13.06.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబావారు ప్రసాదించిన మరికొన్ని సందేశాలు
శ్రీ సాయితత్త్వ సందేశములు
(voice of Sai Baba)
శ్రీసాయి తత్త్వసందేశములు
–13 వ.భాగమ్
48. 11.04.1993 ఆదివారమ్ సాయంత్రము 7.15 గంటలకు శ్రీ ఎమ్.జి.రావు గారి యింటిలో జరిగిన సత్సంగములో శ్రీ బాబాగారు యిచ్చిన సందేశము.
నీవు 44 గంటలు దీక్షను ఏకాగ్రతతో, సక్రమముగా చేసినందున నీలో వున్న దశవిధ గుణములు
పారిపోయి నీలో వున్న ఆత్మజ్యోతిని చూడగల శక్తిని సంపాదించగలిగినావు. కాని దానికి కావలసినంత సాధన చేయుట లేదు. రెండు మూడు మాసములనుండి నీకు అనుష్టానముయందు శ్రధ్ధ
తగ్గి, ఎక్కువ సమయము ఐహిక విషయములందు కాలమును గడుపుచున్నావు. నీ సాధన వృధ్ధి చేసుకో.
శ్రీలత ఆధ్యాత్మికముగా
ఎదిగి, ఔన్నత్య స్థితిని పొంది అవధూత స్థితికి తీసుకొని రావలయునని ఒక మండలము దీక్షలో
కూర్చుండవలసినదని, ఆ స్థితిని సంపాదించవలయునన్న ఏమి చేయవలసినది నీ ద్వారా సందేశము యిచ్చినాను. ఆ సందేశములోని విషయములను నీవు స్వయముగా ఆమెకు తెలియచేయక
ఆ సందేశమును మాత్రము ఆమెకు పంపినావు. ఆ సందేశమును
చదివినంతమాత్రమున ఆమెలో స్పందన కలగదు. కనుక
నీవు వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, సందేశములోని అంశముల ప్రాముఖ్యత ఏమిటో తెలియచేసి, వచ్చే
మాసము పౌర్ణమిరోజున దీక్షలో కూర్చుండునట్లు చేయవలసిన బాధ్యత నీపైన యున్నది. ఏదో ఒక మిషమీద దీక్షను పొడిగించిన దాని కర్మఫలితము
అనుభవించవలయును. ఈ విషయమును ఆమెను గ్రహించమని
చెప్పు.
తాను ఆరాధించుచున్న అమరనాగేంద్రస్వామి
రూపములు వేరుకాని, మేమిద్దరము ఒక్కటే. ఈ దీక్ష అనంతరము ఆమె మానవకోటికి చేయవలసిన కార్యములు
చాలా గలవు.
ఈ దీక్ష సక్రమముగా జరుపు
బాధ్యత నీది. నీలో ఆశాపాశములను పూర్తిగా విడవలేనందున,
నీ ఆత్మజ్యోతిని చూడగల శక్తిని సంపాదించలేకపోయినావు. ఈ స్థితిని దాటుటకు సాధన చేయుము.
ఈ సత్సంగములో నీ మరదలకు
ఆరోగ్యము బాగుగా లేకపోయినప్పటికి యిందులో పాల్గొన్నందున కొంత ఉపశమనము కలుగును. కాని పూర్తిగా అనారోగ్యము నివృత్తికాదు. నిత్యము నా నామజపము చేసిన కొంత ప్రశాంతత కలుగును.
ఈ సత్సంగములో పాల్గొన్న
ప్రతివారికి కష్టములు, దుఃఖములు, వుండుట సహజము.
ప్రతి దుఃఖము వెనుక ఒక కర్మ వున్నదని గ్రహించండి. కర్మ నివారణకొరకే కష్టములు వచ్చుచుండును.
నామ సంకీర్తనలో పాల్గొనుచున్నారే
కాని, భక్తి శ్రధ్ధలతో ఎవరు చేయుటలేదు. నామము
నామము కొరకే చేయుచున్నారే కాని, ఎవరూ నన్ను మీ మనస్సుయందు లయము చేసుకొనుటలేదు.
49. 16.06.1993
ఉదయం 10.20 గంటలకు పూజా మందిరములో దీక్షా సమయమునందు శ్రీసాయినాధుడు యిచ్చిన
దివ్య సందేశము.
దీక్షను పాటించమనుటలో
ఉద్దేశ్యము, నీదశను అగ్ర స్థితిలోనికి తీసుకొని వచ్చుటయే నా ఆశయము. మంచినడవడి కలిగి, సౌమ్య మార్గము కలిగి ప్రజాహిత
కార్యములు చేసినచో లోకోత్తముడవు కాగలవు. ఏకాగ్రత, భక్తి దీక్ష వలనే కలుగును. సాహసము, హృదయ సౌందర్యము,
సత్యము యొక్క పూర్ణత్వ స్థితి సంపాదించవలయునంటే, ఆ పూర్ణస్థితి ఈ సాధనవలనే కలుగును. మానసిక చంచలత్వము పోగొట్టుకొనవలయునంటే దీక్షే మార్గము. దీక్షవలన ఏకత్వము, సమానత్వము, సమభావము, గోచరించును. ఆధ్యాత్మిక అభివృధ్ది పొందవలయునంటే దీక్ష వలనే సాధించగలవు. అట్టి అభివృధ్ధి కొరకు నిన్ను దీక్షలో కూర్చుండబెట్టినాను.
సుఖ దుఃఖములు క్షణికమైనవి. వాటిమీద మనస్సు పోనివ్వరాదు. దీక్ష యోగముతో సమానమైనది. దానిని నిర్లక్ష్యము చేయరాదు. దీక్షలో మనస్ఫూర్తిగా నాప్రేమ పాత్రుడవు కావలయునని
ప్రార్ధించు.
50. 10.07.1993 రాత్రి 9 గంటలకు శ్రీసాయి యిచ్చిన సందేశము.
దైవాన్ని నిరంతరము గుర్తుంచుకొనుట
వలన, శరీర ప్రజ్ఞను దాటి దైవ ప్రజ్ఞలో వుండెదరు.
అప్పుడు దైవానుభవమును పొందుతారు. ఎంతకాలం
దేహ ప్రజ్ఞ ఉంటుందో అంత వరకు వేరు భావం ఉంటుంది.
అంటే నీవు వేరు నేను వేరని. కాబట్టి
బంధం, దుఃఖం అజ్ఞానం, చీకటి కలిగి ఉండే దేహస్థితిలోనే ఉంటారు. శరీరభావం నుండి పైకి వెళ్ళినకొలది పరమాత్మతో ఏకమవుతారు. అప్పుడే మీ జీవితం పూర్ణం అయిపోతుంది. ఎప్పుడైతే వెలుగు జ్ఞానం, శాంతి శక్తి ఆనందము పొందుతారో
అప్పుడే నిత్యులు కాగలరు. మీకు దేహభావం వున్నంతవరకు, భగవంతుని మరచిపోయి స్వస్వరూపమునకే
ప్రాధాన్యత యిస్తారు. శరీర ప్రజ్ఞకు అతీతులయినప్పుడే
భగవంతుని పొందగలరు. ఇంద్రియ లోలత్వంతో జీవితం
గడిపేవారికి, దేహప్రజ్ఞను దాటి, దివ్య స్థితిలో పొందే ఆనందము ఊహకు కూడా అందదు. మీరు దేహస్థితిలో ఏది పొందిన అవి అశాశ్వతములని మరచిపోకండి.
మీరు మీ కుటుంబ పోషణకొరకు
న్యాయమార్గంలో ధన సంపాదన చేయండి. మీ ఆలోచనలు
పనులు అన్నియు భగవంతునికే సమర్పించండి.
మీరు
చేసే ఏకార్యము కాని సేవకాని అందరి మానవులలోను అన్ని ప్రాణులలోను దైవాన్ని చూడడానికి
దారి తీసేదిగా ఉండాలి. ఈ భావంతో చేసే సేవ చేసినవానిని,
పొందినవానిని పావనం చేస్తుంది. అట్లుగాక, మీ కొరకు, మీ బంధువుల కొరకు జీవితం గడుపుతుంటే,
మీ జీవితం నిస్సారముగా తయారయి వ్యాకులత దుఃఖాలను తెచ్చిపెడుతుంది. మీ మనస్సు కూడా సంకుచితమైపోయి దైవ సాక్షాత్కారమునకు
దూరమైపోతారు. మీ దృష్టి ఎంత సంకుచితవలయంగా
ఉంటే అంత దుఃఖాన్ని పొందుతారు. మీ దృష్టిని
విశాలంగా విస్తరింపచేసుకొనండి. విశాలమైన దృష్టిగలవారే
దైవ అనుభవాన్ని పొందగలరు. అనంత శాంతిని పొందవలయునంటే,
మీ చైతన్యం భగవత్ చైతన్యంతో ఏకం చేసుకోవాలి.
ఈ అనంత చైతన్యంలో మిమ్ములను మీరు వదులుకోవాలి.
అప్పుడు శరీర ప్రజ్ఞయుండదు. ఒకే సమయంలో అన్ని చోట్ల ఉన్నారని తెలిసుకోగలరు. ఆ స్థితిలో మీరు రూపనామాలు, లేని చావుపుట్టుకలు
లేని అనంతమైన శాశ్వత సత్యమే మీరు అని తెలిసికోగలరు. అప్పుడే వ్యక్తిత్వమునుండి అవ్యక్తములోనికి, మార్పుగల
స్థితినుండి మార్పు లేని స్థితిలోనికి, అసత్యం నుండి సత్యానికి, నామరూప స్థితినుండి
నామ రూప అతీత స్థితికి వెళ్ళగలరు. ఇటువంటి
స్థితి పొందవలయునంటే మీ ఆలోచనలు, పనులు, అన్నీ భగవంతునికే సమర్పించాలి.
మీరు ఎవరికి సేవ చేసినా దైవ స్వరూపులైన మానవులకు
చేసిన మిమ్ములను పావనం చేస్తుంది. దైవ సాక్షాత్కారమే
మీ గమ్యమని గ్రహించండి.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment