27.02.2019 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –
6 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
ఇందులో
నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా
ఉన్నాయి. కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే
ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
శ్రీ షిరిడీ సాయిబాబాతో స్నేహబంధమ్ 6 వ భాగంలో "సముద్రపు ఒడ్డున బాబా, నేను నత్తగుల్లలను, ఆల్చిప్పలను ఏరుకుంటూ ఆనందిస్తున్నాము" అని చదివిన తరువాత ఒకామె ఫోన్ చేసి బాబా చిన్న పిల్లవానిలా ఆవిధంగా ఆనందించడమేమిటి అని తమ సందేహాన్ని వెలిబుచ్చారు. ఈ సందేహం ఇంకా కొంతమందికి కలిగే ఉండవచ్చనే ఉద్దేశ్యంతో దానికి వివరణ ఇస్తున్నాను.
లోరైన్ వాల్ష్ గారు బాబా తనతో కూడా తన ప్రక్కనే ఉన్నారనే భావంతో ఎల్లప్పుడూ ఉంటారు. ఆమె ఏపని చేసినా మనసులోనే బాబాతో మాట్లాడుతు ఉంటారు. ఆమె చెన్నై వచ్చిన ప్రతిసారి హోటల్ లో టిఫిన్ చేసే సమయంలో కూడా తన ప్రక్కనే బాబా ఉన్నారనే ఉద్దేశ్యంతో బాబాకు తనకు కలిపి ఇద్దరికీ ఆర్డర్ ఇస్తుంది. ఆతరువాత రెండవ టిఫిన్ ను అక్కడ వైటర్ కి సమర్పిస్తుంది. ఆమె సినిమా చూడటానికి వెళ్ళినా, చిన్న బాబా విగ్రహాన్ని కూడా తీసుకుని వెడుతుంది. ఆమె మెడలో లాకెట్ లో బాబా బొమ్మ ఉంటుంది. సినిమా చూసే సమయంలో ఆమె లాకెట్ ను బయటకు తీసు బాబాకు కూడా సినిమా చూపిస్తుంది. ఇది విపరీతమయిన చేస్ట ఎంతమాత్రం కాదు. ఆవిడ బాబాని సంపూర్ణంగా నమ్మింది. శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా తనకు తన ఫొటోకి భేదం లేదని చెప్పారు. అందరి హృదయాలలోను నేను ఉన్నానని చెప్పారు. అటువంటప్పుడు బాబా మనతోనే మన ప్రక్కనే ఉన్నారని భావిస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మన కూడా వస్తున్నారనే విషయాన్ని గ్రహించుకుంటూ ఉండాలి. మనం ఎక్కడికి వెడుతున్నా బాబా నేను వెడుతున్నాను, నువ్వు కూడా నాతో రా అని బాబాని మనతో తీసుకుని వెడుతూ ఉన్నామనే భావం కూడా ఉండాలి.
బాబాతో జీవనమ్ – 2006 వ.సంవత్సరమ్
27.05.2006
నాడీ జాతకమ్
అందరికీ జాతకాల పిచ్చి ఉంటుంది. ప్రతివారికి తమ జాతకం ఎలా ఉండబోతుందోనని
తెలుసుకోవాలనే ఆరాటం ఉండటం సహజమే. నాకు కూడా జాతకాలు చదవడమన్నా, జ్యోతిష్యం గురించి చదవడమన్నా
ఎంతో ఇష్టం. ప్రతిరోజు
దినఫలాలు చదువుతూ ఆరోజున నా నక్షత్రాన్ని బట్టి ఎటువంటి శుభాలు కలుగుతాయో
తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కాని, షిరిడీసాయి నా జీవితంలోనికి ప్రవేశించిన
తరువాత ఇటువంటివాటినన్నిటిని ప్రక్కన పెట్టేశాను. దానికి కారణం బాబా మీద నా నమ్మకం, శ్రధ్ధ రోజురోజుకి పెరుగుతూ ఉండటమే. ఆయననే పూర్తిగా నమ్ముకుని
జీవించేవారికి ఇక జాతకాలతో పనేముంటుంది.
నా జాతకం ఎలా ఉందో చూపించుకోవడానికి, ప్రశ్నలు
అడిగి వాటికి సమాధానాలు తెలుసుకోవాలనే కోరిక కూడా నాకింక కలగలేదు. ఇక ఎప్పటికీ అటువంటివాటి జోలికి
పోను. అవసరమయినప్పుడేల్లా
నేను నా బాబానే ప్రశ్నలడుగుతాను.
నాడీ జాతకం గురించి చాలామంది చెప్పగా విన్నాను. దాని గురించి మరింతగా తెలుసుకోవాలనే జిజ్జ్ఞాస కలిగింది. నాస్నేహితురాలు ( R ) నాకోసం నాడి జాతకుని వద్ద అపాయింట్ మెంట్ తీసుకుంది. మన పుట్టిన తేదీ చెప్పితే చాలు. నాడి జాతకం చదివే వ్యక్తి ,
తాళపత్రాలలో మన పుట్తిన తేదీ వివరాలు ఉంటేనే మన జాతకం చెప్పగలడని నా
స్నేహితురాలు చెప్పింది.
ప్రతి 5,6 సంవత్సరాలకి
ఆస్ట్రేలియాకి నాడి జాతకం చెప్పె ఒకాయన వస్తూఉంటాడు. ఆయన తను వస్తున్న విషయం
నాస్నేహితురాలికి ముందుగానే సమాచారమిచ్చారు. 27.05.2006 న
ఆయన వద్ద నా నాడీ జాతకం చదివించుకున్నాను.
నా గురించి చెప్పిన వివరాలన్నీ IAAWY పుస్తకంలో
నేను ప్రచురించాను.
ఆయనను కలుసుకోవడానికి నేను రైలులో హోమ్ బుష్ కి
వెడుతున్నాను. ప్రయాణం
చేస్తున్నంతసేపు నేను “బాబా, ఈ రోజు నా
నాడీ జాతకమ్ చదవడం కనక జరిగితే నువ్వు అక్కడే ఉండాలి. నా నాడీ జాతకం చదవబోయే ముందే
నువ్వు నాకు దర్శనమివ్వాలి” అని బాబాని ప్రార్ధించుకుంటూనే
ఉన్నాను. నేను
అక్కడికి ఉదయం 9 గంటలకి చేరుకున్నాను. అక్కడ నన్నొక వ్యక్తి లోపలికి
రమ్మని కూర్చోమన్నాడు. నేను పుట్టిన తేదీ వివరాలు రాసుకుని నన్ను వేచి ఉండమని చెప్పాడు. అతను నాపేరు, పుట్టిన తేదీ వివరాలు మాత్రమే అడిగాడు. హాలులో కూర్చుని నేను బాబాని
అడుగుతూనే ఉన్నాను. “బాబా, నువ్వు నాతోనే ఉన్నావనే విషయం నాకు తెలియాలి. ఇపుడు నన్ను లోపలికి పిలిచేముందు
గాని, ఆ తరువాత గాని నువ్వు నాటోనే ఉన్నావన్నదానికి నాకు
ఋజువు కావాలి”. ఈ
విధంగా బాబాని అడుగుతూనే ఉన్నాను. నేను నావంతు కోసం నిరీక్షిస్తూ ఉన్న సమయంలో నాడీ జ్యోతిష్కుడు లోపల ఇంకెవరిదో నాడీ జాతకం చదువుతున్నారు.
కాలక్షేపం కోసం అక్కడ బల్ల మిద ఉన్న వార్తా
పత్రికని తీసుకుని చదవడం మొదలుపెట్టాను. కొన్ని పేజీలు తిరగేసిన తరువాత
ఒక పేజీలో షిరిడీ సాయిబాబా ఫొటో కనపడింది. చాలా ఆశ్చర్యపోయాను. బాబా ఫొటోనుండి ఊదీ పరిమళం వస్తు
ఉంది. ఆ పరిమళం చాలా
ఘాటుగా ఉంది. ఆ ఘాటు
వాసనకి దాదాపు నేను స్పృహ తప్పి పడిపోయే స్థితికి చేరుకున్నాను. కాస్త ఓపిక తెచ్చుకుని బాబాని
కాస్త మందలింపు ధోరణిలో “బాబా నేను నీదర్శనాన్ని మాత్రమే
కోరుకొన్నాను. నాడీ
పత్రాలలో నా పుట్టిన తేదీ వివరాలు ఉండేలాగ చూడు. నాడీ జ్యోతిష్కుడు నా జాతకం చదివేటప్పుడు నువ్వే అతని ద్వారా
మాట్లాడు” అని ప్రాధేయపూర్వకంగా బాబాని వేడుకొన్నాను. ఊదీ పరిమళం ఇంకా నా చుట్టూ
తిరుగుతూనే ఉంది. లోపల
ఉన్నాయన నా పుట్టిన తేదీ వివరాలు తాళపత్రాలలో ఉన్నాయనీ, నన్ను
లోపలికి రమ్మని సైగ చేసాడు. నేను లోపలికి ప్రవేశించాను.
ఆశ్చర్యం, ఆయన కూర్చున్న కుర్చీ వెనుక అత్యంత అందమయిన షిరిడీ సాయి ఫొటో ఉంది.
నేనాయతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా
కూర్చుని వినసాగాను. ఆయన నాజీవితంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ ఉన్నది ఉన్నట్లుగా చదివి
వినిపించారు. ఆయన
దక్షిణ భారతదేశపు భాషలో మాట్లాడారు. ఆయన చెప్పినదంతా టేప్
రికార్డర్ లో రికార్డు చేసుకొన్నాను.
నా స్నేహితురాలు దానిని ఆంగ్లంలోకి అనువాదం చేసి చెప్పింది.
అంతా పూర్తయిన తరువాత తిరిగి ఇంటికి
వెళ్ళడానికి రైలెక్కాను. మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. ఇంకా బాబాని ఇలా వేడుకొన్నాను---“బాబా, నాడీపత్రాలలో చదివినదంతా యదార్ధమే అయిట్లయితే
దానికి సాక్ష్యంగా నాకు కుందేలు కనిపించాలి” అని బాబాని
అడిగాను.
నేను ఇంటికి చేరుకునేముందే నాకు కుందేళ్ళ గుంపు
కనపడింది. నాడీ తాళపత్రాలలో నా గురించి
చదివిన విషయాలు కొన్నింటిని మీతో పంచుకుంటున్నాను. నాడి జాతకంలో చదివిన విషయాలు
ఇప్పటికే చాలా జరిగాయి. నేనాయనకు నా పుట్టిన తేదీ వివరాలు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. ఆయన తమిళ భాషలో మాట్లాడారు. నేను ఆంగ్లంలో మాట్లాడతాను.
టేప్ రికార్డర్ లో రికార్డు చేసినదంతా నా
స్నేహితురాలు ఆంగ్లంలోకి అనువదించి చెప్పింది.
తాళపత్రాలలో చదివిన నా జాతకం వివరాలను నేను
ఇస్తున్నాను. వాటి
క్రింద అవి అన్నీ నిజమేనని నిర్ధారిస్తూ నేను ప్రత్యేకంగా నా వ్యాఖ్యానాలను కూడా
వ్రాసాను.
(రేపటి సంచికలో నాడీ జాతక వివరాలు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment