07.04.2017 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలా తరంగిణి –15 వ.భాగమ్
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు
(మూల
రచన : తెలుగు. ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి
లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల
తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి
నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్
ఖైల్ గేట్, దుబాయి
Email
: tyagaraju.a@gmail.com
Watts
app. No. 9440375411
అత్యధ్బుతమైన
మహిమ – బ్రైన్ హెమరేజ్ నుండి రక్షించుట
నాభర్తకు
కలిగిన మరొక అధ్బుతమైన అనుభూతి
01.01.1987
వేకువఝామున నాభర్తకు కలలో బాబావారి దివ్య దర్శనమయింది. కలలో బాబా ఇలా అన్నారు. “ఈ రోజు నీకు మంచి రోజు
కాదు. ఈరోజు ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్య
నీకు పెద్ద ప్రమాదం జరగబోతోంది”
ఆకలలో
నాభర్తకు తాను నేలమీద ప్రాణం లేకుండా పడుకుని ఉన్నట్లుగాను, సాయిబాబా తన తలవద్ద కూర్చుని
తన ఛాతీ మీద ఆయన చేతిని వేసి ఉంచినట్లు, తన ప్రక్కన శ్రీపూజ్య శివనేశన్ స్వామీజీ గారు,
ఆయన శిష్యుడు శ్రీ అయోధ్య కూర్చుని ఉన్నట్లు కనిపించింది.
తరువాత
ఆరోజు ఉదయాన్నే ‘సాయిప్రభ’ ఎక్జిక్యూటివ్ ఎడిటర్ గారయిన శ్రీవి.నారాయణరావు గారిని,
శ్రీ డి. శంకరయ్యగారిని ఇంకా మాదగ్గరి బంధువులు కొందరిని, ఫోన్ చేసి పిలిపించాము. నా అన్నగారు డా.సి.ఆర్. ప్రసాద్, మా అబ్బాయి మామగారు
డా.ఎ. ప్రభాకరరావుగారు (మచిలీపట్నం గవర్నమెంట్ ఆస్పత్రిలో సూపరింన్ టెండెంట్) వీరిద్దరూ
మాతోనే ఉన్నారు. కొంతమంది సాయి భక్తులు కూడా
మాయింటికి వచ్చారు. క్రితంవరకు మావారి ప్రాణానికి
ప్రమాదం జరగబోతోందని ముందుగా సూచన చేసినపుడెల్లా బాబా మావారితో “నేను నీతోనే ఉన్నాను”
అని అభయం ఇస్తూ ఉండేవారు. కాని, ఈసారి బాబా
ఆవిధంగా చెప్పలేదు. మాలో ఆందోళన ఎక్కువయింది. శ్రీ నారాయణరావు గారు నాభర్తకి విష్ణుసహస్రనామం
పుస్తకం ఇచ్చి చదవమని చెప్పారు. సాయిబాబా చెప్పిన
సమయం ముగియడానికి ఇంక కొద్ది నిమిషాలే ఉంది.
బాబా చెప్పిన గడువు ఇంక కొద్ది నిమిషాలలో దాటిపోతుందని మేము కాస్త ఊపిరి పీల్చుకున్నాము. తరువాత సమయమ్ 10.53 అయింది. నాభర్త కాస్త తల తిరుగుతోందని మెల్లిగా లేచి, బాబా
ఫొటో దగ్గరకు వెళ్ళి బాబా ముందు శిరసు వంచి తెలివితప్పి పడిపోయారు. మేమాయనని హాలు మధ్యలో పడుకోబెట్టాము. విష్ణుసహస్రనామ పారాయణ మిగిలిన భాగాన్ని శ్రీనారాయణరావుగారు
పూర్తి చేశారు. మేమంతా సాయినామాన్ని జపించడం
మొదలుపెట్టాము.
స్పృహలేని
స్ఠితిలోనే నాభర్త గురక పెట్టసాగారు. ఆయన గుండె
చాలా వేగంగా కొట్టుకుంటోంది. నేలమీదనుంచి జర్క్
వస్తున్నట్లుగా పైకి కిందకి పడుతూ లేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఈవిధంగా ఎప్పుడూ జరగలేదు. మాకు చాలా భయంగాను, కంగారుగాను ఉంది. కాని నాభర్త తనను ఆస్పత్రిలో చేర్పించవద్దని ఖచ్చితంగా
చెప్పడంవల్ల ఆయనని కాస్తయినా కదల్చడానికి మేము సాహసించలేదు. ఆయన స్పృహలోకి వస్తారని
గంట పైగా ఎదురు చూసాము. కాని ఆయన స్పృహలోకి
రాలేదు. పరిస్ఠితి చాలా విషమంగా తయారయింది. ఆఖరికి మా అబ్బాయి కృష్ణకిషోర్ సాయిబాబా పాదాల వద్ద
చీటీలు వేసి ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లమంటారా వద్దంటారా అని బాబాని అడుగుదామని నిర్ణయించుకున్నాడు. ఆవిధంగా ఆయనపాదాల వద్ద రెండు చీటీలు వేసి మామనవడు
కళ్యాణ్ కౌశిక్ ను పిలిచి రెండు చీటీలలో ఒక చీటీని తీయమని చెప్పాడు. వాడు ఒక చీటీ తీశాడు. ఆచీటీలో ఆస్పత్రికి తీసుకునివెళ్లమని వచ్చింది. వెంటనే ఆయనని మహావీర్ ఆస్పత్రికి తీసుకునివెళ్ళాము. డాక్టర్ పరీక్షించి, ఆయనకు మొత్తం శరీరానికంతా పక్షవాతం
వచ్చిందని చెప్పారు. సూదితో ఆయన పెదవులమీద,
చేతులమీద గుచ్చినా, పొడిచినా ఆయన శరీరంలో ఎటువంటి చలనం లేదు. నాడి, గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటున్నాయి. అది సెరిబ్రల్ హెమరేజ్. ఆ రోజు ఆదివారం కావడంవల్ల స్పెషలిస్ట్ లు ఎవరూ లేరు. అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఆయన ఇంక బ్రతికే
అవకాశం లేదని, ఇంటికి తీసుకునివెళ్ళిపొమ్మన్నారు.
లేకపోతే ఏ గవర్నమెంటు ఆస్పత్రికయినా తీసుకువెళ్లమని చెప్పారు.
మధ్యాహ్నం
1.30 కు ఆయనని అక్కడినుండి సికిందరాబాదులో ఉన్న గాంధీ ఆస్పత్రికి తీసుకునివెళ్లాము. అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ పరీక్షించి ఆయనకు
సెరిబ్రల్ హెమరేజ్ వచ్చిందని నిర్ధారణ చేసారు.
ఆయనని ఐ సి యు లో చేర్పించమని చెప్పారు.
కాని ఆయన కోలుకుంటారని మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు. అవసరమయిన వైద్యమంతా చేస్తున్నారు. నేను శ్రీసాయిబాబా గారి అభయ హస్తం ఉన్న ఫొటోను ఆయన
తలదగ్గరి, ఆయన చొక్కా జేబులో బాబా ద్వారకామాయి ఫొటో ఉంచాను. నాభర్త మీద కనికరం చూపించమని బాబాను వేడుకుంటూ ఆయన
నుదుటిమీద కాస్త విభూది రాసాను.
ఈలోగా
ఒక డాక్టరు (బహుశా నాస్తికుడయి ఉండవచ్చు) జరుగుతున్న తతంగాన్నంతా చూసి నాదగ్గరకు వచ్చి
“ఆయన పరిస్ఠితి చాలా ప్రమాదకరంగా ఉంది. మీ
సాయిబాబా గాని, మరే భగవంతుడయినా సరే ఆయనను ఈపరిస్ఠితినుంచి కాపాడలేరు” అని చెప్పి గదిలోనుంచి
వెళ్ళిపోయాడు. కాని బాబా మీద మానమ్మకం విశ్వాసం
బాగా ధృఢంగా ఉన్నాయి. మానమ్మకం సడలదు. నాభర్త యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారనే గట్టి నమ్మకం
మాకుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆయనకు ఎడమ
కాలు, ఎడమ చేయి లలో కాస్త కదలిక వచ్చింది.
డాక్టర్స్ పరీక్షించి ఆయనకు కుడివైపు పూర్తిగా పక్షవాతం వచ్చిందని చెప్పారు. సాయంత్రం ఆరు గంటలకి అధ్బుతం జరిగింది. ఆయన తన కుడికాలుని, కుడిచేతిని కదపగలిగారు. శరీరంలోని అన్ని అవయవాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా
కదలసాగాయి. రాత్రి ఏడు గంటలకు కొన్ని మాటలు
మాట్లాడగలిగారు. రాత్రి ఒంటిగంటవరకు మరలా మాట్లాడలేకపోయారు. ఆతరువాత స్పృహలోకి వచ్చి చేతులు, కాళ్ళు అన్నీ కదుపుతూ మాట్లాడగలిగారు. బాబా దయవల్ల పక్షవాతంనుంచి
పూర్తిగా కోలుకున్నారు.
తరువాత
తనను ఆస్పత్రిలో చేర్పించారని తెలిసి మామీద చిరాకు పడ్డారు. “బాబావిభూతి” ఒక్కటే తనకు తగిన మందని, అదొక్కటే
తనకు మనశ్శాంతిని ఇస్తుందని చెప్పారు.
తనను
ఇంటికి తీసుకొనివెళ్ళమని చెప్పారు. ఇంత అర్ధరాత్రివేళ
ఇంటికి వెళ్ళడం కష్టమని మరుసటిరోజు ఉదయాన్నే వెడదామని శాంతింపచేశాము. అతికష్టంమీద మామాట విన్నారు. కాని తెల్లవారుఝాము అయిదు గంటలవరకు పడుకోకుండా మంచంమీదే
కూర్చొని ఉన్నారు. ఆయన ఆవిధంగా కోలుకుని చాలా
సంతోషంగా ఉండటం చూసి వైద్యం చేసిన డాక్టర్స్ అందరూ చాలా ఆశ్ఛర్యపోయారు. ఆయనని సి.టి. బ్రైన్ స్కాన్ చేయించుకోమని , ఇంకా
కొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండమని చెప్పారు.
కాని మావారికి ఆస్పత్రిలో ఒక గంట కూడా ఉండటం సుతరాము ఇష్టంలేదు. అందువల్ల తన స్వంత బాధ్యతమీదే తనను వెంటనే ఆస్పత్రినుండి
డిశ్చార్జి చేసేయమని అడిగారు. ఆయన స్వంత పూచీకత్తుమీద
డాక్టర్స్ డిశ్చార్జి చేసారు. సెరిబ్రల్ హెమరేజ్
తో బాధపడినవాళ్ళు బ్రతకడం చాలా అరుదు. ఒకవేళ
ప్రమాదంనుండి బయటపడినా 12 గంటలలో సాధారణ స్ఠితికి రావడమనేది అసాధ్యం.
నాభర్త
ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన రోజున మా అబ్బాయి అత్తగారు శ్రీమతి ధనలక్ష్మి మాయింటిలో
డ్రాయింగు రూములొ నిద్రపోతూ ఉన్నారు. ఆమెకు
కలలో నలుగురు యమదూతలు మాయింటిలోకి వస్తున్నట్లుగా కన్పించింది. ఆవిడ వెంటనే లేచి బాబా పటంముందు శిరసువంచి “సాయిబాబా
రక్షా కరో సాయిబాబా రక్షాకరో” అంటూ ప్రార్ధించసాగారు.
(ఓమ్ సాయి రక్షా కరో సాయి భజన్ యూట్యూబ్ లో వినండి)
లింక్ ఇస్తున్నాను
https://www.youtube.com/watch?v=qmWlLldFMCk
https://www.youtube.com/watch?v=OuW2qh70DAc
ఆమె అలా ప్రార్ధించగానే ఆనలుగురు వెనుకకు మరలి వెళ్ళిపోయారు. ఆస్పత్రినుంచి వచ్చిన తరువాత ఆయన తనరోజువారీ కార్యక్రమాలన్నీ
యధావిధిగా చేసుకోసాగారు. ఈసంఘటన జరిగిన మూడవరోజున
చర్లపల్లిలో ఉంటున్న మాదగ్గరి బంధువు ఒకరికి నాభర్తకు ఏదో ఉపద్రవం జరగబోతోందన్నట్లుగా
కలవచ్చింది. ఆతరువాత నాభర్త మోపెడ్ మీద వెడుతు
కనిపించడంతో ఆశ్చర్యం కలిగింది. ఆయన ప్రమాదంనుండి
బయటపడి ఆరోగ్యంగా సంతోషంగా ఉండటం చూసి ఎంతో ఆనందించారు.
ఇది
సాయిబాబా చేసిన అద్భుతం కాక మరేమిటి? బాబావారి
పాదపద్మాలపై మాశిరసునుంచి నమస్కరించుకోవడం తప్ప ఆయనకు మేమేవిధంగా మా కృతజ్ఞతలను తెలుపుకోగలం?
మాయింటిలో
సంతోషకరమయిన, ఉల్లాసకరమయిన వాతావరణం నిండిఉన్నదంటే అదంతా సాయిబాబా దయ ఆయన ఆశీర్వాదాల
వల్ల మాత్రమే.
స్త్రీకి
అత్యున్నతమైన సంపద సుమంగళిగా నుదుట సింధూరం, పసుపుకుంకుమలతో నిండు నూరేళ్ళు జీవించటం. సుమంగళి ఎప్పుడు వచ్చినా నానుదుట కుంకుమబొట్టు పెట్టినపుడు,
ఆ సంపదని నేను పొందుతున్నందుకు నాకెంతో గర్వంగాను, అటువంటి అదృష్టం కలిగినందుకు ఎంతో సంతోషంగాను ఉంటుంది. నాకటువంటి గొప్పసంపదను అనుగ్రహించిన బాబాకు నేనెంతో
కృతజ్ఞురాలిని. నాకెప్పుడూ ఆయన ఆశీర్వాదాలు
లభించాలని కోరుకుంటూ ఉంటాను.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment