Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, April 27, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు - 4

Posted by tyagaraju on 7:14 AM
      SHIRDI SAI BABA – Salem tours and travels
         29 Yellow Rose HD Wallpapers | Background Images - Wallpaper Abyss
27.04.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు – బాబా సమాధానాలు - 4

ఆత్రేయపురపు త్యాగరాజు 
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్  ..  9440375411 & 8143626744
మైల్  ఐ.డి. tyagaraju.a@gmail.com
ఈ సందేహాలు సమాధానాలను ఎవరైనా తమ స్వంత బ్లాగులో ప్రచురించుకోదలచినట్లయితే 
ముందుగా నాకు సమాచారం ఇవ్వవలసినదిగానా మనవి)
మాండూక్యోపనిషత్  మూడవ భాగమ్ సాయిభక్తుల 
స్పందనలు

శ్రీమతి కృష్ణవేణి, చెన్నై,  బాబా గారి గురించి వివరణ చదువుతుంటే ఇంత గొప్ప యోగుల పాదాల దగ్గర మనకు చోటు దొరికినందుకు మనం ఎంతో అదృష్టవంతులం.  అలాగె 5 అవస్థల గురించి తెలుసుకోవడమ్ చాలా సంతోషంగా ఉంది.  బాబా గారు మీద్వారా మాకు కూడా జ్ఞానబోధ చేస్తున్నారు.  మాకు కూడా సత్ చరిత్ర లో ఇన్ని తెలియని విషయాలు ఉన్నాయా అని అనిపించింది.  రేపు ఏమి ప్రచురిస్తారో అని బాబా గారు ఏమి చెప్పారో అని ఎదురుచూస్తున్నాము.  యోగ నిద్ర గురించి శ్రీ గరికపాటి వారి ప్రసంగం కూడా బాగుంది.

శ్రీ పార్ధసారధి గారు, పాలకొల్లు -  బాబా వారి సత్ చరిత్ర మరలా మరలా పారాయణ చేయాలనిపించేలా మీ విశ్లేషణ ఉంటుంది.  ధన్యవాదాలు.  ఓమ్ సాయిరామ్

శ్రీమతి శారద, ముంబాయి

జీవుని అవస్ధలు గురించి తెలుసుకున్నాం. శ్రీయుతులు గరికిపాటి వారు  యోగనిద్ర గురించి సరళంగా వివరించారు. యోగి యొక్క లక్షణాలు గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు బాబాగారికి సరిగ్గా అన్వయిస్తాయి. బాబా చరిత్ర అనే సముద్రంలో చదివిన కొద్దీ రత్నాలు దొరుకుతున్నాయి. అవి మీ పరిశోధనలతో మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు

మాండూక్యోపనిషత్ – చివరి భాగమ్
    Mandukya Upanishad- An inquiry into what is Real And Unreal -2
ఆయన నిద్రపోయే విధానంకంటే పెద్ద వింత మరొకటేదీ లేదు.  జీవితకాలంలో అధికభాగం, ఆయన నిద్రపోవడానికి ఉపయోగించింది ఒక కొయ్య చెక్క.  దాని పొడుగు 6 అడుగులు, వెడల్పు 9 – 10 అంగుళాలు. 


  అది కప్పునుంచి బొత్తిగా బలంలేని పాత గుడ్డపేలికలతో వేలాడదీసి ఉండేది.  నేలకు సుమారు ఆరడుగుల ఎత్తున ఉండేది.  దానిమీద అక్కడక్కడ కొన్ని దీపాలు పెట్టిఉండేవి.  (Bhavarth Shri Sai sachcharit by Govind  Raghunadh Dhabolkar O V 15)
         Sai Baba bed in Dwarkamai
(ఆర్థర్ ఆస్బర్న్ వ్రాసిన  మహామహిమాన్వితులు సాయిబాబా కాలపు అధ్బుతయోగి కధ పుస్తకంలో బాబా గురించి ఈ విధంగా చెప్పారు.
ఆయన నిద్రపోయే వింతవిధానానికి వివరణ, శ్రీమతి మేనేజర్ అనే పార్శివనిత చేసిన చాలా మౌలికమయిన వ్యాఖ్యలో కనిపిస్తుంది. సాయిబాబాగారికీ ఇతర సాధువులకూ మధ్య ఒకే భేదం నాకు స్పష్టంగా స్ఫురించింది.  చెప్పుకోదగ్గ ఇతర సాధువుల్ని కూడా నేను దర్శించాను.  వారు సమాధి స్థితిలో ఉండగా చూశాను.  వారికి ఒంటిమీద స్పృహ ఏమాత్రం ఉండేది కాదు.  తరవాత చుట్టుపక్కలంతా తెలుస్తూ వారికి స్పృహరావడం, మన మనస్సుల్లో ఉన్నది వారు తెలుసుకోవడం, మన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం గమనించాను.  కాని, సాయిబాబాగారి విషయంలో కనిపించే విచిత్రమయిన తేడా ఏమిటంటె, ఏదయినా సాధించడానికి గాని, ఉన్నత స్థితినో జ్ఞానాన్నో పొందడానికి గాని, సమాధిలోకి. వెళ్లవలసిన అవసరం ఆయనకు కలగలేదు.  ప్రతిక్షణం ఆయన రెండు రకాల చైతన్యాలతో వ్యవహరిస్తూ ఉండేవారు.)
           Sai With Baijabai And Mhalsapati Greeting Card for Sale by Sunil ...
మహల్సాపతికి బాబాతో దాదాపు 50 సంవత్సరముల అనుబంధం ఉంది.  ఆయన బాబాతోపాటే మసీదులో ప్రతిరాత్రి నిద్రిస్తూ ఉండేవారు.  మహల్సాపతి, బాబా ఇద్దరు ఒకే దుప్పటిపై పడుకునేవారు.  మహల్సాపతి నిద్రపోవడం చాలా అరుదుగా జరిగేది.  బాబా మహల్సాపతితో “నువ్వు రాత్రంతా మేలుకునే ఉండు.  నీ చేతిని నా గుండెలమీద వేసి ఉంచు.  నేను భగవంతుని స్మరిస్తూ పడుకుంటాను.  నీ చేయి నా గుండెలమీద ఉన్న సమయంలో నేను చేసె నామస్మరణ నీకు స్పష్టంగా వినిపిస్తుంది.  ఎపుడయితే నామస్మరణ ఆగిపోతుందో అపుడు నేను నిద్రలోకి జారుకుంటున్నదానికి సంకేతం.  ఆసమయంలో నేను నిద్ర పోకుండా నన్ను లేపు.  దీనర్ధం ఏమిటంటె ధ్యానస్థిలో పడుకున్న సమయంలో వినిపించే గుండె చప్పుడుకీ, సాధారణంగా నిద్రించే సమయంలో వినిపించే గుండె చప్పుడుకీ తేడా ఉంటుంది.  దీనివల్ల మనం గ్రహించుకునేదేమిటంటె రాత్రి సమయాలలో బాబా గాని, మహల్సాపతి గాని నిద్రించేవారు కాదు.  ఎక్కడో దూరాన ఉన్న తన భక్తులను బాబా యోగనిద్ర లోనే కాపాడుతూ ఉండేవారు.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.45 నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై నుంచుమనెదను.  అచ్చటినుంచి వచ్చు భగవన్నామస్మరణమును వినుమనెదను.  నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను.)
బాబా మసీదులో గాని, చావడిలో గాని నిద్రిస్తూ ఉండేవారని నార్కే గారు చెప్పారు. బాబా మసీదులో ధునిముందు కూర్చుని తాను, గత రాత్రి చాలా దూర ప్రాంతాలకు వెళ్లినట్లుగా తరచూ చెపుతూ ఉండేవారు. ఇంకా తాను చేసిన పనులను కూడా చెబుతూ ఉండేవారు.
ఒకరి ప్రాణం కాపాడటంకోసం సాయిబాబాగారు ఎంతో ప్రయాసపడి విఫలులయిన ఉదంతం ఒకటి ఉంది.  నిమోన్ గ్రామంలో రోజుల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది.  పాటిల్ భార్య జబ్బు పడింది.  బాబాగారు రోజు రాత్రి చావడిలో గడుపుతున్నారు.  మహల్సాపతి ఆయనతోనే ఉన్నాడు.
సాయిబాబా మహల్సాపతితో రోజు రాత్రి నిద్రపోకు.  నాకు తెల్లవార్లూ కాపలా కాస్తూ ఉండు.  నేను దేవుడిని ప్రార్ధించాలి.  కారణం ప్లేగువ్యాది ఆమెను చంపడానికి చూస్తోంది.  అందుకని నేను ప్రార్ధన చేయాలిఅని అన్నారు. మహల్సాపతి బాబాకు అంతరాయం కలగకుండా ఉండటానికి రాత్రి అంతా కాపలా కాస్తూ ఉన్నాడు.  కాని, మరికాసేపటికి తెల్లవారుతుందనగా ఒక అధికారి కొంతమంది సేవకులను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు.  వాళ్ళు సాయిబాబా దర్శనం అప్పుడే కావాలని బిగ్గరగా అరుస్తూ చాలా గందరగోళం చేయసాగారు.  వాళ్ళకు ఊదీ ఇచ్చి శాంతింపచేయడానికి మహల్సాపతి ప్రయత్నించాడు.  కాని లాభం లేకపోయింది.  బయట జరుగుతున్న గొడవకు బాబా గారు కోపోద్రేకంతో చావడిలోనుంచి బయటకి వచ్చారు.  మహల్సాపతిని తిడుతూ బిగ్గరగా అరిచారు.  నువ్వూ ఒక తండ్రివేనా? నిమోన్  గ్రామంలో ఏమవుతోందో నీకు తెలియదా?  అలాటి సమయంలో జనాన్ని ఎందుకు రానిస్తావు?  "
రోజు పొద్దున పాటిల్ భార్య చనిపోయింది.
శ్రీ సాయి సత్ చరిత్ర .37  చావడి ఉత్సవం అయిన తరువాత బాబా అనుజ్ఞ తీసుకుని, తాత్యా తన గృహానికి బయలుదేరేవాడు.  అప్పుడు బాబా అతనితోవెళ్ళితే వెళ్ళు, కాని రాత్రి మధ్య మధ్య వచ్చి నన్ను కనిపెట్టుకుంటూ ఉండుఅని చెప్పేవారు
దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవలసినది బాబా గారు శయనించేవేళ తన నిద్రకు ఎవరూ భంగం కలిగించకుండా ఉండటానికే కొయ్య బల్లను ఎత్తుగా కట్టి పడుకునేవారు.  ఆయనకు అష్టసిధ్ధులు వచ్చు.  అందుకే ఆయన అంతెత్తు బల్లమీదకు అవలీలగా ఎక్కి పడుకునేవారు.  లఘిమ సిధ్ది వల్లనే ఆయన తన శరీరాన్ని అతి తేలికగా చేసుకుని గుడ్డపీలికలతో కట్టబడిన ఎత్తయిన బల్లపై శయనించేవారని ఇప్పుడు మనందరం గ్రహించుకున్నాము.

 ఆయన అంతెత్తు బల్లపై శయనించడం ఒక వింతగా ప్రజలందరూ చూస్తుండటం వల్ల బాబా ఆ కొయ్యబల్లను విరిచివేయడం మనకందరకూ తెలిసిన విషయమే.  ఆయన ఎప్పుడూ ప్రజలముందు తన శక్తులను ప్రదర్శించలేదు.    

అష్టసిధ్ధులు ::
అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట (సూక్ష్మావస్థలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుట వల్ల ఈ సిధ్ధి వస్తుంది.  దీని వల్ల అత్యంత సూక్ష్మ అణువుగా యోగి తనను తాను మార్చుకోగలడు)

మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట

గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట
లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట
ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట
ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట (అనేక దివ్య శక్తులు దూర దర్శనము, దూరశ్రవణము, ఆకాశగమనము) వారి వశములో ఉంటాయి.
ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట
వశీత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట

మాండూక్యోపనిషత్ గురించిన వివరణ సమాప్తం

(రేపు మరొక సందేహమ్ - బాబా సమాధానమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)










Kindly Bookmark and Share it:

2 comments:

Madhavi on April 27, 2020 at 10:49 AM said...

Chala baagundi.sir.great explanation.

Pardhasaradhi on April 27, 2020 at 7:00 PM said...

అష్ట సిద్ధుల గురించి వివరాలందించినందుకు ధన్యవాదములు. Ome Srisairam
--Pardhasaradhi

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List