Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, July 19, 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 5 వ.భాగమ్

Posted by tyagaraju on 7:32 AM

     Sai Baba of Shirdi - Wikipedia
         light pink rose.jpg (1 comment) Hi-Res 720p HD
19.07.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 5 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
9.  బాలి దేశములో శివరాత్రి
21.02.2020  శుక్రవారమ్ (శివరాత్రి)
నిన్నటిరోజున నీకు భారతదేశములోని రామేశ్వరం మరియు శ్రీరాములవారి పల్లెలను చూపించాను.  రోజున నిన్ను మరపడవలో రామేశ్వరం నుండి బాలి (వాలి) దేశానికి తీసుకొని వెడతాను.  అక్కడ నీకు రామాయణ నాటకము, శ్రీరామాలయ ప్రాంగణములో శివపార్వతుల నృత్యము మరియు నీ ఇష్టదేవత అయిన కామధేనువును చూపించుతాను నాతో రా అన్నారు ఫకిరు సాయిబాబా.


నేను (సాయిబానిస) మరియు ఫకీరు సాయిబాబా కలిసి ఒక మరపడవలో సూర్యోదయము వేళ రామేశ్వర సముద్రజలాల మీదుగా బాలి దేశానికి బయలుదేరాము.  సాయంత్రమువేళ మేము బాలిదేశానికి చేరుకొన్నాము.  సమీపతీరంలో ఒక శివాలయముంది.  సముద్రకెరటాలు శివలింగానికి అనుక్షణము సముద్రజలాలతో అభిషేకం చేస్తున్నాయి.  మందిరము మెట్లు ఒక చిన్న అడవిలోనికి వెళ్ళసాగినవి. నేను, ఫకీరుబాబా అడవిలోనికి చేరుకొన్నాము.
      Shiva Temple, Bali Temples
(బాలి ద్వీపం ఇండోనేషియాలోని శివుని ఆలయం)

అడవిలో చాలా కోతులు ఉన్నాయి.  బాబాను చూసిన కోతులు మా నుండి దూరంగా వెళ్ళిపోయినవి.  బాబా కోతులను చూచి ఇవి ఆనాటి వాలి సంతానము.  అవి నన్ను చూసి పారిపోయినవి.  ఇక నీవు ఒంటరిగా దగ్గరలోని చిన్న పట్టణములోనికి వెళ్ళి రాత్రి అంత గడిపి తిరిగి సూర్యోదయ వేళకు సముద్ర తీరంలో ఉన్న శివాలయానికి రా.  నేను నిన్ను తిరిగి భారతదేశం తీసుకొని వెళతాను అన్నారు.  నేను ఒంటరిగా పట్టణములోనికి వెళ్ళాను. 

పట్టణములో రాత్రివేళ ఒక బహిరంగ నాటకశాలలో శ్రీరామాయణ నాటకము ప్రదర్శించుతున్నారు.  నా దగ్గర టికెట్టు కొనడానికి డబ్బు లేదు అని అక్కడి కాపలాదారునికి చెప్పినాను.  అతడు నన్ను లోనికి పంపినాడు.  నేను నాటకములో శ్రీరామ పట్టాభీషేకము చూసి బయటకు వచ్చి దగ్గరలోని రామాలయానికి వెళ్ళినాను.  అక్కడ రంగస్థలం మీద శివపార్వతుల నృత్యము చూసి ఆనందించాను.  తెల్లవారసాగింది.  ఆకలి వేస్తుంటే దగ్గరలోని ఒక రోడ్డు ప్రక్కన ఉన్న హోటల్ కు వెళ్ళాను.  హోటల్ యజమానురాలు నన్ను చూసి నీవు భారతదేశంనుండి వచ్చినావు, నీకు ఆకలి వేస్తోంది కదూ?  ఇక్కడ బయట ఉన్న కుర్చీలో కూర్చో, నేను నీకు సమోసాలు, ఉల్లిపాయ కొద్దిగా బియ్యము తెచ్చి పెడతాను.  వాటిని తిని తిరిగి నీవు నీ దేశానికి వెళ్ళిపో అంది.

హోటల్ యజమానురాలు నాకు ఒక ప్లేటులో నాలుగు సమోసాలు, ఒక ఉల్లిపాయ తెచ్చి తినమంది.  నేను కడుపునిండా వాటిని తిన్నాను.  ఇంతలో తెల్లవారసాగింది.  హోటల్ దగ్గరలోని తోటలో నుండి ఒక పెద్ద ఆవు నా దగ్గరకు వచ్చింది.  ఆవు సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉంది.  కొమ్ములకు బంగారు తొడుగు ఉంది.  మెడలో ముత్యాల హారం ఉంది. నా దగ్గరకు వచ్చి తన నాలుకతో నా శిరస్సు నాకి తరువాత తన వెనుక భాగము నావైపు పెట్టి నా శిరసు మీద మూత్రాభిషేకం చేయసాగింది.  నేను సంతోషముతో సాయి సాంబశివ సాయి సాంబశివ అంటు నిద్రనుండి లేచాను.
10.  గత జీవిత స్నేహాలుబంధాలు
22.02.2020  శనివారమ్
వృధ్ధాప్యములో ఉన్నవారికి వారి గత జీవిత స్నేహాలు, బంధాలు, మానసికముగా బాధను కలిగించి, వారి ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం అవుతాయి.  అందుచేత గత జీవితంలోనికి తొంగి చూడకు.  గతాన్ని పూర్తిగా మరిచిపోయి వర్తమానంలో ప్రశాంతముగా జీవించు.  భవిష్యత్ కాలమును భగవంతునికి అర్పించు.  భవిష్యత్ గురించి ఆశలు పెట్టుకోవద్దు.  వర్తమానంలో ప్రయాణం చేస్తూ నీ జీవిత గమ్యాన్ని చేరుకో -   -------      బాబా
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List