28.02.2019 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –
7 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట , హైదరాబాద్, ఫోన్. 9440375411
8143626744
ఇందులో
నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా
ఉన్నాయి. కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే
ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
బాబాతో జీవనమ్ – 2006 వ.సంవత్సరమ్
నాడీ జాతకం వివరాలు – శ్రీ
సెంధిల్ కుమార్, నాడీ రీడర్ తేదీ : 27.05.2006
(నాడీ రీడర్ అని వ్రాసి ఉన్న చోట
ఆ వివరాలు నాడీ జ్యోతిష్కుడు తాళపత్రాలలో ఉన్నదానిని చదువుతున్నాడని, దాని క్రింద ఇటాలిక్స్ లో
ఇచ్చినవి లోరైన్ గారి వ్యాఖ్యానమని పాఠకులు గ్రహించాలి.
త్యాగరాజు)
ఆమె ఎడమచేతి బొటనవ్రేలు ముద్ర తీసుకొన్నారు –
పుట్టిన తేదీ 05.10.1946
శనివారమ్
నాడీ రీడర్ : మంచి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ జీవించి లేరు. హృద్రోగ సమస్య వల్ల తండ్రి అకస్మాత్తుగా మరణించారు. మీ కుటుంబంలో ఆకస్మిక మరణాలు
సంభవించాయి.
లోరైన్ - నిజమే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా స్నేహితులు, బంధువులు,
నాతండ్రి, సోదరుడు, కజిన్స్,
అందరికి అకస్మాత్తుగా మరణం సంభవించింది.
నాడీ రీడర్ – ఒక సోదరుడు మరణించాడు. ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు జీవించే ఉన్నారు. మీరు ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ
మందులకు సంబంధించి అనగా ఒక ఆస్పత్రిలో సెక్రటరీగా పని చేస్తున్నారు. సేవచేసేవారికి మీరు సహాయపడుతూ
ఉన్నారు.
ఇప్పటి వరకు నాడీ రీడర్ చదివినదంతా యదార్ధమే. నేను ఆస్ట్రేలియాలో
పెద్ద ఆస్పత్రిలో రేడియాలజీ డైరెక్టర్ గారికి పెర్సనల్ అసిస్టెన్ట్గా పనిచేస్తున్నాను.
నాడీ రీడర్ – మీ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయి. ఆధ్యాత్మికతయందు మీకు ఎక్కువ
ప్రీతి. మీకు అంతకు
ముందే ఉంది కాని, ఇప్పుడు మరింతగా ఎక్కువ ఇష్టం ఏర్పడింది.
--- నిజమే
నాడీ రీడర్ – ఈమెకు ఒక గురువు ఉన్నారు. ఆ గురువు శివునియొక్క అవతారం. ఆ అవతారం
షిరిడీశ్వరుడు. ఆయన
షిరిడీ బాబా. ఆయన
అప్పుడప్పుడు ఈమెకు దర్శనమిస్తూ ఉంటారు.
బాబా ఆమెకు తరచుగా దర్శనం ఇస్తూ ఉంటారు. షిరిడీ సాయిబాబా ఆమె ఇంటికి
వచ్చి ఆమెతోనే కలిసి నివసిస్తారు. ఆయన ఒక వెలుగు రూపంలో ఆమెకు దర్శనమిస్తారు. ఆయన ఆమె ఫొటో ద్వారా వస్తు
ఉంటారు. ఆయన
ఆమెతొపాటుగా ఆమె ఇంటిలోనే నిసిస్తున్నారు.
ఇది ఖచ్చితం. నూటికి
నూరుపాళ్ళు యదార్ధమయిన విషయం
నాడీ రీడర్ --
నీ చిన్నతనంలో నీ జీవితం చాలా కష్టదశలో ఉంది. ఆతరువాత కూడా నీకు కొన్ని
సమస్యలు ఏర్పడ్డాయి. ఆ తరువాత నీకు 35 – 37 సంవత్సరాల వయసులో మరిన్ని
సమస్యలు ఎదురయ్యాయి. నీవు జీవితంలో విసుగెత్తిపోయావు.
కొన్ని సమయాలలో నువ్వు “బ్రతికి
ఉపయోగమేమిటీ?” అని ఆలోచించావు. నీ మనసుకి సుఖసంతోషాలనేవి లేవు. ఇదేమి జీవితం అని అనుకుంటూ
ఉండేదానివి.
నాకు నాసో ఫారిన్ జియాత్
కార్సినోమా అనే వ్యాధి యుక్త వయసులోనే వచ్చింది. ఆకాలంలో నాకు రేడియో థెరపీ,
హిస్టరెక్టమీ మరెన్నో సర్జరీలు జరిగాయి.
నాడీ రీడర్ - ముందునుంచీ నీకు ఆధ్యాత్మికత అంటే ఎంతో ఇష్టం. నీకు షిరిడీ బాబా దర్శనమిచ్చారు.
ఇపుడు నీకు ఫోటోలలో షిరిడీ బాబా దర్శనం కలుగుతు ఉంది. నీ యింటిలో ఉన్న ఫోటోలలో బాబా
వస్తుంటారు. ఆవిధంగా
ఆయన నీకు దర్శనం ఇస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సమయాలలో ఆయన నీకు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఇంకెవరికీ కనపడరు. నీలో అటువంటి శక్తి ఉంది.
---అంతా నిజమే. కాని నాలో ఎటువంటి శక్తి లేదు.
ఎటువంటి శక్తీ నాకు కావాలని కోరుకోను. బాబా మీద శ్రధ్ధ, సబూరి ఉన్న ఒక సామన్య భక్తురాలిని మాత్రమే. అంతకుమించి నాలో ఎటువంటి
ప్రత్యేకత లేదు.
నాడీ రీడరు – ముందు ముందు ఏమి జరగబోతుందో తెలుసుకునే
శక్తి నీలో ఉంది. అది
అంతర్గత శక్తి. ఆధ్యాత్మిక
విషయాలలో ఎన్నో విధాలుగా మీ ప్రమేయం ఉంటుంది. నీకు షిరిడీ బాబాతో మాట్లాడే
శక్తి, ఆయనతో కలిసి సంభాషించే శక్తి ఉంది.
బాబా, నేను ఇద్దరం కలిసి మాట్లాడుకోవడమంటే నాకెంతో ఇష్టం. అందువల్లనే బాబా మార్గదర్శకత్వంలోను, ఆయన అనుగ్రహంతోను నేను పుస్తకాలు వ్రాయగలిగాను.
నాడీ
రీడరు – యుక్తవయసులోను, మధ్య వయసులోను నువ్వు
బాధలననుభవించావు. చివరి దశలో నీవు పూర్తిగా
ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించావు.
నువ్వు షిరిడీ సాయిబాబా కోసమే జీవిస్తున్నావు. నీ
ఇంటిలో షిరిడి సాయిబాబా అధ్భుతాలు
చేస్తారు. చాలా తరచుగా ఆయన వచ్చి నిన్ను అనుగ్రహిస్తూ ఉంటారు.
అవును. బాబా
ఎప్పుడూ నాతోనే ఉంటారు.
నాడీ
రీడరు -
చిన్న వయసులోనే ఈమె కష్టాలెందుకు అనుభవించింది? కుటుంబ సమస్యలు కూడా ఎదుర్కొంది. చివరికి ఆధ్యాత్మికజీవనంలోకి
ఎందుకు ప్రవేశించింది? దీనికి కారణమేమిటి? దానికి కారణం గతజన్మయొక్క కర్మ ఫలితం.
గత జన్మలో మంచి పనులు, చెడు పనులు రెండూ చేసావు. గత జన్మలో నువ్వు భారతదేశంలో జన్మించావు. మహారాష్ట్రలోని నాసిక్ లో ఒక
బ్రాహ్మణ కుటుంబంలో మగపిల్లవానిగా జన్మించావు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచారు.
బాల్యంలో నువ్వు చాలా సంతోషంగా గడిపావు. అప్పట్లో నీకు చదువు మీద శ్రధ్ధ
లేదు. అందువల్ల నీ
తండ్రి నీకు వేదాలు నేర్పిద్దామనుకున్నారు. కాని నీకు వేదాలు నేర్చుకోవడం కూడా ఇష్టం లేకపోయింది.
నీతండ్రి మీద నీకు కోపంగా ఉండేది.
--- చాలా ఆశ్చర్యం ఏమిటంటె ఈ
జన్మలో నా చిన్నతనంలో మేము నాగపూర్ లో ఉండేవాళ్ళం. తరచుగా నాసిక్ వెడుతూ ఉండేవాళ్ళం. కాని ఈ జన్మలో నాసిక్ వెళ్ళినా
గాని నాకు షిరిడి సాయిబాబా గురించి ఏమాత్రం తెలీదు.
నాడీ
రీడర్ -
గత జన్మలో నీకు సంసార జీవితం మీద ఆసక్తి లేదు. ఆధ్యాత్మికంగా జీవించడానికి
ఇష్టపడేదానివి. అపుడు
దగ్గరలో ఉన్న గురువు దగ్గరకు వెళ్ళావు.
ఆధ్యాత్మిక విషయాలు ఎన్నింటిలోనో పాలుపంచుకున్నావు. నీ గత జన్మలో కూడా షిరిడీ బాబాయే
నీ గురువు. ఆయననుంచి
నీవు భిక్ష/దీక్ష తీసుకొని ఆయన నుండి ఆధ్యాత్మిక రహస్యాలను
కూడా నేర్చుకొన్నావు. నీ గురువు నీకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురుంచి తెలియచేసారు."
యుక్తవయసులోనే నువ్వు నావద్దకు వచ్చావు. నీకెంతో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఈ జన్మలో నువ్వు చేయవలసినది చాలా
ఉంది. నన్ను విడిచి నువ్వు వెళ్ళద్దు. నువ్వు నాతోనే ఉంటూ, బీదవారికి, అనాధలకు, రోగగ్రస్థులకు సేవచేస్తూ ఉండు” అన్నారు నీ గురువు.
కాని, నువ్వు మంచి వయసులో ఉన్న కారణంగా
ఆశ్రమం ప్రక్కనే నివసిస్తున్న అందమయిన స్త్రీ మోహంలో పడ్డావు. నీ గురువును నీవు మధ్యలోనే
వదిలేసి సంసార జీవితం గడపటానికి వెళ్ళిపోయవు. స్త్రీ వ్యామోహం వల్ల నువ్వు
నీ గురువుని వదిలేసావు. నీ గురువు చాలా కలత చెందారు.
నువ్వు ఉత్తమ శిష్యుడవని నీగురువు భావించారు. నువ్వే పరిపూర్ణమయిన శిష్యుడివని
అనుకున్నారు. ఈ
శిష్యుడు మరలా నాదగ్గరకు తిరిగి వస్తాడు , ఇతని ద్వారా నేను
చేయవలసిన మంచి పనులు చాలా ఉన్నాయి అని నీ గురువు నీకోసం ఎంతగానో ఎదురు చూసారు. కాని, నువ్వు
స్త్రీ మోజులో పడి నీగురువును విడిచి వెళ్ళిపోయావు. నువ్వు ఆ స్త్రీతో కొంత కాలం
సుఖంగా గడిపావు. నీకు
50 సంవత్సరముల వయసు వచ్చిన తరువాత నీకు నీ గురువు గుర్తుకు వచ్చాడు. నీగురువుని వదలి వచ్చేసినందుకు
నువ్వు చాలా చింతించావు. అందువల్ల నీ సంసారజీవితానికి స్వస్తి చెప్పి నీగురువుకు
సాయపడదామనుకొన్నావు.
--- ఇదంతా నా గతజన్మలోని విషయాలు. నా మూర్ఖత్వం వల్ల ఆవిధంగా నేను
చేసినందుకు బాధపడుతూనే ఉంటాను.
కాని, నీకు గురువు దర్శనం కలగలేదు. ఈ జన్మలో నేను నీకు గురువుని
కాలేనని నీగురువు చెప్పాడు. నీకు మంచి ఆధ్యాత్మిక జీవితం ఉంది కాని, ఒక స్త్రీ
కోసం నువ్వు దానిని వదలుకున్నావు.
వచ్చే జన్మలో నువ్వు ఇతర దేశంలో స్త్రీగా జన్మిస్తావు. వచ్చే జన్మలో నువ్వు సుఖాలను,
దుఃఖాలను, కష్టాలను అన్నిటిని భరిస్తావు. జీవితంలో విసిగిపోయి మనశ్శాంతి కూడా దూరమవుతుంది. ఆ సమయంలో
నేను నీదగ్గరకు వస్తాను". ఇదంతా నువ్వు ఆయన స్వరాన్ని అశరీరవాణిగా విన్నావు.
ఆధ్యాత్మికంగానే నీకు సంతోషం
లభిస్తుందని నువ్వు గ్రహించిననాడు, వచ్చే జన్మలో నేనే
నీవద్దకు వస్తాను. నువ్వు
వేరేదేశంలో
ఉన్నా నేను నీదగ్గరకు వస్తాను. నువ్వు విదేశంలో జన్మిస్తావు.
కాని, నేను నీదగ్గరకు వస్తాను. ఈ జన్మలో నువ్వు నన్ను విడిచి
వెళ్ళిపోయావు కాబట్టి నీకింక నాదర్శనం లభించదు. వచ్చే జన్మలో నీకు నాదర్శన
భాగ్యం కలుగుతుంది. నువ్వు
నన్ను త్రికరణశుధ్ధిగా స్మరించుకున్నంతనే నేను నీకు దర్శనమిస్తాను”.
ఆయన నీకు నీఇంటిలో ఫొటోలలో దర్శనమిస్తారు.
ఆయన నీకు ప్రత్యక్ష దర్శనం కూడా కలుగచేస్తారు. ఆయన నీ ఇంటిలో అధ్భుతాలు కూడా
చేస్తారు. ధ్యానంలో
నువ్వు ఆయనను దర్శించగలవు. నువ్వు ఆయనను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోగలవు. ఆయనను వెలుగు రూపంలో కూడా
చూడగలవు. అయన నీకు
దృశ్యాలను చూపిస్తారు. స్వప్నంలో కూడా దర్శనమిస్తారు.
--- ఇదంతా యదార్ధమే. నాకు 50 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత బాబా నావద్దకు
తిరిగి వచ్చారు. పైన
చెప్పినవన్నీ జరిగాయి. ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి.
(మధ్యలో కొన్ని పేరాల క్రింద అండర్ లైన్ ఏర్పడింది. దానిని ఎలా పోగొట్టాలో తిలియలేదు. ఆ విధంగా ఎలా వచ్చిందో నాకర్ధం కాలేదు. దానిని అలాగే ఉంచి ప్రచురించవలసి వచ్చింది.... త్యాగరాజు )
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment