Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, June 12, 2017

శ్రీసాయి తత్త్వసందేశములు –12 వ.భాగమ్

Posted by tyagaraju on 6:28 AM
     Image result for images of shirdisai smiling
            Image result for images of parijata flower

12.06.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)

శ్రీసాయి తత్త్వసందేశములు –12 .భాగమ్

43.  రాత్రి 9.10 గంటలకు హైదరాబాద్ లో పూజామందిరమునందు శ్రీ నాగేంద్రస్వామి వారు యిచ్చిన దివ్య సందేశము.

బ్రతకడం వ్యక్తిగతము.  జీవించడము సాంఘికము.  తన సుఖము కొరకే ఆలోచించే ఆలోచనలు గాలి అలలకు చెరిగిపోవును.  నీ అడుగుజాడలు మరొకరికి మార్గదర్శకము కావలయును.  అందుకే బ్రతకడం కంటే జీవించడమే గొప్పది.  బ్రతకడానికి, జీవించడానికి మూలము ఒక్కటే.  అదే ప్రేమ.


తనను తాను ప్రేమించుకొనడం బ్రతకడం అవుతుంది.  అందరిని ప్రేమిస్తూ ముందుకు సాగిపోవడం జీవించడం అవుతుంది.                  
ప్రేమ అరిషడ్వర్గాలకు అతీతమైనది.  భక్తిరస ప్రధానమైనది.  అలాంటి ప్రేమకు ఆశలు వుండవు.  అందించడమే కాని అందుకోవాలని ఆసక్తి వుండదు.  ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్ధ ప్రక్రియయే ప్రేమ.  అట్టి ప్రేమే ఆచంద్ర తారార్క వసంతాన్ని యిస్తుంది.
      Image result for images of love among humans

అట్టి ప్రేమ భక్తి నామీద లేనందున నన్ను శ్రధ్ధాభక్తులతో ఆరాధించుటలేదు.  అందువలన నీవు శరీర రుగ్మత, మానసిక వేదనతో బాధపడుచున్నావు.
నన్ను సామాన్య నాగేంద్రునిగా భావించి నా దర్శనమునకు వచ్చుటకు కూడా ఆసక్తి చూపక, అశ్రధ్ధ చేయుచున్నావు.  నేను ఆది దేవతగా ప్రపంచమంతటా ఆవరించియున్నాను.  నేను సర్వరక్షాకారుడను, సర్వమంగళాకారుడను, శరణాగత దీనార్తుడను, సర్వ పాపక్షయకారుడను.
నాదర్శన నిమిత్తము వెంటనే నా పుట్టవద్దకు వచ్చి నన్ను ధ్యానించి నా మూలమంత్రము జపించి, సుందరకాండ పారాయణము ప్రారంభించిన నీకు మనశ్శాంతి కలిగి ప్రశాంతత లభించును.

నా నిజ స్వరూపము సత్య జ్ఞానానంద నిత్య నిర్మల నిరాకార పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపము.  నాస్వరూపమును హృదయములో రమింపచేసుకో.
నీలో వున్న తలంపులన్నీ ఎప్పుడు నశింపచేసుకొనెదవో అప్పుడే బ్రహ్మ సాయుజ్యమును పొందెదవు.  మనస్సే జననమరణములకు కారణమని తెలుసుకో.  నీ మనస్సును ఆశాపాశములవైపు పోనివ్వక, పరిశుధ్ధముగా నుంచుకొన్న నీ ముఖములో తేజస్సు ప్రకాశించును.  అప్పుడే నీకు ఆచంద్రతారార్కవసంతము ప్రాప్రించును.
               Image result for images of nagendra putta
నీవు తరచు వెళ్ళు పుట్టవద్ద నన్ను ధ్యానించిన నీకు ప్రశాంతత కలుగును.  అంతవరకు నీవు చేయవలయుననుకొన్న కార్యములు ఫలించవు.  నేను పూజా పునస్కారములతో సంతృప్తి పొందువాడను కాను.  నాయందు శ్రధ్ధాభక్తి కలిగి ఏకాగ్రతతో ధ్యానించినప్పుడే మీ సంరక్షణార్ధము వచ్చెదను.
జీవన్ముక్తి సాధించవలయునంటే నీవు చేయు సాధన చాలదు.  జీవించుట బ్రతుకుట కొరకు కాదు.  దైవానుగ్రహము సంపాదించవలయును.

44.  14.03.1993 సాయంత్రము 5.15 గంటలకు ఎరుకలపూడి గ్రామములో శ్రీ అమర రామలింగేశ్వరస్వామి వారి ఆలయము వద్దనున్న వాల్మీకము వద్ద శ్రీ నాగేంద్రస్వామి వారు యిచ్చిన సందేశము.

కదలించనిదే కొరివి మండదు.  దెబ్బ తగలనిదే బాధ తెలియదు.  సంక్షోభములు లేనిదే దైవ మహిమలు అర్ధము కావు.  అదే విధముగా నేను సందేశమును యిచ్చునంతవరకు నా మహిమను తెలుసుకొనలేని అజ్ఞానివి.  ప్రళయములే జీవితమునకు అగ్ని పరీక్షలు.  బ్రహ్మనిష్టలేనిదే దేనిని సాధించలేరు.  భ్రూమధ్యమున జ్యోతి కలదు.  సహస్రారమున వెలుగు కలదు.  ఈ పవిత్ర స్థలమునందు దృష్టిని నిలిపి ధ్యానించిన దానిని సాధించగలరు.
ఈశ్వర అవ్యాజ కరుణకు పాత్రులుకండి.  మీ జీవితములను చరితార్ధము చేసుకొనండి.  అనన్య భక్తి, దీక్ష ద్వారా ఆ పరమాత్ముని ప్రత్యక్ష దర్శనము పొందండి.
సర్వేశ్వరుని మహిమను, సృష్టి రహస్యమును తెలుసుకొని మానవాళికి దివ్య మార్గమును చూపు.
ఎవరైతే ఏకాగ్రతతో అనన్య భక్తితో నన్ను ధ్యానించెదరో అట్టివారికి నా దర్శన భాగ్యము లభించును.
లోకమున ఆదర్శముర్తిగా వెలుగొందిన కబీరు అంశమునకు చెందినవాడవు నీవు.
ఈ ప్రదేశమునందు సుందరకాండ పారాయణము చేసిన అహంకారమనే కలశము కదలి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనే లోనున్న శతృవులు నశించి జీవన్ముక్తి లభించును.  నన్ను నీ ఆత్మ స్వరూపముగా తలంచి ఆత్మానుసంధానము చేసుకొన్న నీ జీవితము పరమార్ధమగును.

45.  31.03.1993 రాత్రి 9.10 గంటలకు పూజామందిరములో శ్రీసాయిబాబా యిచ్చిన సందేశము.
            Image result for images of shirdisai smiling
నేను నిర్వర్తించమన్న కార్యమును సక్రమముగా చేయుటలేదు.  ధ్యానములో కూర్చుని నేను ఆదేశించిన ప్రసాదమును నైవేద్యముగా సమర్పించి దానిని అందరి భక్తులకు యిచ్చిన, వారిలోని దోషములు కొంతవరకు నివృత్తి అగును.  నీవు గురువుగా భావించుచున్నవారి వద్దకు వెళ్ళిన శ్రీరామనవమి యొక్క మహత్యము గురించి వారిద్వారా నేను కొన్ని విషయములు తెలియచేసెదను.  శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి వ్రాయమంటే, దాని గురించి ఆలోచించుటకాని, ప్రయత్నం కాని చేయక అశ్రద్ధ చేయుచున్నావు.
నేను వ్రాయించుచున్న గ్రంధమునందు కూడా శ్రధ్ధ చూపుటలేదు. ఇది నీ అహంకారమునకు చిహ్నము.  దీనిని రూపుమాపుటకు ప్రయత్నించు.
ఇతర విషయములందు ఆసక్తి చూపుచు, నేను నియమించిన కార్యమందు అశ్రధ్ధ చేయుచు లౌకిక కార్యములకు ప్రాధాన్యత చూపుచున్నావు.

శ్రీరామనవమి యొక్క విశిష్టత తెలుసుకొనుటకు నీవు గురువుగా భావించువారి వద్దనుండి కొంత సమాచారము సంపాదించగలవు.
46.  04.04.1993 రాత్రి 9.30 గంటలకు పూజాగృహమునందు శ్రీసాయి యిచ్చిన సందేశము.

రాబోవు గురువారము ఉదయం 6 గంటలనుంచి 48 గంటలవరకు ఈ పూజాగృహములో దీక్షను సక్రమముగా చేయుము.  దీక్షాకాలమందు మౌనము వహించి, నా రూపమునే తలుచుకొనుచు, మనస్సును నాయందు లయము చేసుకొని నన్ను నీ హృదయములో రమింపచేసుకొని జీవాత్మను పరమాత్మయందు ఐక్యము చేసుకో.
                    Image result for images of love among humans
నీ దేహములో వున్న ఆత్మ జ్యోతి దశవిధ గుణములచే కప్పబడియున్నందున నీ ఆత్మను నీవు చూడలేని స్థితిలో యున్నందున, ఈ దీక్షయందు నిన్ను కూర్చుండబెట్టుట అయినది.  ఈ దీక్షను సక్రమముగా నిష్టగా చేసిన ఈ దశవిధ గుణములు పారిపోయి, నానిజస్వరూపమును చూడగల శక్తిని సంపాదించగలవు.
ఆత్మ సుఖము కావలయునంటే విషయ, సుఖము కోరరాదు.  ఆశ అన్నది పిశాచములాంటిది.  అన్ని ఆశలను వదలుకొని దైవ సాన్నిధ్యమును పొందుటకు ప్రయత్నించు.
దీక్షను మొదలుపెట్టుటకు ముందు హనుమాన్ చాలీసాను పదకొండు పర్యాయములు చదివి, నైవేద్యము సమర్పించి కొబ్బరికాయను కొట్టి, దీక్షను ప్రారంభించిన జయప్రదమగును.
ఈ దీక్షలో ధ్యానమునకు ప్రాముఖ్యతనివ్వక, ధ్యానము గురించి, ‘ఉడ్ డ్రాఫ్’ వ్రాసిన గ్రంధమును పఠించి జీర్ణించుకొన్న, ధ్యానమునందు జ్ఞానోదయము కలుగును.  దీక్షాకాలమందు ద్రవ పదార్ధములు తప్ప యితర పదార్ధములను తినవద్దు.  యోగాభ్యాసము చేయువారికి ఆహార నిషేధములు చాలా కలవు.  కాని అవి యిప్పుడు నీకు వర్తించవు.
దీక్షా తదనంతరము మీ మరదలు ఆరోగ్యము కొరకు నామ సంకీర్తన పెట్టించిన కొంత ఉపశమనము కలుగును.
దీక్షా నిరయమములను సక్రమముగా పాటించు.
(ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List