22.02.2019 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 4 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
దీనికి సంబంధించిన అన్ని హక్కులు
సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ
భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను.
సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
బాబాతో జీవనమ్ – 2005
మార్చ్ నెల
మహాశివరాత్రి – బరువయిన హృదయభారంతో షిరిడీ నుంచి సిడ్నీకి తిరిగి వచ్చాను. మరలా ఇంకొకసారి భాతదేశానికి
వెళ్ళాలనుకుంటున్నాను. మహాశివరాత్రి పండగ సమయం. నాకు హిందూదేవతల గురించి అన్ని రూపాల దేవుళ్ల గురించి, పధ్ధతుల గురించి తెలియకపోయినా, మరలా వచ్చే సంవత్సరానికి
మహాశివరాత్రి పర్వదినం వస్తుందనే ఒక విధమయిన ఆనందం నాలో ఎపుడూ కలుగుతూ ఉంటుంది. షిరిడీ సాయిబాబాయే నా పరమశివుడు
కాబట్టి ఆయన నాలో అటువంటి ఆనందానుభూతిని కలిగిస్తూ ఉంటారు. శివరాత్రికి 9 రోజుల
ముందునుంచి నిరంతరం ఆపకుండా “నమఃశ్శివాయ” అని జపించుకుంటూ ఉన్నాను. నామసప్తాహం పూర్తయేటప్పటికి
శివషిరిడీసాయి నుంచి ప్రతిఫలాన్ని కూడా ఆశించడం కూడా ఒక కారణం.
ప్రతిఫలం అంటే ఇక్కడ వస్తురూపేణ కాదు
ధనరూపేణా కాదు. నేనాయననుంచి దైవానుగ్రహ ఫలితాన్ని
ఆశించడం మాత్రమే. నిరంతరం
నేను జపించిన నమఃశ్శివాయ 18,000. నాహృదయం శివనామ జపంతో నిండిపోయింది. 18,000 మొత్తం కూడితే వచ్చే
సంఖ్య ‘9’. చాలా
సార్లు వివిధప్రదేశాలలో ‘9’ సంఖ్య నాకు ఎదురవుతూ వచ్చింది.
నా శివబాబాని, నేను ఎంతగానో సంతోష
పరిచాననిపించింది. ఈ
‘9’ సంఖ్యతోనే బాబా, నేను ఇద్దరం
సంభాషించుకుంటూ ఉంటాము.
నేనెప్పుడూ అంతర్జాలం ద్వారా ఇంకా
వేరువేరు మార్గాల ద్వారా క్రొత్తగా ఏమయినా బాబా ఆలయాల నిర్మాణాలు జరిగి
ఉంటే వాటి సమాచారం కోసం వెతుకుతూ ఉంటాను.
ఆవిధంగా అంతర్జాలంలో వెతుకుతూ ఉండగా చెన్నైలో ఈ మధ్యనే సాయిబాబా
మందిరం నిర్మాణం జరిగిందనే వార్త చూసాను.
నేను పనిచేస్తున్న ఆఫీసులో ముందుగా సెలవు
తీసుకోవాలనే ఆలోచనే లేకుండా, మా
కుటుంబంలోని వారికి కూడా నాఏర్పాట్ల గురించి ఏమీ చెప్పకుండా చెన్నైకి వెంటనే బయలుదేరబోయే ఫ్లైట్ ఏది ఉందో చూసి టికెట్
కూడా బుక్ చేసేశాను. ఆ వెంటనే ఆలయ అధికారులకి ఫోన్ చేసి నేను చెన్నై బాబా మందిరం చూడటానికి వస్తున్నానని బస చేయడానికి మందిరం ఆవరణలోనే గదులు ఏమయినా
ఉన్నాయా అని వివరాలు అడిగాను. వారు నేను ఉండటానికి ఒక గదిని ఏర్పాటు చేస్తామని సంతోషంగా చెప్పారు. బాబా నాకా విధంగా దయ
చూపించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకొన్నాను. ఆఫీసులో నా పై అధికారి ముందస్తు
సమాచారం లేకుండా నేను సెలవు అడిగినందుకు కాస్త
చిరాకు పడ్డారు.
చెన్నైకి చేరుకొన్న తరువాత బాబా
మందిరానికి వెళ్ళాను. మందిరం
యొక్క సుందరమయిన రూపం నన్ను స్థంభింపచేసింది. మందిర నిర్వాహకులు ఒక గదిలో నాకు
బస ఏర్పాటు చేసారు. ఆగది
మందిరం యజమాని భార్యదని చెప్పారు. ఆయన ఎప్పుడోనే మరణించారు. మందిరానికి సంబంధించిన మేనేజర్ (యజమానురాలు ప్రస్తుతం మందిరానికి దూరంగా ఉంటున్నదనీ అవసరమయినప్పుడు
ఇక్కడికి వచ్చి గదిలో ఉంటారనీ చెప్పాడు) నన్ను మందిరం బయట
విశాలమయిన వైభవోపేతమయిన ఆవరణలో అంతా తిప్పి చూపిస్తూ అక్కడ
జరిగిన బాబా లీలలు, కధల గురించి వివరించాడు. అక్కడ బయలు ప్రదేశంలో మేము
నడచుకుంటు వెడుతున్నపుడు బాబా గారి ఉనికిని బలీయమయిన
అనుభూతి చెందాను. అంతటా
నేను బాబాని దర్శించాను. బాబా నాప్రక్కనే నాతోనే ఉన్నారనే అనుభూతి నాకు కలగసాగింది. బాబా నన్ను అంటిపెట్టుకుని
నాతోనే ఉన్నారనే ప్రగాఢమయిన విశ్వాసం కలిగింది. నేను వచ్చినది ఇపుడే కదా,
మరి బాబా నాకు స్వాగతం పలుకుతున్నారా? లేక
నాకేమయినా హెచ్చరికలాంటిది చేస్తున్నారా?
మేము నడుస్తూ ఉండగా ఒక సమయంలో నాకు రక్షణగా బాబా తన
హస్తాన్ని నా చుట్టూ వేసి తోడుగా ఉన్నారనే అనుభూతి కలిగింది. చుట్టుప్రక్కల ఎవరూ లేనప్పటికీ
ఆయన నన్ను కాపాడుతున్నారని అనిపించింది. ఆవిధంగా ఆయన ఎందుకు చేశారన్న విషయం నేనున్న రోజులలో తరువాత తెలిసింది.
మందిరానికి తిరిగి వచ్చి ఆఫీసు గదికి
వచ్చాము. అక్కడ నాకు ఒక స్త్రీని పరిచయం
చేశారు. ఆమె చాలా
అందంగా ఉంది. ఆవిడే
ఆమందిరానికి యజమానురాలు అని తెలిసిన వెంటనే ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నాను.
ఏదో కారణం ఉండటం వల్లనే బాబా నన్నిక్కడకు తీసుకొని వచ్చారు. మేమిద్దరం మంచి
స్నేహితురాళ్ళమయ్యాము. 10 రోజులపాటు మందిరం ఆవరణలోనే ఉన్న తన గదిలో ఉండమని చెప్పింది. ఆవిడ దివంగతుడయిన తన భర్త
గురించి చెప్పింది. ఆమె
భర్తకు ఏడు సంవత్సరాల వయసప్పుడు (స్వప్నంలో) బాబాకు మందిరం కట్టిస్తానని మాట ఇచ్చారట.
ఆతరువాత ఆయన ఒకేసారి రెండు వేపచెట్త్లను
నాటారు (ఈ
వేపచెట్లు ఉన్న ప్రదేశంలో శక్తి ప్రవహిస్తూ ఉంటుందనీ ఆశక్తిని మీరు అనుభూతి చెందవచ్చనీ, భక్తులందరికీ కూడా అది
అనుభవమవుతుందని చెప్పింది). చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రదేశంలో అనుకున్న ప్రకారం ఇల్లు
కట్టుకుందామనుకున్నారు, కాని బాబా మందిర నిర్మాణం జరిగింది. ఇంత పెద్ద మందిరాన్ని ఎంతో శ్రమకోర్చి, బాబామీద ప్రేమ
భక్తితో నాలుగు నెలలలోనే నిర్మించడం సాధ్యపడింది.
మందిరానికి సంబంధించిన సిబ్బంది, మందిరం ఆవరణలో పనిచేసే అందరితోటి
బాగా పరిచయం కలిగింది. అందులో పనిచేస్తున్న మేనేజరు, పూజారి ఆయన కుటుబం ఇంకా వాలంటీర్లు అందరూ పెద్ద ఉమ్మడి కుటుబంలా మెలగుతూ ఉన్నారు. మేనేజర్ కొడుకు చాలా ముద్దుగా
ఉన్నాడు. ఆ
పిల్లవాని వయస్సు 9 సంవత్సరాలు. ఆ బాబు బాబావారి అన్ని ఆరతులని,
భజనలని చక్కగా పాడగలడు.
బాబా ఇచ్చిన ఎన్నో అనుభవాలను, బాబా
గురించిన విషయాలను మేమిద్దరం చర్చించుకుంటూ గంటలతరబడి కాలం గడిపేవాళ్ళం. ఆవిధంగా మేమిద్దరం మాట్లాడుకునె సమయంలో ఆ బాబు దృష్టిని పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఆటల మీదకి మళ్ళిద్దామని చూశాను.
కాని ఆ బాబు వాటిమీద ఎటువంటి ఆసక్తిని
కనబరచలేదు. కాని,
బాబా గురించి మాట్లాడితే మాత్రం వాడి మొహం ఆనందంతో వెలిగిపోయేది. అంత చిన్న వయసులోనే ఆబాబుకి బాబా
తప్ప మరేదీ అవసరం లేదనే విషయాన్ని గ్రహించిన నాకు చాలా ఆశ్ఛర్యం కలిగింది. బాబా ఆ బాబుని దీవించు గాక.
మరుసటి రోజు ఉదయం బాబా మందిరంలోనుండి
లౌడ్ స్పీకర్ లో “ఉఠా, ఉఠా సకల జనా”
అనే పాట శ్రావ్యంగా వినపడగానే నాకు మెలకువ వచ్చింది. నాకు ఆ పదాల యొక్క అర్ధం ఏమాత్రం తెలీదు. గ్రామంలో నివసించేవారినందరినీ ఆరతికి రమ్మని ఉదయాన్నే
మేలుకొలుపుతున్నారని నేను భావించాను.
వెంటనే నేను దుస్తులు మార్చుకుని వేగంగా మందిరానికి
చేరుకొన్నాను. మందిరంలోని
బాబా విగ్రహం ముమ్మూర్తులా షిరిడీలో ఉన్న విగ్రహాన్ని పోలి
ఉంది. ఇక్కడ ఉన్న
పూజారులు పడుచువాళ్ళయినా తమ జీవితాన్ని భక్తితో బాబా సేవకి,
అంకితం చేసి షిరిడీలో జరిగే విధంగానే ఇక్కడ కూడా ఉదయాన్నే బాబాకి అభిషేకం, ఆరతులు నిర్వహిస్తూ ఉన్నారు.
మందిరంలో కూర్చుని బాబాకు జరుగుతున్న
ఆరతిని భక్తి పారవశ్యంతో తిలకిస్తూ ఉన్నాను.
అకస్మాత్తుగా నా ప్రక్కనే బాబా ఉన్నట్లుగా అనుభూతి కలిగింది.
అలా ఎందుకని అనిపించిందో
నేను గ్రహించుకునేలోపే పూజారి నన్ను బాబా ఉన్నపీఠం దగ్గరకు రమ్మని పిలిచాడు. నాకెంతటి ఆశ్చర్యం ఆనందం కలిగాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆ అనుకోని సంఘటన నాకు
దిగ్భ్రాంతిని కలిగించింది. బాబాకు నేనెంతో కృతజ్ఞురాలిని.
షిరిడీలోనయితే బాబాకు, పూజారులకి ఆ
విధంగా అత్యంత దగ్గరగా నిలబడే అవకాశం నాకు కలిగి ఉండేది కాదు. అది ఊహించడానికి కూడా సాధ్యమయే విషయం కాదు.
నేను బాబా పీఠం దగ్గరకు వెళ్ళి బాబా
విగ్రహం ముందు నిలుచున్నాను. పూజారి
నాకు కొన్ని పుష్పాలను ఇచ్చాడు. పూజారి మంత్రాలను చదువుతూ ఉండగా, అతి సుందరమయిన బాబా విగ్రహానికి ఇంత దగ్గరగా
నేను నిలబడే అవకాశం కలిగినందుకు నేనెంత అదృష్టవంతురాలినో కదా అని ఆలోచిస్తూ ఉన్నాను. నాకు వెంటనే బాబా విగ్రహాన్ని కౌగలించుకోవాలనిపించింది. కాని పూజారి నాకిచ్చిన ఈ అవకాశాన్ని నా పాత అలవాట్లతో పూజారి మనసుని కష్టపెట్టడం ఇష్టం లేదు. అందుచేత అటువంటి సాహసం చేయలేదు. పూజారి చెప్పినట్లు బాబా విగ్రహానికి పువ్వులను సమర్పించి చేతులు జోడించి శిరసు వంచి ఆయనకు నమస్కరించి పీఠింనుంచి క్రిందకు దిగాను.
నేను నిలబడే అవకాశం కలిగినందుకు నేనెంత అదృష్టవంతురాలినో కదా అని ఆలోచిస్తూ ఉన్నాను. నాకు వెంటనే బాబా విగ్రహాన్ని కౌగలించుకోవాలనిపించింది. కాని పూజారి నాకిచ్చిన ఈ అవకాశాన్ని నా పాత అలవాట్లతో పూజారి మనసుని కష్టపెట్టడం ఇష్టం లేదు. అందుచేత అటువంటి సాహసం చేయలేదు. పూజారి చెప్పినట్లు బాబా విగ్రహానికి పువ్వులను సమర్పించి చేతులు జోడించి శిరసు వంచి ఆయనకు నమస్కరించి పీఠింనుంచి క్రిందకు దిగాను.
బాబానుంచి మరింతగా ఆయన ఆశీర్వాదాలను, అనుగ్రహాన్ని పొందడానికి IAAY (I AM ALWAYS WITH YOU) వ్రాత ప్రతిని ఎంతో సంతోషంగా బాబా పాదాలముందు ఉంచాను. మధాహ్నం చిన్నపిల్లవానితో (మేనేజర్ కొడుకు) హాయిగా సమయం గడిపాను. మాతోకూడా అతని తల్లి ఉంది. ఆవిడ పాదాలు కాస్త వంకర తిరిగి
ఉన్నాయి. ఆమె
బలహీనురాలయినా ఎంతో భక్తిపరురాలు. నాగదిలో నాకోసం వారు
ప్రత్యేకంగా బాబా పూజను జరిపారు. ఇక్కడివారందరు ఎంతో
నిరాడంబరంగాను, అణకువతోను ఉన్నారు. ఇటువంటి వ్యక్తులతో ఉన్నందుకు
వారి ప్రేమను, అభిమానాన్ని చూరగొన్నందుకు నేనెంతగానో
సంతోషించాను.
మరుసటిరోజు మందిరం యజమానురాలు నన్ను తనతో
కూడా తీసుకునివెళ్ళి తనకున్న అన్ని ఇళ్ళను చూపించింది. ప్రతి ఇల్లు ఒకదానికొకటి
ఆకృతిలోను, వైశాల్యంలోను ఒకేలా లేవు. అన్నీ వేరు వేరుగా ఉన్నాయి. ఆ ఇళ్ళు చాలా అందంగా కట్టబడి ఉన్నాయి. అంత వైభవోపేతంగా ఉన్న ఇళ్ళను చూడగానే నాకు చాలా ఆశ్చర్యం
కలిగింది. ఇది నాకు
సంతోషాన్ని కల్గించలేదు. కాస్త ఇబ్బందిగా అనిపించింది. ధనికులయినా, పేదలయినా అందరినీ సమంగానే చూడాలి.
(ఇంకా మరికొన్నె సంఘటనలు ఉన్నాయి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment