01.03.2019 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –
8 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
ఇందులో
నాకు నచ్చినవి మాత్రమే ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ వదలడానికి లేకుండా
ఉన్నాయి. కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే
ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల
నేను మరెవరికీ అనుమతిని ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
బాబాతో జీవనమ్ – 2006 వ.సంవత్సరమ్
నాడీ జాతకం వివరాలు – శ్రీ
సెంధిల్ కుమార్, నాడీ రీడర్ తేదీ : 27.05.2006
(తరువాయి భాగమ్)
(నాడీ రీడర్ అని వ్రాసి ఉన్న చోట
ఆ వివరాలు నాడీ జ్యోతిష్కుడు తాళపత్రాలలో ఉన్నదానిని చదువుతున్నాడని, దాని క్రింద ఇటాలిక్స్ లో
ఇచ్చినవి లోరైన్ గారి వ్యాఖ్యానమని పాఠకులు గ్రహించాలి.
త్యాగరాజు)
బాబాతో జీవనమ్ – 2006 వ.సంవత్సరమ్
నాడీ రీడర్ - ఈ జన్మలో నువ్వు షిరిడీ బాబాయే నీ శ్వాసగా జీవిస్తావు. భవిష్యత్తులో నువ్వు ఆయన
సందేశాలను ముందు తరం వారికందరికీ ప్రచారం చేస్తావు.
బాబా తన ఇష్ట ప్రకారం నన్ను
ఆ విధంగా ఉపయోగించుకుంటే నేను చాలా ఆనందిస్తాను.
కొంత కష్ట కాలం గడిచింది. గతంలో నీ జీవితంలో అపాయం సంభవించింది. ఇవ్పుడు నువ్వు ఇతరులకు భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో తెలుసుకునే శక్తి కూడా
నీలో ఉంది. నీకు
వాక్సుధ్ధి కూడా లభిస్తుంది. నువ్వు ఏది అంటే అది జరిగి తీరుతుంది. నువ్వు ధ్యానంలో ఇంకా ఉన్నతంగా
ఎదగగలవు. నీ వయసు 60
సంవత్సరములు ఉన్నపుడు ఈ నాడీ జ్యోతిష్య వివరాలు తెలుసుకుంటావు. ఇపుడు నీకు షిరిడీ సాయిబాబా
అనుగ్రహం ఉంది.
62 – 63 సంవత్సరముల వయసులో నీకు ధ్యానంలో షిరిడీ బాబా దర్శనమిస్తారు. ఆయన దర్శనం నీకెంతో సంతోషాన్ని
కలిగిస్తుంది. అదే
ఆయన అనుగ్రహం. అదే సమయంలో
నీకుమార్తెకు వివాహమవుతుంది. ఆమె వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.
జాన్, లిసాలకు ప్రధానం జరిగి 10.04.2010 నాడు వివాహం జరిగింది.
2009 వ.సం.లో
నేను 63వ.సంవత్సరంలోకి అడుగుపెట్టాను.
నీ ప్రవర్తన, నీవు చేసే పనులు అంతకు మించి ఆధ్యాత్మిక విషయాలను గమనిస్తే నువ్వు
నీకుటుంబ సభ్యులందరిలోను విభిన్నంగా ఉంటావు. నీవు సంపూర్ణమయిన ఆధ్యాత్మిక
జీవితాన్ని గడుపుతావు.
అది నిజమే.
ఆధాత్మిక జీవితం గడపటానికే నేను ప్రయత్నిస్తాను.
రీడర్ --- నీకు 64 వ.సంవత్సరం వచ్చే వరకు ఉద్యోగం చేస్తావు.
బాబా దయవల్ల నేను 64వ.సంత్సరంలో
పదవీ విరమణ చేసాను.
రీడర్ --- నువ్వు దీనజనోధ్ధరణ
కార్యక్రమాలలో పాల్గొని వారికి సేవచేస్తావు.
68 – 70 సంవత్సరముల మధ్యలో నీకు ఆరోగ్యం బాగుండదు. కాని నీ ఆధ్యాత్మిక జీవితానికి
ఎటువంటి ఆటంకం కలగదు.
66 నుంచి 69 సం.వయసు
మధ్య కాలంలో నీకు గుండెకు సంబంధించి, కీళ్ళనొప్పులు,
కాన్సర్, బి పి వీటివల్ల ఆరోగ్యం మరింతగా
చెడుతుంది. నీకు
ఆపరేషన్ జరుగుతుంది. కాని నీ గురువు యొక్క అనుగ్రహం వల్ల అవి నిన్ను అంతగా బాధించవు.
74 సం.వయసులో నీకు గండం ఉంది. ఆగండాన్ని దాటినట్లయితే 81
వ.సంవత్సరంలో పౌర్ణమినాడు నువ్వు నీగురువయిన
షిరిడీ బాబాలో ఐక్యమవుతావు. ఇది నీ ఆఖరి జన్మ. షిరిడీ బాబా నీతోనే ఉంటూ నీకు ప్రతి విషయంలోను మరిన్ని దర్శనాలు
ఇస్తుంటారు. ఆయన
నీకు ఎన్నో అధ్భుతాలను చూపిస్తారు.
ఆయన నీకోసం విబూధి, కుంకుమలను కూడా
సృష్టించి ఇస్తారు. నువ్వు
చాలా సంతోషంగా జీవిస్తావు.
ఇవి ఎవరూ నమ్మరు. నువ్వు ఈ జన్మలో పరిపూర్ణమయిన శిష్యురాలివి కనుక ఇవన్నీ నీకు జరుగుతున్నాయి. ఈ జీవాత్మ (అనగా నువ్వు)
ఉత్తమ శిష్యురాలివిగా ఆ పరమాత్మలో (గురువు)
ఐక్యమవుతావు.
భవిష్యత్తులో నీకు నీ గురువుయొక్క అనుగ్రహం, ఆయన దయ పుష్కలంగా ఉంటాయి. నీకు సుఖసంతోషాలు, మనశ్శాంతి అన్నీ ఉంటాయి. గతజన్మలో నీవు పూర్తి చేయని పనులు ఈ జన్మలో నీ గురువుకు చేస్తావు. ఆ కారణం చేతనే మరలా నీకు ఈ జన్మ
లభించింది.
గత జన్మలో మాయవల్ల నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు.
ఈ జన్మలో అన్నీ అనుభవించిన తరువాత, అటువంటి
జివితంలో ఏవిధమయిన ఆనందం లేదని గ్రహించుకుని నాదగ్గరకు వస్తావు. ఆధ్యాత్మిక జీవితమే ఎంతో
సుఖాన్నిస్తుందని నువ్వే గ్రహిస్తావు.
గత జన్మలో నీగురువయిన షిరిడీబాబా, ఈ జన్మలో నీకు గురువుగా వచ్చి నిన్ను
స్వికరిస్తారు. భవిష్యత్తులో
ఈ జన్మలో నువ్వు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తావు, మంచి పనులు చేస్తావు. నీ ఆత్మకు మోక్షం కలుగుతుంది.
భవిష్యత్తులో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈమె తన గురువు సాన్నిహిత్యంలో
ఆధ్యాత్మిక జివితాన్ని గడుపుతూ ఎంతో ఆనందంగా ఉంటుంది.
ఇది నీ రీడింగ్ -
శుభమ్
జై సాయిరామ్
(తరువాతి సంచికలో బాబా గారి సెన్స్ ఆఫ్
హ్యూమర్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment