20.02.2019 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ – 3 వ.భాగమ్
YOU
BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP
WITH GOD
LORRAINE
WALSHE RYAN & FRIENDS
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి.
దీనిలోని
ఏ భాగము కూడా మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
బాబాతో జీవనమ్ – 2005
జనవరి
బాబా మనలనుండి కోరుకొనేది శ్రధ్ధ, సబూరి.
(లోరెన్ వాల్ష్ గారు జనవరి నెలలో షిరిడీ వెళ్ళారు.
ఆవిడ
వ్రాసిన మొదటి రచన (IAAWY
. I AM ALWAYS WITH YOU పుస్తకం
వ్రాత ప్రతిని సంస్థాన్ వారికి చూపించి ముద్రణకు అనుమతిని తీసుకుందామనే ఉద్దేశ్యంతో అక్కడి సంస్థానిధికారులని కలుసుకుకోవడానికి వెళ్ళారు.
వారు
ఆమెకు పుస్తక ప్రచురణకి అనుమతినిచ్చారు. ఆ
తరువాత ఆమెను బాబా విగ్రహానికి దగ్గరగా నున్న గదిలోకి తీసుకొని వెళ్ళారు.
(కొంతభాగమ్ అనువాదమ్ చేయకుండా వదలివేయడం వల్ల సంగ్రహంగా మాత్రమే ఇచ్చాను.
త్యాగరాజు) ఆ
తరువాత జరిగిన సంఘటనలు…
ఆ గది కాస్త చీకటిగా ఉంది.
ఆగదిలో
నీడలు పడుతున్న చోట యువకునిలా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని
వేషధారణ చాలా విచిత్రంగా ఉంది.
అతను
నల్లని దుస్తులు ధరించి ఉన్నాడు.
గదిలో
నీడలు పడుతున్న చోట నుంచి అతను నిశ్శబ్దంగా నాముందుకు వచ్చి నాకు 9 ఊదీ పాకెట్లను ఇచ్చాడు.
ఆ తరువాత అతను నా నుదుటి మీద చందనం, ఊదీ పెట్టి నన్నాశీర్వదించాడు. ఆ
సమయంలో నాకు కలిగిన ఆనందం ఎటువంటిదో మీరే ఊహించుకోండి. 9 పాకెట్ల
ఊదీ, చందనం, నల్లరంగు
కఫనీ ధరించిన యువకుడు.- వీటి ద్వారా నేను వ్రాసిన IAAWY
పుస్తకం ముద్రణకు బాబావారు తమ అనుమతిని ఆ విధంగా ప్రసాదించినట్లుగా నాకు అనిపించింది. పుస్తక
ముద్రణలో ముందుకు సాగిపొమ్మని, బాబానుంచి నాకు ఆశీర్వాదాలు అమితంగా లభించాయి.
ఇపుడు
నేను పబ్లిషర్ ని వెతుక్కోవాలి. చేసేది, చేయించేది బాబాయే అయినపుడు నాకిక చింత ఎందుకు -
అంతా
ఆనందమే.
ఎంతో సంతోషం నిండిన హృదయంతో బాబా దర్శనం చేసుకున్న తరువాత నాగదికి తిరిగి వచ్చాను.
గదిలోకి
ప్రవేశించగానే నాదృష్టి గోడకు వ్రేలాడుతున్న బాబా ఫోటో మీద పడింది.
బాబా
చూపించిన లీలలకు ఆశీర్వాదాలకి బ్రహ్మాండమయిన ఆనందాన్ని మదినిండా నింపుకొని గదికి తిరిగి వచ్చిన నాకు, నా మొదటి IAAWY పుస్తకానికి బాబా కూడా చాలా సంతోషించారనిపించింది. ఆవిధంగా
ఆనందాన్ననుభవిస్తూ మంచం మీద పడుకుని బాబా ఫొటోవయిపె దీక్షగా చూస్తున్నాను. ఆయనకి
నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు
ఆ ఫోటోనుండి బాబావారి పూర్తి దర్శన భాగ్యం కలుగుతూ ఉంది.
అది
నమ్మశక్యం కాని యధార్ధమయిన సంఘటన.
ఆ ఫొటోనుండి దివ్యమయిన కాంతి ఉద్భవించి నామంచం దగ్గరకు ప్రసరించసాగింది.
భగవంతుని
యొక్క ఆవిధమయిన కాంతిపుంజమేమిటో ఇది ఎలా సంభవిస్తూ ఉందో నేనెవరికీ వివరించలేను, సాధ్యం కాదు కూడా. (నేను మామూలు భాషలో చెప్పాలంటే బాబా నాకు ఆవిధంగా దర్శనమిచ్చారని చెప్పక తప్పదు.) బాబా ఫొటో నించి వచ్చిన ఆ కాంతి మెరుస్తూ ఆకారంలోను, రంగులోను, పరిమాణంలోను మార్పు సంతరించుకుని కనిపించింది. (ఈవిధంగా
నాకు సంవత్సరాలపాటు చాలా సార్లు అనుభవమయింది. IAAWAY చదవండి). ఆవిధంగా నాకు బాబా దర్శనమయిన తరువాత ఆఫొటో తిరిగి యధావిధిగా మారిపోయింది. ఈ
రోజు జరిగిన ఈ సంఘటన నా దృష్టిలో అత్యంత అరుదయిన ముఖ్యమయిన సంఘటన.
కారణం
ఇది షిరిడీలో జరిగింది కాబట్టి.)
మరుసటి రోజు నేను ఖండోబా ఆలయానికి వెళ్ళాను.
ఆరోజున
గుజరాత్ నుంచి బాబా పల్లకీని మోసుకుంటూ చాలామంది మగవారు ఆలయానికి వస్తున్నారని, అందువల్ల తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపొమ్మని పూజారి తొందర పెట్టాడు.
మేమిద్దరం
మాట్లాడుకుంటూ ఉండగానే దాదాపు 150 మంది మగవారు చక్కగా అలంకరించిన పల్లకీలో సుందరమయిన బాబా ఫొటోని ఉంచి మోసుకుంటూ వచ్చేశారు.
వారు
నన్ను కూడా ఒక విగ్రహంగా అనుకోవచ్చనే ఉద్దేశ్యంతో నేను బాబా విగ్రహం ప్రక్కన నక్కి దాక్కున్నాను. నేను
ఆలయంలోనుంచి వెంటనే వెళ్ళిపోదామన్నా అప్పటికే ఆలశ్యమయియింది. నేను
బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఆలయం పరిమాణానికి మించి పూర్తిగా గుజరాత్ నుంచి వచ్చిన వారితో కిక్కిరిసి పోయింది.
అంతమంది మగవారు బాబాకు వినయవిధేయతలతో నమస్కారాలు పెడుతూ ఉంటే నాకు సంభ్రమాశ్చర్యాలు కలిగాయి.
కొంతమంది
భక్తులు మోకాళ్ళమీద కూర్చుని నమస్కారాలు పెడుతూ ఉంటే, మరికొంతమందికి భక్తిపారవశ్యంతో ఏడుపు వస్తూ ఉంది.
అందరూ
బాబా ఎడల ప్రేమను, భక్తిని చాటుకుంటున్నారు. చివరికి
అందరి దృష్టి నామీద పడింది.
వారందరూ
నావైపు విస్మయంగా చూసారు.
150 మంది
మగవారి మధ్య నేనొక్కత్తెనే స్త్రీని.
ఇక
నాపరిస్థితి ఏవిధంగా ఉందో మీరే ఊహించుకోండి. భయంతో
కొయ్యబారిపోయాను. చివరికి
ఒకతను ధైర్యం తెచ్చుకొని పూజారిని అడిగాడు..”ఆమె ఎవరు?” అని. “ఈ
పిచ్చి ఫకీరీ” వ్రాసిన పుస్తకం గురించి పూజారి వివరించగానే “IAAWAY పుస్తక ముద్రణ ఎప్పుడు జరుగుతుందనీ, ఆపుస్తకాలను తాము కోంటామనీ చెప్పారు.
మేమందరం
ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకున్న తరువాత అందరూ వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా వయసుమళ్ళిన
ఒకాయన ఆలయంలోకి ప్రవేశించి నావద్దకు వచ్చాడు.
ఆయన
నానుదుటిమీద ఊదీతో మూడు రేఖలను దిద్దాడు.
ఆయన
ఎంత వేగంగా అకస్మాత్తుగా నాఎదుటకు వచ్చాడో అంతకన్నా వేగంగా కనిపించకుండా వెళ్ళిపోయాడు. పాఠకులారా! నాకు ఎటువంటి పద్ధతుల గురించి ఏమాత్రం తెలియదు.
అటువంటి
అనుకోని సంఘటనలు జరిగినపుడు అవి బాబా నాకిచ్చిన దీవెనలనే భావిస్తూ ఉంటాను.
ఆవిధంగా వచ్చిన వ్యక్తి బాబాయేనా?
నేను తిరిగి హోటల్ కి వచ్చి నాగదిలోకి ప్రవేశించాను. సూర్యుడు
అపుడే మరొక ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి తయారవుతున్నాడు. సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను చూడటమంటే నాకెంతో ఇష్టం.
అందులోను
షిరిడీలో చూడటమంటే మహా ఇష్టం.
చాలా
అధ్బుతంగా ఉంటుంది ఆ దృశ్యం.
గదిలో
కిటికి వద్ద నిలబడి అస్తమిస్తున్న సూర్యబింబాన్ని చూస్తూ ఉన్నాను.
ఆవిధంగా
చూస్తుండగా ఎరుపు రంగులో బంతి ఆకారంలో అగ్ని కిటికీ వైపు రాసాగింది.
నాకీరోజు
చాలా ఆనందదాయకమయిన మరపురాని రోజు.
బహుశ
నాది భ్రమ కావచ్చు.
ఆ అగ్నిగోళం కిటికీకి దగ్గరగా వచ్చింది.
ఆ గోళం నన్ను ఢీ కొట్టకుండా వెంటనే నా తలను క్రిందకు వంచాను.
అది
నాగదిలోకి ప్రవేశించి గదంతా మొత్తం మండుతున్న బంతిలాగ తిరిగి, చివరికి కిటికీ గుండా బయటకు సూర్యునివైపు ప్రయాణించి
సూర్యునిలో కలిసిపోయింది. నాగది ఎప్పటిలాగానే చీకటిగా అయింది. జరిగిన అధ్భుతమయిన సంఘటన గురించి
ఆశ్చర్యపడుతూ చీకటిగా ఉన్న ఆగదిలో ఆలోచిస్తూ కూర్చున్నాను.
మాటలతో వర్ణించలేని సంఘటన.
(తరువాత మార్చి నెల --- మహాశివరాత్రి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment