08.04.2017
శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –16 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 9440375411
కారులో
ఏర్పడిన లోపాన్ని చెప్పిన బాబా
1987వ.
సంవత్సరం జనవరిలో మా కుటుంబమంతా కలిసి మాస్వంత కారులో హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్
పార్కుకు బయలుదేరాము. మా మధ్యాహ్న భోజనాలు
పార్కులోనే కానిచ్చేసి సాయంత్రానికి తిరిగి వద్ధామనుకున్నాము.
మేము కారులో హైకోర్టు దాటిన తరువాత మాకారు కాస్త
ఇబ్బంది పెట్టింది. స్విచ్ దగ్గరనుంచి పొగ
రావడం మొదలయింది. మాఅబ్బాయి చి.కృష్ణకిషోర్
మెకానిక్ ని తీసుకునివచ్చి కారుని రిపేర్ చేయించాడు. మేము బయలుదేరబోతుండగా ఒక ఫకీరు మావద్దకు వచ్చాడు. మావాళ్ళు అతనికి కొంత డబ్బిచ్చారు. అపుడా ఫకీరు కారులో కొన్ని ఎలక్ట్రిక్ వైర్లు కాలిపోయాయి
అని చెప్పాడు. అతను చెప్పిన మాటలని మేము పట్టించుకోలేదు. అటువంటి సామాన్యమయినవాడికి కారు మెకానిజం గురించి
ఏంతెలుస్తుందిలే అనుకున్నాము. మేము జూ గేటులోకి
ప్రవేశించగానే కారులో మళ్ళి అదే సమస్య వచ్చి స్విచ్ నుండి పొగరావడం మొదలయింది.
మాఅబ్బాయి
మమ్మల్ని జూలోకి పంపించేసి, అంతకు ముందు మాకారుని బాగుచేసిన మెకానిక్ ని తీసుకురావడానికి అదే గ్యారేజీకి వెళ్ళాడు. కాని మాకారుని అంతకుముందు
రిపేర్ చేసిన మెకానిక్ లేడు. మరొక మెకానిక అయిన గ్యారేజీ యజమాని
ఉన్నాడు. మాఅబ్బాయి అతనిని తీసుకునివచ్చి కారును
రిపేర్ చేయించాడు. అంతకుముందు మాకారును బాగుచేసిన
మెకానిక్ కి మెకానిజం గురించి పూర్తి అవగాహన లేదని, రిపేర్ సరిగ్గ చేయలేదని ఆ యజమాని
చెప్పాడు. కారులో ఎలెక్ట్రిక్ వైర్లు కాలిపోయాయని
ఫకీర్ చెప్పిన మాటలు మాకాక్షణంలో గుర్తుకు వచ్చాయి. అతను అదే విషయాన్ని రెండు మూడు సార్లు చెప్పినా
కూడా మేమతని మాటలను నమ్మలేదు. మా అజ్ఞానం వల్ల
అయిదు మీటర్లు ఎలక్ట్రిక్ వైరు క్రొత్తది వేయాల్సివచ్చింది. బాబా ముందుగానే చెప్పిన ఈహెచ్చరికని అర్ధం చేసుకుని
ఉంటే మేమంత కష్టపడి ఉండేవాళ్ళం కాదు. శ్రీసాయిబాబా
మాకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు.
బాబాని గుర్తించకపోవడానికి మన అజ్ఞానమే కారణం.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment