19.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 5 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411
01.05.2019 – మరణము – ఆత్మ
1. నిన్నటిరోజు ఉదయము నీ భార్య అక్కగారు కాలేయ వ్యాధితో మరణించింది అని తెలుసుకొని నీ
భార్య విచారించటము సహజము. ఆమె శరీరానికి ఇంకా దహనసంస్కారాలు జరగలేదు. ఆ పార్ధివ శరీరానికి అంతిమ సంస్కారాలు జరిగే వరకు ఆమె
ఆత్మ ఆమె శరీరము చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి శరీరము పంచభూతాలలో కలిసిపోయిన తరవాత ఆమె ఆత్మ వేరొక శరీరములోనికి ప్రవేశించి పునర్జన్మ ఎత్తుతుంది.
2. నీభార్యను ఓదార్చు
– ధైర్యము చెప్పు. ఆమెకు ‘మేరానామ్ జోకర్’ హిందీ సినిమాలోని పాట ‘జీనాయహా మర్ నా యహా
– ఇస్ కే శివా జానా
కహా’
వినిపించు.
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ములు చెప్పిన మాట, “ జన్మించినవారికి మరణము తప్పదు – అలాగే మరణించిన వారికి తిరిగి జన్మించడము తప్పదు” ఈ జననమరణాలు ఈ కాలచక్రంలో ఒక భాగము మాత్రమే మరణము ఈ శరీరానికి మాత్రమే. ఆత్మకు మరణము లేదు. మరణము లేని ఆత్మ మాత్రమే శాశ్వతము. అందుచేత నీభార్యను విచారించవద్దు అని చెప్పు.
భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ములు చెప్పిన మాట, “ జన్మించినవారికి మరణము తప్పదు – అలాగే మరణించిన వారికి తిరిగి జన్మించడము తప్పదు” ఈ జననమరణాలు ఈ కాలచక్రంలో ఒక భాగము మాత్రమే మరణము ఈ శరీరానికి మాత్రమే. ఆత్మకు మరణము లేదు. మరణము లేని ఆత్మ మాత్రమే శాశ్వతము. అందుచేత నీభార్యను విచారించవద్దు అని చెప్పు.
02.05.2019 – రెండు బల్లుల కధ
1. ద్వారకామాయి గోడపై ఒక బల్లి టిక్
టిక్ అని పలుకుతుంటే అది దేనికి సంకేతమని ఒక
భక్తుడు అడిగిన మాట
వాస్తవమే. ఇది, సంతోషంతో ఔరంగాబాదునుండి తన సోదరి వస్తున్నది అని పలకటము విని, ఆమాట ఆ
భక్తునికి చెప్పారు. కొంతసేపటికి ఔరంగాబాదునుండి ఒక
వర్తకుడు నా దర్శనమునకు గుర్రము మీద
వచ్చి గుర్రమునకు దాణా
పెట్టడానికి ఆ దాణా సంచిని విదిలించాడు. అందులోనుండి ఒక
బల్లి క్రిందకు దూకి
ద్వారకామాయి గోడపైకి ఎక్కినది. ఆరెండు బల్లులూ సంతోషంతో గోడపై ప్రాకసాగినవి. ఇది మీ
అందరికీ తెలిసిన విషయమే.
2. ఆ రెండు బల్లుల వెనకటి జన్మ
వృత్తాంతము నీకు తెలియదు. నేను చెబుతాను విను. ఆ బల్లులు వెనకటి జన్మలో మానవులు
(అక్కా చెల్లెళ్ళు). వారి ఇంటిలోని గోడపై ఒక బల్లి పాకుతూ ఉండటం చూసి, వారిద్దరూ ఆ బల్లిని కర్రతో కొట్టి చంపారు. ఈ జన్మలో వారు రెండు బల్లులుగా ఒకటి ఔరంగాబాదులోను రెండవది షిరిడీలోని ద్వారకామాయిలోను జన్మించి వాటి అదృష్టము చేత ద్వారకామాయిలో కలుసుకున్నారు. ఆ రోజులలో ప్రయాణ సాధనాలలో ఎక్కువగా ఎడ్లబళ్ళు, గుర్రపుబళ్ళు,
గుర్రాలమీద
సవారి చేస్తూ ఉండేవారు. ఆ రెండు బల్లులలోని ఆత్మల కోరిక తీర్చడానికి భగవంతుడు ఈలీల చేసాడు.
03.05.2019 – బ్రహ్మజ్ఞానము
బ్రహ్మజ్ఞానము పుస్తకాలు చదివితే రాదు. సద్గురువు చూపిన మార్గములో ప్రయాణము కొనసాగించుతూ సాధన చేసినప్పుడు మనకు బ్రహ్మజ్ఞానము ప్రాప్తించుతుంది. బ్రహ్మజ్ఞానము కోసం అనుసరించవలసిన విధానాలు.
1. కష్టార్జితముతో
సంపాదించిన ధనముతో జీవించటము అలవాటు చేసుకోవాలి.
2. బీదవారితో కలిసి రొట్టె, ఉల్లిపాయనుసంతోషముగా తినగలగాలి.
3. ఇతరుల
కాంతాకనకాలను ఆశించరాదు.
దొంగతనముగా
పొందాలనే ఆలోచనలు రానీయరాదు.
4. శరీరముపై
వ్యామోహంతో శరీర అలంకరణల కోసం విలాసకరమయిన దుస్తులు ధరించరాదు.
శరీర
అందం కోసం సుగంధద్రవ్యాలను వాడరాదు.
5. వృధ్ధాప్యంలో
దూరప్రాంతాలకు ప్రయాణము చేయరాదు.
దేహమే
దేవాలయముగా భావించి ఇంటిపట్టునే ఉంటూ ప్రశాంత జీవితము కొనసాగించాలి.
ఈ అయిదు సూత్రాలను ఆచరించిన వ్యక్తికి బ్రహ్మజ్ఞానము తనంతట తానుగానే వస్తుందని గ్రహించు.
04.05.2019
– మంత్రోపదేశము
– ఉపవాసము
ఉండుట
1. ఒకవేయి
రెండువందల సంవత్సరాల క్రితం నేను మరియు ఆదిశంకరాచార్యులము కలిసి ఒక గురువు వద్ద శిష్యరికము చేసాము.
అందువలనే
నేను మరియు నా సోదరుడు శంకరాచార్యులు అద్వైత సిధ్ధాంతమును ఆచరిస్తాము.
ఆదిశంకరాచార్యులు
స్థాపించిన జగద్గురు శృంగేరిశారదాపీఠము మరియు నేటి షిరిడీలోని ద్వారకామాయి తమతమ భక్తులను సదా కాపాడుతూ ఉంటాయి.
2.
ఇక గురువు మంత్రోపదేశాన్ని తన శిష్యుడికి చెవిలో చెప్పడు.
తన శిష్యుడిని ప్రేమతో పిలిచి ముఖస్థః చెబుతాడు.
ఆమంత్రమును
శిష్యుడు గురువు సమక్షంలో ఉఛ్ఛరించి గురువు ఆశీర్వచనాలు పొందుతాడు.
3. ఇక
పోతే భగవంతుని పేరిట పర్వదినాలలో ఉపవాసము చేయడం అవసరం లేదు.
ఉపవాసము
ఉన్న రోజున భగవంతునిపై ధ్యానముకన్నా ఉపవాస దీక్షానంతరము తినబోయే ఆహార పదార్ధాలపైనే మనసు ఉంటుంది.
ఒకవేళ
ఆరోగ్యవంతులు ఉపవాసము చేసినా నేను ఒక షరతుపై అంగీకరిస్తాను.
ఆ షరతు ఏమిటంటే నీవు ఉపవాసము చేయుటవలన మిగిలిన భోజన పదార్ధములు బీదవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి పంచిపెట్టిన నీవు చేసిన ఉపవాసమును నేను అంగీకరిస్తాను.
05.05.2019
– శ్రీ
సాయి అనుగ్రహమ్
నా అనుగ్రహము, ఆశీర్వచనాలు కోరుకొనే నా భక్తులు ముందుగా….
1. కులము,
మతము పట్టింపును విడనాడి మానవత్వము అనే మతమును స్వీకరించాలి.
2. నీవద్ద
ఎంత ధనము ఉన్నా నీకు తినడానికి భోజనము దొరకని స్థితిలో ఎవరయినా ఎంగిలి రొట్టె పెట్టినా
దానిని దైవప్రసాదముగా భావించి ప్రేమతో తినవలెను.
3. ఇక్కడ నా అంకిత భక్తుడయిన ఉపాసనీ మహరాజ్ ని చూడు. నీవు వానితో ఒకరోజు పాడుపడిన దేవాలయాలలో గడుపు. దేవాలయాలు కూడా కాలగర్భంలో మట్టిలో కలిసిపోవలసినదే. కాని, దైవశక్తి మాత్రము శాశ్వతముగా నిలిచి ఉంటుంది. ఇంకొక నెలరోజులు సమాజములో అంటరానివారిగా ముద్రవేయబడి ఊరవతల జీవించుచున్నవారితో కలిసి జీవించు. వారి ఇంట భోజనము చేసి దరిద్రనారాయణుడి ఋణము తీర్చుకో. ఈవిధముగా చేసిన మానవులందరిలోని ఆత్మ ఒక్కటేనని తెలుసుకోగలవు. ఆ తరవాత నా వద్దకురా. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదించుతాను.
06.05.2019
– ద్వారకామాయి
సత్సంగమ్
1. నిన్నటిరోజున
ద్వారకామాయి సాయి సత్సంగం సభ్యులు నరసాపురం నుండి వచ్చి నిన్ను కలిసారు.
వారికి
నా ఆశీర్వచనాలు మరియు కొన్ని జాగ్రత్తలు తెలియజేయి.
ఈ రోజున వారు సత్సంగంలోని సభ్యులు మైక్ లో మాట్లాడుతున్నారు.
దీనివలన
అక్కడ హాజరయిన కొద్దిమంది సభ్యులు
మాత్రమే సాయి ప్రవచనాలు వినగలుగుతున్నారు.
2. త్వరలో
వారు రేడియో, దూరదర్శన్ ల ద్వారా సాయి ప్రవచనాలను సాయిభక్తులందరికీ వినిపించుతారు.
3. సత్సంగాలను
సాయంత్రము ఆరతికి ముందుగానే ముగించి చీకటి పడకుండా సాయిభక్తులను తమతమ ఇండ్లకు చేరుకోమని సలహా ఇవ్వు.
4. సత్సంగంలో
సభ్యులను ముఖ్యముగా ఈశావాస్యోపనిషత్తును బాగా చదివి అర్ధము చేసుకొని ప్రశాంతముగా తమ జీవితాలను కొనసాగించమను.
07.05.2019
- ఆత్మ సాక్షాత్కారము
1. మానవజీవితము
పవిత్రమయిన కొబ్బరిచెట్టువంటిది. ఆ
కొబ్బరిచెట్టుకు ఆత్మ ఆ చెట్టు మొదలు మరియు వ్రేళ్ళలో ఉంటుంది.
అటువంటి
మొదలుకు చెదపురుగులు పట్టినా ఆ చెట్టు చనిపోతుంది.
అందులోని
ఆత్మ వేరొక ప్రాణిలోనికి ప్రవేశిస్తుంది.
2. అదే
విధముగా మానవశరీరములో పవిత్ర ఆత్మను ‘కామ, క్రోధ,
లోభ,మోహ,మద, మాత్సర్యాలు అనే చెదపురుగులు పట్టి పీడించి మానవ ఆత్మకు అశాంతిని కలిగించి మానవుని ఆత్మ సాక్షాత్కారమునకు ఆటంకమును కలిగిస్తుంది.
అందుచేత మానవుడు అరిషడ్వర్గాలను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదిలించుకుని తమ ఇష్టదైవాన్ని లేక తమ సద్గురువును ఆ ఆత్మలో చూసుకున్ననాడే వానికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మరియు అతని జీవితము ధన్యమవుతుంది.
అందుచేత మానవుడు అరిషడ్వర్గాలను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదిలించుకుని తమ ఇష్టదైవాన్ని లేక తమ సద్గురువును ఆ ఆత్మలో చూసుకున్ననాడే వానికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మరియు అతని జీవితము ధన్యమవుతుంది.
(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment