి ఆయనకు
తీవ్రంగా జబ్బు చేసి బాగా బలహీనమయిపోయారు.
శరీరమంతా పసుపు రంగులోకి మారిపోయింది.
పరిస్ఠితి చాలా దారుణంగా తయారయింది.
గత జన్మలో చేసిన పాపకర్మఫలాన్ని అనుభవిస్తున్నాను తప్ప నాకేమీ కాదు అనేవారు. ఆహారం తీసుకోవడం కూడా మానేశారు. ఆయన పరిస్ఠితిని చూసి నాభర్త ఎలాగయిన సరే ఆయనను
ఒప్పించి సాయంత్రం డాక్టర్ దగ్గరకి తీసుకువెడదామనుకున్నారు.
ఆరోజు
19వ.తేదీ మే నెల 1987 వ.సంవత్సరం. మధ్యాహ్నం
మూడు గంటల సమయంలో నాభర్త తన మోపెడ్ మీద మసాబ్ ట్యాంక్ రోడ్డుమీద వెడుతున్నారు. ఎండ బాగా విపరీతంగా ఉండటం వల్ల ట్రాఫిక్ అంతగా లేదు. ఆ సమయంలో నాభర్తకు వెనుకనుంచి ఎవరో “సాయిబాబా –
సాయిబాబా” అని గట్టిగా పిలవడం వినిపించింది.
నాభర్త వెంటనే మోపెడ్ ను ఆపుచేసి వెనక్కి తిరిగి చూశారు. వెనకాల ఒక ఫకీరు తలకు గుడ్డ చుట్టుకుని కనిపించాడు. అతను నాభర్తని గమనించనట్లుగా ముందుకు దాటుకుని నడుచుకుంటూ
వెళ్ళిపోతున్నాడు. అపుడు నాభర్త ఆఫకీరును
“సాయిబాబా” అని గట్టిగా పిలిచింది. నువ్వేనా అని అడిగారు.
అతను అవునన్నట్లుగా తల ఊపి “బాబా అచ్చాకరేగా” అన్నాడు. మీరెక్కడినుంచి వస్తున్నారని అడిగారు నాభర్త. అపుడా ఫకీరు తాను మహారాష్ట్ర – కోపర్ గావ్ – షిరిడీ
నుంచి వస్తున్నానని చెప్పాడు. నాభర్త అతని
మాటలకు చాలా సంతోషించి అతనికి కొంత డబ్బివ్వబోయారు. అతనా డబ్బు తీసుకోవడానికి నిరాకరించి “ఎవరినీ ఏ
విషయంలోను, బలవంత పెట్టకు” అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఆమాటలతో మావారికి జ్ఞానోదయమైంది.
ఆఫకీరు
అన్న మాటలు శ్రీ అదృష్టరావుగారిని ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా తను డాక్టర్ వద్దకు తీసుకుని
వెడదామనుకున్న తన ఆలోచనను గుర్తుకు తెచ్చింది.
అందువల్లనే బాబా తనకు ఒక గుణపాఠాన్ని బోధించారని భావించారు. శ్రీ అదృష్టరావుగారు ఎంతో సౌమ్యుడు, వినయవిధేయతలు
కలవారు. ఆయనకు సాయిబాబాపై ప్రగాఢమయిన విశ్వాసం,
నమ్మకం. బాబాదయవల్ల ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగయింది. బాబా తప్ప గొప్ప వైద్యుడు ఇంకెవరున్నారు?
(రేపటి
సంచికలో శ్రీరాధాకృష్టస్వామి గారి దర్శనం -
అత్యంత అధ్భుతమైన బాబా ఇచ్చిన అనుభవంశ్రీ సాయిబాబాకు, శ్రీ ఉమా మహేశ్వరరావు గారికి మధ్య
జరిగిన ఆసక్తికరమైన సంభాషణ )
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment