Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, April 23, 2020

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు 3వ.భాగమ్

Posted by tyagaraju on 5:08 AM
  Sai Baba of Shirdi - Wikipedia
               Single Red Rose PNG HD | PNG Mart

23.04.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు 3వ.భాగమ్

26.01.2020  --  ప్రేమ వివాహాలు

నేటి యువత ప్రేమల పేరిట కులాంతర వివాహాలుమతాంతర వివాహాలు చేసుకొని తమ జీవితాలను నాశనము చేసుకొనుచున్నారు.  ఇది నాకు చాలా బాధ కలిగించుచున్నది.
నా సలహా ఏమిటంటే తమతమ సాంప్రదాయాలలో పెద్దల అనుమతితో వివాహాలు చేసుకుని సుఖవంతమయిన జీవితాన్ని గడపండి.


విశ్లేషణ -  గౌరి కల్యాణం – శ్రీ సాయి సత్ చరిత్ర 47.అధ్యాయం

పూజారి తన కూతురయిన గౌరికి వివాహం చేయదలచివీరభద్రుని వెంటబెట్టుకుని బాబా వద్దకు వచ్చాడు.  ఇద్దరికీ నక్షత్రంగోత్రంవంశం అన్నీ కుదిరాయి.  మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ వివాహం జరిపించమని చెప్పారు.

28.01.2020  --  భగవంతుని వెదకుట

నేను నా ఇద్దరు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాను.  సముద్ర తీరాన ఉన్న మడచెట్ల (సముద్ర ఉప్పునీటిలో పెరిగే చెట్లుఅడవులలో తిరగసాగాము.
          Complex root system of mangrove trees growing in salt water of ...
నా స్నేహితులలో ఒకడు ధనవ్యామోహము కలవాడుఇంకొకడు స్త్రీ వ్యామోహము కలవాడు.  నేను భగవంతుని సముద్రతీరంలో చూడాలని అర్ధనగ్నముగా సముద్రతీర జలాలలో నడవసాగాను.  నా ఇద్దరు మిత్రులు నన్ను వదలివేశారు.

నేను ఒంటరిగా సముద్రపు తీరం వెంబడి నడవసాగాను.  అక్కడ ఒక గుడిసెలో ఒక జాలరి నన్ను ప్రేమతో పిలిచి నాకు చేపలకూరరొట్టె పెట్టాడు.  నా ఆకలి తీరింది.  ఆ గుడిసె బయట సముద్ర తీరములో రాతిగుట్టల మీద కూర్చుని భగవంతుని గురించి తపస్సు చేసాను.  నా గురువు షిరిడీ సాయి దర్శనము ఇచ్చినా వెన్ను తట్టినన్ను లేపి నీకు త్వరలోనే భగవంతుని దర్శనము లభించుతుంది అని ఆశీర్వదించి నన్ను నా ఇంటికి పంపివేశారు.

నా విశ్లేషణ -  శ్రీసాయి సత్ చరిత్ర 32.ధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాము.  అందులో బాబా వివరించిన సంఘటన ---

నలుగురు స్నేహితులము భగవంతుని అన్వేషిస్తూ అడవిలో తిరుగుతున్నాము.  మార్గంలో ఒక బంజరి కలిసి  ఎఱ్ఱటి ఎండలో దేనినిమిత్తం వెడుతున్నారనిరహస్యం మంచిది కాదుస్పష్టంగా చెప్పమని అడిగాడు.  కానిఅతనితో అసలు విషయం వెల్లడించలేదు.  అపుడతడు రహస్యాన్వేషణ నాతో చెప్పకపోయినా పరవాలేదుకాస్త రొట్టె తినినీరు త్రాగి వెళ్ళమని చెప్పినా వినకుండా బయలుదేరారు.  ప్రేమతో తినడానికి పెట్టినదానిని తిరస్కరించి వ్యర్ధంగా అడవిలో తిరిగి తిరిగి వచ్చిన వారికి మరలా దైవవశాత్తు బంజరి వారిని కలిసాడు.  దేనికయినా ఈశ్వర సంకల్పముండాలి.  వడ్డించిన పళ్ళెమును తిరస్కరించరాదు.  అన్నంపెట్టి తినమని ఎవరు అంటారో వారి వచనం పూర్ణ శుభశకునమనితలపెట్టిన కార్యం నిర్విఘ్న కారకమవుతుందని తలచాలి.  అని ఆ బంజరి వారికి హితోపదేశం చేసాడు.

29.01.2020 – నేటి పాఠశాలలు  -  ఉపాధ్యాయులు

నేటి పాఠశాలలలో ఉపాధ్యాయులు అహంకారముతో పిల్లలను మానసికముగా శారీరకముగా హింసించుతూ భయబ్రాంతులను చేయుచున్నారు.  కొందరు ఉపాధ్యాయులు బడిలో కీచకులుగా మారి ఆడపిల్లలను మానసికముగాశారీరకముగా హింసించుతున్నారు.  అటువంటి ఉపాధ్యాయులను సమాజము ఏరివేసిపాఠశాలలను పవిత్ర వారావరణములో నెలకొల్పాలి.  నేటి పాఠశాలలలోని పిల్లలు రేపటి మన భావితరానికి మంచిపౌరులుగా ఎదగాలని కోరుకొందాము.

విశ్లేషణ --  శ్రీ సాయి సత్ చరిత్ర 32 అధ్యాయములో బాబా చెప్పిన మాటలు

నాగురువు నన్ను ఒక బావివద్దకు తీసుకుని వెళ్ళినా రెండు కాళ్ళకు తాడు కట్టి బావిలోనికి తలక్రిందులుగా వ్రేలాడదీసి తాను ఎక్కడికో వెళ్ళిపోయారు.  ఆ తరువాత వచ్చినన్ను పైకి తీసి ఎలా ఉందని అడిగారు.  నేనత్యంత ఆనందాన్ననుభవించానని చెప్పాను.

పక్షులు తమ పిల్లలను చూచుకునే రీతిగా నా గురువు నన్ను ప్రేమతో చూచేవారు.  వారి బోధన పధ్ధతి ఎంతో మధురమయినది.  తలచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది.  నా గురువు మెడకు పెనవేసుకుని వారి కళ్ళలో ఉండిపోవాలనిపించేది.  వారి ప్రతిబంబం కళ్ళలో లేకపోతే ఆకళ్ళు వట్టి మాంసపుగోళాలు.  అది అటువంటి పాఠశాల.  అందులో అడుగుపెట్టివెనుకకు తిరిగిపోయే దురదృష్టవంతుడు ఎవడూ ఉండడు.  నా ఇల్లువాకిలితల్లి తండ్రి నా సర్వం నాగురువే.  నాదృష్టియొక్క ధ్యానమంతా ఒక్క గురువుపైనే.  గురు స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనోబుధ్ధులు కుంఠితమైపోతాయి.  అందువలన మౌనంగా వారికి వందనం చేయాలి.  అనుభవజ్ఞానం లేనివారి శిక్షణ వ్యర్ధం.  అట్టి గురువు వ్యర్ధంగా వాగటానికి తప్ప మరెందుకు పనికివస్తాడు?

నా గురువు నన్నెటువంటి సేవలో వినియోగించారంటే నేను వేరే గురువును వెదకుకునే అవసరం లేకుండాశ్రమపడి వేరే పరిశోధనలేవీ చేసే అవసరం లేకుండా నాకు జ్ఞానాన్ని ప్రసాదించారు.

(సమాప్తం) 
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలకు బాబా సమాధానాలు ప్రచురిస్తున్నాను...త్యాగరాజు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List