సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
04.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి –
16 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన
తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్
ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్ ఆప్ :
9440375411 & 8143626744
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి 15వ.భాగముపై సాయిభక్తుల స్పందన...
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై... చాలా బాగుంది. ముఖ్యంగా బాబా గారి పేరు. మేమంతా ఎంతో అదృష్టవంతులం. మీ ద్వారా బాబా గారి గురించి తెలుసుకోగలుగుతున్నాము.
17.07.2019 - నావాడు ఎంత దూరములో యున్నా పిచ్చుక కాలికి దారముకట్టినట్లుగా కట్టి వానిని నాదగ్గరకు చేర్చుకుంటాను. ---
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై... చాలా బాగుంది. ముఖ్యంగా బాబా గారి పేరు. మేమంతా ఎంతో అదృష్టవంతులం. మీ ద్వారా బాబా గారి గురించి తెలుసుకోగలుగుతున్నాము.
17.07.2019 - నావాడు ఎంత దూరములో యున్నా పిచ్చుక కాలికి దారముకట్టినట్లుగా కట్టి వానిని నాదగ్గరకు చేర్చుకుంటాను. ---
నిజమే. ఈ మాటలు నేను అన్నాను. ఇంతవరకు ఎవరూ నన్ను ఈవిషయంలో ప్రశ్నించలేదు. ఇక్కడ మీరందరూ గ్రహించవలసినది పిచ్చుక అంటే ఆత్మ, మరణ సమయంలో ఎవరయితే నా నామస్మరణ చేస్తూ తమ తుది
శ్వాస తీసుకుంటారో వారందరూ నాభక్తులే. ఇప్పుడు నేను
నిన్ను గజ్వేలు పట్టణములోని శ్మశానానికి తీసుకునివెడతాను నాతో
రా, అక్కడ నా రెండు పిచ్చుకలకు దహనసంస్కారాలు జరుగుతున్నాయి. వారిద్దరూ మోటార్ సైకిల్ ప్రమాదములో గాయపడి ఆస్పత్రిలో మరణించారు. వారిద్దరూ నా
నామస్మరణ చేస్తు తమ
ప్రాణాలను వదిలారు. వారికి దహన సంస్కారాలు జరుగుతున్నాయి చూడు. వారి ఆత్మలు చితిమంటలలో తమ పార్ధివ శరీరాల చుట్టూ అగ్నిజ్వాలలలో తిరుగుతున్నాయి. కపాలమోక్షము తరవాత ఆమంటలు ఆరిపోయే వరకు అలాగే తిరుగుతాయి. ఆ తరవాత నేను ఆ ఆత్మలను నా పిచ్చుకలుగా మార్చివేసి నా జోలెలో వేసుకుని వారికి తిరిగి మంచి
పునర్జన్మ వచ్చేలాగ మంచి
కుటుంబంలో వారికి జన్మ ఇస్తాను. ఆ పిచ్చుకలు నా
కంటికి మాత్రమే కనపడతాయి.
నీవు నన్ను కాల్చని పచ్చికుండల గురించి అడుగుతున్నావు. నిజమే. నేను వామన్ తాత్యా ఇచ్చిన కాల్చని పచ్చికుండలతో నీరు తెచ్చి పూలమొక్కలకు నీరు పోసి ఆ పచ్చికుండలను ఆ మొక్కల మొదట్లో వదిలివేసేవాడిని. దీనివలన ఆ చెట్లకు నీరు లబించేది మరియు పచ్చి మట్టితో ఆ మొక్కలు ఎదగడానికి కావలసిన శక్తి లభించేది.
మీ అందరికీ తెలిసినవి రెండు రకాల మట్టి కుండలు. అవి కట్టెల మంటలలో కాల్చబడి, మీ ఉపయోగాలకు వాడబడుతున్నాయి. అందులో మొదటి రకం కుండలపై పచ్చిమట్టితో నగిషీలు చెక్కబడి ఆ తరువాత ఆ కుండలను మంటలలో కాల్చి, గట్టిపడిన తరవాత మీదాహము తీర్చుకోవడానికి వాటిలో నీరు నింపి, వాడుకుకుంటారు.
ఇక రెండవరకము కుండలు సాధారణ రకము కుండలు. వాటిని, మంటలలో కాల్చి, గట్టిపడిన తరవాత నీ
బంధువుల ఆంతిమసంస్కారాలలో శ్మశానములో పార్ధివ శరీరానికి మూడు
ప్రదక్షిణలు చేస్తు, ఆ కుండలలో ఉన్న నీటిని కుండకు చేసిన మూడు
రంధ్రాలద్వారా బయటకు వదిలి ఆ కుండను శ్మశానంలో పగలగొడతారు.
ఇపుడు ఆలోచించి చెప్పు, నేను కాల్చని మట్టి కుండలతో నీరు
తెచ్చి మొక్కలకు నీరు
మరియు పచ్చిమట్టి వేయడంలోని ఉద్దేశ్యము.
19.07.2019 - శ్రీ సాయి ఏనాడూ కాషాయ రంగు కఫనీలు ధరించలేదు.
నేను మౌలిద్దీన్ తంబోలీతో కుస్తీ పోటీలో ఓడిపోయిన రోజునుండి, తెల్లరంగు కఫనీలు, ధరించటం మొదలుపెట్టాను. అంతకుముందు చాంద్ పాటిల్ పెండ్లివారితో షిరిడీకి వచ్చినపుడు రంగురంగు జుబ్బాలను కఫనీపై ధరించేవాడిని. నా భక్తులు నాపై ప్రేమతో నా తైలవర్ణ చిత్రాలలో నేను కాషాయరంగు కఫనీ ధరించినట్లుగా చిత్రించారు. నేను సంతోషముగా అంగీకరించాను. ఈనాడు షిరిడీ బూటీవాడాలో నాపాలరాతి విగ్రహానికి అనేక రంగుల శాలువాలు కప్పి నా భక్తులు ఆనందిస్తున్నారు. నాకు భక్తుల ప్రేమ ముఖ్యము. రంగులు కావు.
20.07.2019 - శ్రీ సాయిబాబా శిరస్సుపైన మొదటిసారిగా ఒక పుష్పమును పెట్టి పూజించిన భక్తుడు
నేను సర్వదేవీదేవతా స్వరూపుడినని మీకు తెలుసు కదా. నేను ద్వారకామాయిలో ఒంటరిగా ఉన్నపుడు ఒక బాలుడు తన బడికి వెడుతూ నాదగ్గరకు వచ్చి, నా శిరస్సుపై ఒక పుష్పమును పెట్టి, పూజించి వెళ్ళాడు. ఆ సమయంలో దూరమునుండి, జయకర్ ఈ సంఘటనను చూసి తను వేయుచున్న తైలవర్ణ చిత్రములో నా శిరస్సుపై ఒక పుష్పాన్ని చిత్రించాడు. మీరందరూ నన్ను ఏవిధంగా బావించితే నేను ఆ రూపములో మీకు దర్శనమిస్తాను. ఇది నా మాటగా గుర్తుంచుకోమని మీకు సలహా ఇస్తున్నాను.
విదేశాలలో కొందరు తమ నూతన గృహాలకు గృహప్రవేశము సందర్భముగా తమ ఇంటి గుమ్మములో ఒంటె మూత్రమును పోసెదరు. మరికొందరు తమ గుమ్మాలముందు వైన్ (WINE) ద్రాక్షరసమును పోసెదరు. ఎవరి నమ్మకము వారిది. కాని గమ్యము మాత్రము ఒక్కటే.
(మన భారతదేశములో హిందువులు గృహప్రవేశ ముహూర్తమునకు ముందు తమ వాకిలిలో గోమూత్రమును చల్లి పవిత్రము చేసెదరు… --- త్యాగరాజు)
21.07.2019 - సాయి తన భక్తులనుండి రూ.500/- దక్షిణగా స్వీకరించి మలేరియా జ్వరముతో బాధపడుట
వామన్ నార్వేకర్ నా అంకిత భక్తుడు. అతని తండ్రి ధనసంపాదన కోసం ధనవంతులను మోసము చేసి చాలా ధనమును సంపాదించాడు. అతను కుక్కలవంటి పెంపుడు జంతువులను హింసించుతూ ఆనందించేవాడు. తాను చేసుకున్న పాపాలకు అతను మలేరియా జ్వరముతో బాధపడసాగాడు. అతని కుమారుడు వామన్ నార్వేకర్ నా దగ్గరకు వచ్చి రూ.500/- దక్షిణ ఇచ్చి, తన తండ్రి మలేరియా జ్వరమును తగ్గించమని వేడుకొన్నాడు. వామన్ నార్వేకర్ ద్వారకామాయి వదిలివెళ్ళిన వెంటనే నేను వాని తండ్రి మలేరియా వ్యాధిని స్వీకరించి ఆ బాధను నేను అనుభవించాను. ఈ విధముగా నా అంకిత భక్తుడు వామన్ నార్వేకర్ మనసులోని కోరికను తీర్చాను.
నేడు నీవు ఇంటర్ నెట్ ద్వారా ప్రపంచములోని అనేకమంది సాయిభక్తులతో మాట్లాడుతున్నావు. నీకు 1986 లో హామ్ రేడియో ద్వారా విదేశాలలోని స్నేహితులతో మాట్లాడాలని కోరిక ఉండేది. ఇపుడు నిన్ను
1986 సం.మౌలాలీ (హైదరాబాద్) కొండ దగ్గర ఉన్న
నీ స్నేహితుని దగ్గరకు తీసుకుని వెడతాను. అతను హామ్
రేడియో ద్వారా విదేశాలలోని తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. నీవు వాని
ఇంటికి వెళ్ళి నీతీరని కోరికను తీర్చుకో అని మౌలాలీ కొండగుట్ట దగ్గర నన్ను (సాయిబానిస) వదిలివేశారు.
(హామ్ రేడియో)
నేను నా మిత్రుని ఇంటికి చేరుకొన్నాను. ఆ సమయంలో నా స్నేహితుడు ఆఫ్రికా ఖండములోని ఒక దేశములోని మిత్రునితో మాట్లాడసాగాడు. నా కోరికపై సౌత్ ఆఫ్రికాలోని ఒక హిందూ భక్తుడు నాతో ఇంగ్లీషు, హిందీ భాషలలో మాట్లాడుతూ శ్రీ షిరిడీ సాయిబాబా గురించి వివరాలు చెప్పమని కోరాడు.
*నేను షిరిడీ సాయి గురించి తెలుసుకున్న తరవాత హామ్
రేడియోద్వారా బాబా వివరాలు తెలియజేస్తాను అని మాట
ఇచ్చాను.
నేను నిద్రనుండి లేచాను. 1986 లో నా ఇంట హామ్
రేడియో పెట్టుకోవాలనే కోరిక ఉండేది. ఆ కోరిక ఈవిధముగా తీర్చావా నా
బాబా అని ఆయన పాదాలకు నమస్కరించాను.
* నాకు 1986 లో షిరిడీ గురించి,
మరియు శ్రీ సాయిబాబా గురించి వివరాలు తెలియవు. నాకు నా
ఇంట హామ్ రేడియో సెట్టు పెట్టుకుని ప్రపంచములోని మిత్రులతో మాట్లాడాలనే కోరిక ఉండేది. నేను ఇంటర్ నెట్
ద్వారా ప్రపంచములోని అనేకదేశాలలోని సాయిభక్తులతో మాట్లాడగలుగుతున్నాను… సాయిబానిస
22.07.2019 - శ్రీ సాయి ద్వారకామాయిలో ఎన్నడూ దక్షణము వైపు
తలను పెట్టి నిద్రించలేదు
అవును, ఇది నిజమే. నేను, నాతోపాటు మహల్సా, తాత్యాలను రోజు విడిచి రోజు
ద్వారకామాయిలో నిద్రించినపుడు దక్షణమువైపు మాత్రము మాశిరస్సులను పెట్టేవారము కాదు. దీనికి కారణము నీవు అడుగుతున్నావని నాకు
తెలుసు.
భూగోళముపై రూర్పు, పడమర, ఉత్తర దిశలలో మాత్రమే మానవ జీవిత మనుగడ కొనసాగించబడుతున్నది. *కారణము, దక్షణ ధృవములో మానవులు నివసించడానికి వాతావరణము లేదు. అక్కడ భూగర్భంలో అనేక
రాగిగనులు, బొగ్గుగనులు ఉండటము చేత
అక్కడ అయస్కాంతశక్తి మానవుల మెదడుపై విపరీత ఒత్తిడికి గురి చేస్తుంది. అక్కడ సముద్రజలాలలో చేపలు తప్ప మరి ఏ
జీవీ జీవించలేదు. నీవు దక్షణమువైపు శిరస్సుపెట్టి నిద్రించినా నీకు ప్రశాంత నిద్ర కలగదు.
*దక్షిణమువైపు తల
పెట్టుకుని నిద్రించిన మతిమరపు వ్యాధి (అల్జీమర్స్)
వచ్చును నా అనుభవంలో నేను దక్షిణమువైపు తలపెట్టి ధ్యానము చేసినపుడు నాకు
సరియైన ఆలోచనలు వచ్చేవి కాదు. … సాయిబానిస
23.07.2019 - నా గురువు నా
తల గొరిగి నానుండి రెండు కానులు దక్షిణగా కోరెను
నేను నా గురువునుండి పొందిన అనుభూతిని నీకు (సాయిబానిస) ప్రసాదించుతాను. నాతోపాటు దగ్గరలో ఉన్న గ్రామానికి రా,
అని నన్ను (సాయిబానిస) ఓ పల్లెటూరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక
బావి దగ్గర ఆగాము. శ్రీ సాయి
ఆదేశానుసారము నేను (సాయిబానిస) నూతిలోనుండి నీరు తోడి,
రెండు గంగాళములు నింపాను. ఆ తరవాత శ్రీసాయి ఆగ్రామములోని ఓ
నాయీబ్రాహ్మణుడిని పిలిచి, నా శిరస్సుపై ఉన్న జుట్టును తొలగించి, నాకు గుండు చేయించి అక్కడ ఉన్న రెండు గంగాళముల నీటితో వారు
స్నానము చేయించారు. స్నానానంతరము నాకు కట్టుకునేందుకు ఒక అంగవస్త్రమునిచ్చి, నా నడుకుము కట్టుకోమని ఆదేశించారు. నా నుండి రెండు కానులు దక్షిణ స్వీకరించారు. నేను వారి
పాదాలకు నమస్కరించాను. ఆ తరవాత మధ్యాహ్న సమయంలో నాకు ఆకలి
వేయసాగింది. శ్రీ సాయి
నా ఆకలిని గుర్తించి, ఆగ్రామం జమీదారు ఇంటిముందు జరుగుతున్న అన్నధానములో భోజనము చేయమని చెప్పి ఆ
జమీందారు ఇంటిప్రహారీ గోడకు ఉన్న గేటువద్ద నిలబడిపోయారు.
నేను (సాయిబానిస) ఆ గ్రామప్రజలతోపాటు వరుసలో నిలబడి రెండు పులిహార పొట్లాలను, రెండు మిఠాయి పొట్లాలను స్వీకరించి గేటువద్దకు వచ్చాను. అక్కడ శ్రీసాయి లేరు. నేను ఆయన
గురించి వెదకసాగాను. ఇంతలో ఒక స్త్రీ ఒక చంటిబాలుడిని ఎత్తుకుని నావద్దకు వచ్చి, తనకు ఆకలిగా ఉన్నదని ఒక
పులిహార పొట్లమును ఇమ్మని కోరింది. ఆమెపై జాలితో ఆమెకు ఒక పులిహార పొట్లము, మరియు ఒక మిఠాయి పొట్లము ఇచ్చాను. శ్రీ సాయి రాక
గురించి నేను ఎదురు చూడసాగాను. ఇంతలో కుష్టువ్యాధితో బాధపడుతున్న ఒక నడి వయస్సు స్త్రీ వచ్చి తనకు
ఆకలిగా ఉన్నది అన్నది.
నా చేతిలో ఒక పులిహార పొట్లము మరియు ఒక మిఠాయి పొట్లం మాత్రమే ఉన్నాయి. నేను వాటిని ఆ కుష్టువ్యాధి స్త్రీకి ఇచ్చివేసినా నేను శ్రీసాయికి ఏమి ఇవ్వగలను అని
ఒకసారి ఆలోచించాను. శ్రీసాయి గతములో నాకు
చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాను.
“అన్నదానములో ముందుగా వ్యాధిగ్రస్తులకు, అనాధలకు, పిల్లలకు, అన్నము పెట్టవలెను ఆ తరవాతనే మనము తినవలెను.”
వెంటనే నా చేతిలో ఉన్న పులిహార పొట్లము మరియు మిఠాయి పొట్లం ఆ స్త్రీ చేతికి ఇచ్చాను. ఆ స్త్రీ సంతోషముగా వెళ్ళిపోయింది.
ఆ తరవాత శ్రీ సాయి ఆగ్రామములోని అయిదు ఇళ్ళనుండి తెచ్చిన భిక్షను నాముందు పెట్టి కడుపునిండా తినమన్నారు. నేను మరియు శ్రీ
సాయి వారి జోలినుండి, రొట్టె, కూర తీసుకుని తిన్నాము. నాకు నిద్రనుండి మెలకువ వచ్చింది.
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment