24.02.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –
5 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
ఇందులో నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
బాబాతో జీవనమ్ – 2005
మార్చ్ నెల
మరునాడు ఉదయాన్నే సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ
వెడుతున్నాను. నేను, బాబా ఇద్దరం నత్త గుల్లలను, ఆల్చిప్పలను ఏరుకుంటూ
ఆనందిస్తున్నాము. వాతావరణ ప్రభావమ్ నన్ను తొందరగా
మందిరం ఆవరణలో ఉన్న ఏ.సి. గదికి వెళ్ళేలా చేసింది. మేనేజర్
కుటుంబంతో నాగదికి వచ్చి అందమయిన సాయిబాబా విగ్రహాన్ని నాకు బహూకరించాడు. ఆవిగ్రహం కాషాయ రంగులో ఉంది.
ఆ కుటుంబం
నాయెడల చూపిన ఔదార్యానికి ఎంతో ముగ్ధురాలినయ్యాను. నేనెవరో వీరికి తెలియదు. కాని ఎంత మంచి మనసుసులు
వారివి. నాకు బాబా మీద ఉన్న అపరిమితమయిన ప్రేమను
గమనించి, వారు సామాన్య స్థితిపరులయినా నాకెంతో అందమయిన బాబా
విగ్రహాన్నిచ్చి సంతోషాన్ని కలిగించారు.
మందిరం యజమానురాలికి దివ్యమయిన ఇళ్ళు చాలా
ఉన్నాయి. వాటిలో ఒక ఇంటికి నన్ను రాత్రి భోజనానికి ఆహ్వానించింది. ఆయింటి సేవకురాలిని చూడగానే ఆమె పట్ల నాకు
స్నేహభావం కలిగింది. ఆమె కూడా బాబా భక్తురాలే. మేమిద్దరం బాబా ముందు కొవ్వత్తి దీపాలను వెలిగించాము.
( ప్రతిరోజు నేను సిడ్నీలో బాబా
పటం ముందు పగలు, రాత్రి కొవ్వొత్తులను వెలిగించి ఉంచుతూ
ఉంటాను. శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా తనకు దీపాలు
వెలుగుతూ ఉండటమంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ యింటి సేవకురాలికి,
నాకు బాబాను చీకటిలో ఉంచడం ఇష్టం లేదు. ఇక్కడ మేము ఆయనకు కొవ్వొత్తి దీపాలను పెడుతున్నాము.
మందిరం యజమానురాలు, నేను మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆవిడ
తనకున్న కొన్ని వ్యక్తిగత సమస్యల గురించి నాతో చెప్పసాగింది. ఆమె బాధలను వింటు నేనామెను ఓదారుస్తున్న సమయంలో నానోటినుంచి వచ్చే మాటలు
నావి కావు. బాబాయే నాద్వారా మాట్లాడుతున్నారు. గొంతు కూడా నాది కాదు. నా స్వరం
మారిపోయింది. భాషకూడా ఆంగ్ల భాష కాకుండా వేరే
భాషలో వస్తున్నాయి మాటలు. బాబాయే నాద్వారా ఆమె
సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తూ సలహాలనిస్తున్నారు. ఇప్పటివరకు నాకామె గురించి ఏమాత్రం తెలీదు. నేను ఆమెకు పూర్తిగా అపరిచితురాలిని. అటువంటప్పుడు నేనామెకు సలహాలను ఎలా ఇవ్వగలను? ఎందుకని ఆమె నామీద అంత నమ్మకంతో తనకు సంబంధించిన రహస్య విషయాలను చెబుతు
ఉంది? మా ఇద్దరి సంభాషణ ముగిసిన తరువాత నేనొక
వింతయిన అనుభూతికి లోనయ్యాను. నా అభిప్రాయాన్ని
చెప్పడం వల్ల నేను ప్రమాదంలో పడినట్టనిపించి నన్ను నాగది వద్ద కారులో దింపేయమని
ఆమెని అడిగాను. నేను వెంటనే నా బాబాతో ప్రశాంతంగా
గడపాలి.
రాత్రంతా ఏదో తెలియని
భయం నన్ను పట్టి పీడించింది. మరునాడు ఉదయాన్నే కాకడ ఆరతికి వెడుతూ ఉన్నాను. హటాత్తుగా ఎక్కడినుంచి వచ్చొందో తెలియదు కాని ఒక కుక్క నామీద దాడి
చేయడానికి ప్రయత్నించింది. నేను భయంతో బిక్క
చచ్చిపోయాను. సెక్యూరిటీ గార్డు వచ్చి ఆ కుక్క
నామీద దాడి చేయకముందే దాన్ని తరిమేశాడు. ఆ సంఘటన
నాలో ఇంకా వణకు పుట్టిస్తూనే ఉంది. వెంటనే తొందర
తొందరగా మందిరంలోకి ప్రవేశించాను. అప్పటికే ఆరతి
మొదలయింది. మందిరంలో ఉన్న ఒక కరెంటుదీపం మీద ఒక
నల్లటి బొంతకాకి కూర్చుని ఉంది. దాని మీద
నాదృష్టి పడింది.
మందిరంలో మొత్తం 9 మంది ఉన్నారు. అందరూ దూర దూరంగా నుంచుని ఉన్నారు. అంతమంది
ఉన్నా గాని ఆ కాకి దాదాపు 15 నిమిషాలపాటు నా చుట్టూ తిరుగుతూ
భీతి గొలిపేలా నామీద దాడి చేస్తూ ఉంది. ఆది నాతల
మీద కాళ్ళతో నన్ను పట్టేద్దామన్నంతగా ఎగురుతూ ఉంది. మందిరంలో ఉన్నవాళ్ళు కూడా చాలా భయంగా చూస్తూ ఉన్నారు. భీతావహంగా ఆ కాకి చేస్తున్న శబ్దాలు విపరీతమయిన ప్రవర్తన పూజారిని కూడా కలవరపెట్టాయి. నేను బాబా
విగ్రహం మీదనే దృష్టి నిలిపి మనసులోనే “ఇక్కడ నువ్వు నాకు
ఎటువంటి ఆపద కలగనీయవు. నాకిప్పుడు ఈ సమయంలో నాకు రక్షణగా ఉంటావు అవునా” అని ప్రార్ధించుకొన్నాను.
నేనావిధంగా బాబాకు
విన్నవించుకున్న వెంటనే ఆకాకి మందిరంలోనుండి బయటకు ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఎటువంటి ఆటంకం లేకుండా ఆరతి
యధావిధిగా జరిగింది. ఆరతి పూర్తయిన తరువాత
నాగదికి తిరిగి వెడుతూ ఉండగా, మరలా ఆకాకి ఎలా వచ్చిందో
తెలియదు, మళ్ళీ నామీద దాడి చేయడానికి ప్రయత్నించింది. భయంతో నేను నాగదిలోకి పరిగెత్తుకుని వెళ్ళాను. మధ్యాహ్నం నేను, మందిరం యజమానురాలు ఇద్దరం కలిసి
మధ్యాహ్న ఆరతికి నడచుకుంటూ వెడుతున్నాము. హటాత్తుగా
నా ఎదురుగా ఒక దృశ్యం కనపడింది. ఆశ్చర్యంతో
నాకళ్ళు పెద్దవయాయి. ఉదయం నామీద దాడి చేయడానికి
ప్రయత్నించిన కుక్క తన నోటితో కాకిని పట్టుకుని ఉంది. నమ్మశక్యం
కాని రీతిలో అలా చూస్తూ నుంచుండిపోయాను. ఆ కుక్క
మెల్లగా నాదగ్గరకు వచ్చి నాచుట్టూ ఒకసారి తిరిగి చచ్చిపోయిన ఆ కాకిని తననోటిలో
ఉంచుకుని వెళ్ళిపోయింది. ఇది ఈ విధంగా ఎందుకని
జరిగిందో నేనేమీ చెప్పలేను. యజమానురాలికి,
నాకు ఇద్దరికీ సమాధానం దొరకని సంఘటనగా మిగిలిపోయింది.
మందిరంలో
పనిచేస్తున్న పూజారులలో గణేష్ అనే ఆయన ఉన్నాడు. గణేష్ నాకు గ్లాస్ కేస్ లో ఉన్న బాబా విగ్రహాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇది ఒక మంచి శుభసూచకం. విఘ్నాధిపతి అయిన
వినాయకుడు అన్ని అడ్డంకులను నివారిస్తాడు. అంతేకాదు,
కారణమేమయినప్పటికి ఇక్కడ నామీద జరిగిన దాడి జంతువులు, పక్షులనుంచి ఎదురవబోయే ఉపద్రవాలనుకూడా అడ్డుకుంటాడు.
చెన్నైలో ఉన్న ఈ
అధ్భుతమయిన బాబా మందిరంలో రోజులు గడిపేసాను. అనుకోనివిధంగా జరిగిన సంఘటనకు కారణం తెలియకుండా భారమయిన హృదయంతో సిడ్నీకి
తిరిగి వచ్చాను. ఇక్కడ అనేక సంఘటనలు జరిగాయి. కాని, అలాంటి సమయంలో ఆవిధంగా ఎందుకు జరిగిందో
నిర్ణయించుకోలేకపోయాను.
సిడ్నీకి చేరుకున్న
తరువాతి రోజు మరలా ఆఫీసుకు వెళ్లాలని లేకపోయినాగాని. భయం, ఆందోళనలతో నేను వెళ్లక తప్పలేదు. రైలు అందుకోవడానికి వెడుతుండగా దారిలో ఒక వృధ్ధుడు కనిపించాడు. అతను పొడవుగా సన్నంగా ఉన్నాడు. కుంటుతూ
నడుస్తున్నాడు. గడ్డం, నెత్తిమీద
టోపీతో ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఇద్దరం
ఒకరికొకరం దగ్గరకు రాగానే అతను ‘హల్లో’ అని పలకరించాడు. నేనతనివైపు చిరునవ్వుతో
తిరిగి హల్లో అని పలకరించాను. ఆవెంటనే నేను
షిరిడీసాయి వైపు చూస్తున్నాననీ, ఆయనకే నేను పలకరింపుగా
అభివాదం చేసాననే భావం కలిగింది. నాకు తెలుసు
ఆవ్యక్తి బాబా అని. అయితే మనసులోనే బాబాతో
మాట్లాడాను. “నువ్వేనని నాకు తెలుసు. బాబా, నేను ఊహించినది అబధ్ధం కాదు. అది నువ్వే అనడానికి సాక్ష్యంగా ఏదయినా సూచన ద్వారా తెలియచెయ్యి, ప్లీజ్ ప్లీజ్," అని మెల్లగా మాట్లాడాను. నాకు వెంటనే బాబా సూచన ద్వారా తెలియచేసారు. ఒకటి కాదు రెండు కార్లు ‘ME’ అనే అక్షరాలు వ్రాసి
ఉన్న నంబరు ప్లేట్ లతో నా ముందునుంచి వెళ్ళాయి. బాబా
ఆవిధంగా నాకు ‘నేనెపుడు నీతోనే ఉంటాను” అని చెప్పారు. ముందు జరగబోయేవన్నీ
శుభశకునాలే అన్నట్లుగా నాకు సందరమయిన స్వప్నం వచ్చింది.
“నేను
ఎస్కలేటర్ మీద క్రిందకు దిగుతూ ఉన్నాను. క్రింద కొంతమంది గుంపుగా నిలబడి షిరిడీసాయి ఫొటోవైపు చూస్తూ ఉన్నారు. గోడమీద అందమయిన పెద్ద ఫ్రేములో బాబా ఫొటో వ్రేలాడుతూ ఉంది. అక్కడ చూస్తున్నవారిలో ఒకతనితో బాబాయే నా సర్వస్వం అని చెప్పాను
(వాస్తవానికి నేనీ మాట తరచుగా చెబుతూనే ఉంటాను) ఆతరువాత బాబా ఆఫోటోలో జీవం
పోసుకుని నావైపు చిరునవ్వులు చిందిస్తూ నన్ను దీవిస్తున్నట్లుగా తన చేతిని
పైకెత్తారు.”
కలనుంచి మేలుకొన్న
తరువాత వంట యింటి కిటికీలోనుండి బయటకు చూసాను. పైన ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయి చలిగాలులు వీస్తున్నాయి. చేతిలో టి కప్పు పట్టుకుని నిలబడి ఉన్నాను. మనసులోనే సూర్యదేవునితో ఇలా విన్నవించుకున్నాను – “సూర్యదేవా,
రా! బయటకు రా! స్వామీ! బయట బట్టలు
ఆరవేసాను. అవి ఆరిపోయిన తరువాత నీవు నల్లమబ్బుల
చాటుకు వెళ్ళి దాక్కో.” ఆకాశం నల్లగా
మారిపోయింది. కాని ఆ నల్లని మబ్బుల చాటునుంచి ఒక
సూర్యకిరణం తొంగి చూసింది. మెల్లమెల్లగా నల్లని
మబ్బుల చాటునుంచి సూర్యుడు కనువిందు చేస్తూ నాకెంతో ఆనందాన్ని కలిగించాడు.
ఆకాశం ప్రకాశవంతంగా నీలంగా మారిపోయింది. ఎండవేడిమికి
బట్టలు ఆరిపోయాయి. ఆ తరువాత నల్లటి మబ్బులు మరలా
వచ్చి వాన మొదలయింది. ప్రకృతి దృశ్యం ఎంత మనోహరంగా
ఉంది. నేను చేసిన చిన్న ప్రార్ధనకు ఆయన నాకింకా
ఎంతో ఉపకారం చేసాడు. నాబట్టలు ఆరిపోయాయి. ఖగోళమండాలంనుంచి భగవంతుడు మాత్రమే అటువంటి అధ్భుత కార్యాలను చేసి
చూపించగలడు.
ఇంకా మరొక ఆనందకరమయిన
విషయం – నాపూజ గదిలో గోడమీద బాబా ఫొటోనుండి బాబా
మరింత తేజోవంతంగా, శక్తిమంతంగా, తెల్లని కఫనీలో వాస్తవ రూపంతో నాకు కనిపించారు. ఆయన అలా కొంత సేపు
కనిపించారు. అప్పుడు మేమిద్దరం ఒకరి కళ్లలోకి
ఒకరం చూసుకున్నాము. బాబా నాచేత చేయించవలసిన
కొన్ని పనుల గురించి ఆయనకు గుర్తు చేసాను. ఆ
వెంటనే బాబా అదృశ్యమయి గోడమీద ఫోటోలోకి యధారూపంలోకి ప్రవేశించారు.
(అధ్భుతమయిన
సంఘటనలు ఇంకా ఉన్నాయి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment