షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
25.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 19 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్ ఆప్ : 9440375411 & 8143626744
07.08.2019 - విధివ్రాత
విధివ్రాత గురించి నీజీవితంలో జరిగిన ఓ
సంఘటనను నీకు గుర్తు చేస్తాను. నీవు కాలేజీ చదువు పూర్తి చేసి, యవ్వనంలో నీ బంధువుల అమ్మాయిన ప్రేమించావు. నీవు నీ
బంధువుల అమ్మాయిని వివాహము చేసుకునేందుకు నిశ్చయించుకొన్నావు.
నీవు నీ ఉద్యోగ ప్రయత్నములో ఉన్న సమయంలో నీ ప్రియురాలు ఆమె తల్లిదండ్రుల బలవంతముతో వేరొక వ్యక్తిని వివాహము చేసుకున్నది. కాలక్రమేణా నీవు నీతల్లిదండ్రుల అనుమతితో నీ బందువులలో వేరొక అమ్మాయిని వివాహము చేసుకున్నావు. కాలము గడుస్తుంటే నీవు నీ జీవితములో మొదటిసారిగా ప్రేమించిన అమ్మాయి భర్త ఆమెను వదలివేసాడు. ఆ సంఘటన తరవాత ఆస్త్రీ తన తల్లితో కలిసి నీవద్దకు వచ్చి తనను వివాహము చేసుకోమని కోరింది. అప్పటికే నీకు వివాహము జరిగిపోయింది. నీవు నిస్సహాయస్థితిలో ఉండిపోయావు ---- ఇది విధివ్రాత
నీవు నీ ఉద్యోగ ప్రయత్నములో ఉన్న సమయంలో నీ ప్రియురాలు ఆమె తల్లిదండ్రుల బలవంతముతో వేరొక వ్యక్తిని వివాహము చేసుకున్నది. కాలక్రమేణా నీవు నీతల్లిదండ్రుల అనుమతితో నీ బందువులలో వేరొక అమ్మాయిని వివాహము చేసుకున్నావు. కాలము గడుస్తుంటే నీవు నీ జీవితములో మొదటిసారిగా ప్రేమించిన అమ్మాయి భర్త ఆమెను వదలివేసాడు. ఆ సంఘటన తరవాత ఆస్త్రీ తన తల్లితో కలిసి నీవద్దకు వచ్చి తనను వివాహము చేసుకోమని కోరింది. అప్పటికే నీకు వివాహము జరిగిపోయింది. నీవు నిస్సహాయస్థితిలో ఉండిపోయావు ---- ఇది విధివ్రాత
08.08.2019 - మరణము – దహనము – పునర్జన్మ
నిన్నటి రోజున నీ సమీప బంధువు మరణవార్తవిని నీవు చాలా బాధపడ్డావు. సహజమే. అతను నీకంటె వయసులో చిన్నవాడు. అతను ఆర్ధికపరమయిన ఇబ్బందులతో మానసిక వత్తిడికి తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. అతని పార్ధివశరీరానికి ఈరోజున దహనసంస్కారాలు జరుగుతున్నాయి. దహనసంస్కారాలు తరవాత అతను పునర్జన్మ కోసం అతని ఆత్మ ఇంకొక మాతృమూర్తి గర్భములో ప్రవేశిస్తుంది. అతను నూతన జన్మలో తన తీరని కోరికలను తీర్చుకుని సుఖవంతమయిన జీవితాన్ని గడుపుతాడు. ఇతని మరణమునుండి నీవు తెలుసుకోవలసిన విషయాలు ---
జీవితములో అత్యాశకు పోరాదు. ఉన్నదానితో తృప్తిగా జీవించాలి.
నీకు ఆరోగ్యము కావాలంటే తృప్తి, ప్రశాంత జీవితము పాటించాలి.
09.08.2019 - శారీరక ధర్మము - మానసిక ధర్మము
శారీరక ధర్మము నీ శరీర అవసరాలకే పాటించు. అదే మానసిక ధర్మాలను నీ ఆధ్యాత్మిక ప్రగతికి వినియోగించు. ఆకలి వేసినపుడు అన్నము తినడం శారీరక ధర్మము. అదే అన్నము తినేటప్పుడు భగవంతునికి అర్పించి నీవు తినటము మానసిక ధర్మము.
ఈ విధముగా నీవు అన్నము పరబ్రహ్మ స్వరూపము అని ఎల్లప్పుడూ తలచుకుంటూ ఉండగలవు.
నీవు అన్నము తినేటప్పుడు నీముందుకు ఆకలితో వచ్చిన వ్యక్తి వచ్చినపుడు వానికి అన్నము పెట్టడము భగవంతునికి పెట్టడమే అని గుర్తించు.
నోరులేని జీవాలకు,
పక్షులకు ఆహారము పెట్టడము భగవంతునికి అన్నము పెట్టినట్లే.
10.08.2019 - జీవితంలో ధనము మరియు శారీరక అందము శాశ్వతము కాదు.
ఈ విషయంలో నేను నీకు ఎక్కువగా చెప్పనవసరము లేదు. నీవు యవ్వనములో ఉన్నపుడు నీవు 1968 లో తీయించుకున్న ఫొటోలు చూడు. ఎంత అందముగా ఉన్నావో అని సంతోష పడ్డావు.
ఈరోజున వృధ్ధాప్యములో నీముఖాన్ని అద్దములో చూడలేకపోతున్నావు. కారణము నీకళ్ళలో చూపు మందగించింది. డాక్టరు నీ ఎడమకన్ను పూర్తిగా పాడయిపోయినదని చెప్పాడు కదా. ఇంకా కుడికన్ను కొంచము కనిపిస్తున్నది. జాగ్రత్తగా డాక్టరు సలహాను పాటించు.
1946 లో జన్మించి 2017 వ.సం. లో మరణించిన ఆ ప్రఖ్యాత హిందీ సినీనటుడిని చూడు. మంచి అందగాడు. మంచి సినీనటుడు. మరణించే సమయానికి అతను ధనమును పూర్తిగా పోగొట్టుకున్నాడు. అనారోగ్యముతో అందవిహీనమయిన శరీరంతో మరణించాడు.
11.08.2019 - ఈరోజు సాయిబానిసగారు ఆశ్చర్యపడె విషయం చెప్పారు. బాబాగారు ఇంక శ్రీ షిరిడీసాయితో ముఖాముఖి కార్యక్రమాన్ని ముగించమని ఆదేశించారు. --- త్యాగరాజు
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి ముగింపుకు బాబా ఆదేశము
ఈ రోజున నీవు నీకంటికి అనారోగ్యముతో కంటిచూపు లేక చాలా బాధపడుతున్నావు. ఇది నాకు బాధ కలిగించింది. అందువలన ఇంతటితో ‘శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి’ కార్యక్రమాన్ని ముగించమని ఆదేశిస్తున్నాను.
ఇపుడు నాసమాధికి రంగులు వేయడం పూర్తయినది. నీవు ఇపుడు నా సమాధిని చూడదలచుకుంటే 1916 వ.సం.లో జన్మించిన ‘గ్రెగరీ పెక్’ ( ప్రఖ్యాత అమెరికా సినీ నటుడు) యొక్క సమాధిని ఇంటర్ నెట్ లో చూడు. ఆ సమాధి కూడా భూగృహంలోనే ఉన్నది.
ఈ ‘శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి’ అనే పుస్తకం ముగింపు వాక్యాలను నా అంకితభక్తుడు ఆత్రేయపురపు త్యాగరాజును వ్రాయమని ఆదేశించుచున్నాను. అతను ముగింపు వాక్యాలు వ్రాయడం పూర్తయిన తరువాత నా ఇతర అంకిత భక్తులు చదవడానికి వీలుగా ముద్రణ చేయించమను. ఈ ముద్రణ కొరకు నా అంకిత భక్తులు నాపేరిట గురుదక్షిణ ఇచ్చిన స్వీకరించమను. ‘శ్రీసాయితో ముఖాముఖి’ షిరిడీసాయి పుస్తక ప్రపంచములో సముచిత స్థానాన్ని పొందుతుంది. ఇపుడు నేను నా సమాధినుండి మాట్లాడుతున్నాను.
నా భక్తులకు ఆశీర్వచనాలు తెలియ చేస్తున్నాను.
లోకా సమస్తా సుఖినోభవంతు
వచ్చే ఆదివారం ఈ పుస్తకముపై ఫలశృతి ముద్రించబడుతుంది.
--- త్యాగరాజు
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
--- త్యాగరాజు
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment