Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 15, 2020

ఆ వ్యక్తి - ఆస్పత్రిలో పరిచయం

Posted by tyagaraju on 9:08 AM

    Crafts of India Shirdi Sai Baba/Big Hindu God Unframed Poster with ...
    Golden Yellow Preserved Flowers

15.08.2020  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమయిన సాయి లీలను ప్రచురిస్తున్నాను.  డా.ప్రియ, ముంబాయి నుండి తమ అనుభవాన్ని ఆంగ్లంలో శ్రీమతి మాధవి, భువనేశ్వర్ గారికి పంపించారు.  దానిని తెలుగులోని అనువాదం చేసి మీకు అందిస్తున్నాను.  ఇది చదివిన తరువాత బాబా లీలలు అమోఘమని, అనూహ్యమని మనకి అర్ధమవుతుంది.

'ఆ వ్యక్తి' -  ఆస్పత్రిలో పరిచయం
సాయి నన్ను భారతదేశానికి ఏవిధంగా పిలిపించుకొని, నన్ను తన భక్తురాలిగా చేసుకొన్నారో ఆ అద్భుతమయిన లీలని మీకు వివరిస్తాను.

మా కుటుంబంలో సాయిని నమ్ముకున్నవారెవరూ లేరు.  నేను మహారాష్ట్రలోనే జన్మించినందువల్ల సాయిబాబా ఎవరో తెలుసు.  పూర్వపు రోజులలోని జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకొంటే మా ఇంటిలోని బొమ్మల అలమారులో ఉన్న సాయిబాబా విగ్రహం గుర్తుకు వస్తుంది.  ఆ విగ్రహం కాషాయ రంగులో ఉండేది.  దేవుళ్ళందరికి నమస్కారం చేసుకున్నట్లుగానే ఆయనకు కూడా నమస్కరించడం తప్ప నాకు బాబా గురించి ఏమాత్రం తెలియదు. 


                    Divine Gifts - Sai Baba Statue Ecommerce Shop / Online Business ...
భగవంతుడంటే భయం భక్తి ఉన్న కుటుంబంలో జన్మించినందువల్ల అందరిలాగానే నాకు కూడా దైవభక్తి గురించి బోధించారు.  కాని నాకు ఆ దైవభక్తి అనేది కొంతవరకు మాత్రమే చెప్పాలి.  నా జీవితం అలా గడిచిపోతున్న రోజులలో వైద్యవిద్యను అభ్యసించడానికి విదేశానికి వెళ్ళాను.  అప్పటికే నాకు దేవుడు అంటే పరీక్షలలో మంచి మార్కులు రావాలని ఆయనకు చేతులు జోడించి నమస్కారం చేసుకోవడం తప్ప ఇంకేమీ చేసేదాన్ని కాదు.  సాయి సత్ చరిత్రలో బాబా ఎన్నో సందర్భాలలో చెప్పిన మాట… నా భక్తుడు ఎంత దూరంలో ఉన్న సరే పిచ్చుక కాళ్లకి దారం కట్టి లాగినట్లుగా నా చెంతకు రప్పించుకుంటాను.”  ఆవిధంగా లాగుకోబడ్డ పిచుకల్లో నేను కూడా ఒకదానిని.  ఆవిధంగా  ఆధ్యాత్మికప్రపంచంలోకి నాప్రయాణం మొదలయింది.

నా చదువు పూర్తయిన తరవాత భారతదేశానికి తిరిగి వచ్చాను.  కాని నా ఆలోచనలన్నీ అమెరికాలో స్థిరపడదామనే.  కాని బాబా ఆలోచనలు మరొక విధంగా ఉన్నాయి.  ఆయన నన్ను తనవైపుకు ఎంత బలీయంగా లాక్కున్నారంటే ఆయన పట్టునుంచి నేను బయటపడలేనంతగా లాక్కున్నారు.  బాబా లీలలు ఏవిధంగా ఉంటాయో మాటలలో వర్ణించలేము.  అటువంటి అమూల్యమయిన అసాధారణమయిన లీలలను వర్ణించటానికి నాశక్తి సరిపోదు.  ఇపుడు నా ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం ఈ అధ్భుతమయిన లీలతో ఏవిధంగా ప్రారంభమయిందో వివరిస్తాను.

నేను భారతదేశానికి తిరిగివచ్చిన తరువాత బాబా, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతుడయిన  ఒక వ్యక్తితో నాకు పరిచయం కలిగేలా చేసారు.  ‘ఆవ్యక్తి’ ద్వారా బాబా సందేశాన్ని పంపించారు.  ఒక చిన్న సంఘటన ద్వారా బాబా నాకు ‘ఆవ్యక్తి' తో పరిచయం కలిగేలా ఏర్పాటు చేసారు.  నా స్నేహితురాలు కొన్ని భజనల సిడీలను నాకు ఇచ్చి, వాటిని ప్రక్క ఊరిలో ఉంటున్న ‘ఆవ్యక్తి' కి కొరియర్ లో పంపించమని చెప్పింది.  కొరియర్ లో పంపించడానికి కాస్త బధ్ధకించాను.  కాని ‘ఆవ్యక్తి’ కి పంపబోయే ఆ పార్సిలే నా జీవితంలో మలుపుతిప్పే అధ్బుతమయిన అనుభవాన్నిస్తుందని ఊహించలేదు.

‘ఆవ్యక్తి’ కి నేను పార్సిల్ పంపించిన కొద్దిరోజుల తరువాత ‘ఆవ్యక్తి’ నాకు ధన్యవాదాలు తెలుపుతూ ఫోన్ చేసాడు.  ముందుగా మేము మామూలు విషయాలనే మాట్లాడుకున్నాము.  అకస్మాత్తుగా ‘ఆవ్యక్తి’ నాకు మాత్రమే తెలిసిన విషయాలను చెప్పడం మొదలుపెట్టాడు.  ‘ఆవ్యక్తి’ ఆవిధంగా చెప్పడంతో ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను.  నాకు పరిచయంలేని ‘ఆవ్యక్తి’ కి నాకు మాత్రమే తెలిసిన విషయాలను ఎలా చెప్పగలుగుతున్నాడు?  కాని వాటిని నేనంతగా పట్టించుకోలేదు.  ‘ఆవ్యక్తి’ ఇంకా అలా మాట్లాడుతూనే "మనిద్దరి పరిచయం ఆస్పత్రిలో జరుగుతుంది"  అని అన్నాడు.  ‘ఆవ్యక్తి’ ఆవిధంగా ఎందుకని అన్నాడో నాకు ఎటువంటి ఆధారం కనపడలేదు.  కాని నేను ఒక్కటి మాత్రం గమనించినదేమంటే ‘ఆవ్యక్తి’ ఫోనులో నాతో మాట్లాడుతున్నంత సేపు “ఓమ్ సాయిరామ్” అని అంటూనే ఉన్నాడు.

రెండు వారాల తరువాత నేను తిరిగి అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను.
సరిగ్గా ఆసమయంలోనే బాబా తన లీలను చూపించారు. 

నేను అమెరికా ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోబోతున్నాను.  అనుకోకుండా ఒకరోజు నాస్నేహితుడు గాంధీ నన్ను తనతో కూడా ఆసియన్ హార్ట్ హాస్పిటల్ కి రమ్మని కోరాడు తను ఆస్పత్రిలో ఆరోగ్యపరమయిన పరీక్షలు చేయించుకుంటానని చెప్పడంవల్ల నేను కూడా వెళ్ళాను.  అతను బాబాకి మంచి భక్తుడు.  ఆస్పత్రిలో అతని గుండెకి వైద్యులు అన్ని పరీక్షలు చేసారు.  ఆసమయంలోనే మా అమ్మగారు ఇంటినుంఛి నాకు ఫోన్ చేసారు.  మా అమ్మగారి గొంతు వణుకుతోంది…”ప్రియా, నాన్నగారికి బాగా చెమటలు పడుతున్నాయి.  ఛాతీలో కూడా కాస్త నొప్పిగా ఉందని చెబుతున్నారు” అని గద్గద స్వరంతో చెప్పింది.  నేను కూడా వైద్యురాలినే అవడంవల్ల అది హార్ట్ ఎటాక్ లక్షణాలని వెంటనే అర్ధమయింది.  పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఆలోచించేముందే మరొక ఆలోచన లేకుండా ఇంటికి బయలుదేరాను.  నాన్నగారిని ఆస్పత్రికి తీసుకువచ్చాను.  ఇ సి జి లో హార్ట్ ఎటాక్ అని స్పష్టంగా తెలిసింది.  ప్రపంచమంతా తలక్రిందులయినట్లనిపించింది.  నాతండ్రి నాకు దక్కడేమో అని ఏదో తెలియని భయం నాలో ప్రవేశించింది..  వైద్యులుగా మేము మా దగ్గరకు వచ్చే రోగులని, వారి బంధువులని ఓదారుస్తూ ధైర్యం చెబుతూ ఉంటాము.  అదే పరిస్థితి మాకు కలిగినపుడు నిభాయించుకోవడం ఎంత కష్టమో ఇప్పుడు నాకు తెలుస్తోంది. 

నాబాధను ఎవరితో ఎంచుకోవాలో తెలియటల్లేదు.  నన్ను ఓదార్చే మనిషి కావాలి.  వైద్యురాలినయిన నేనే డీలా పడిపోతే ఇక మాకుటుంబం మరింతగా దిగాలుపడిపోతుంది.  ఇక భగవంతుడిని ప్రార్ధించడం  ఒక్కటే మార్గం అనుకున్నాను.  మానాన్నగారిని కాపాడమని నాకు తెలిసున్న ప్రతిదేవుడికి మొఱ పెట్టుకున్నాను.  అప్పటికే నాలోని నిస్సహాయత నాకు తెలుస్తూనే ఉంది.  విధిముందు మనమెంతటి అల్పులమో నాకిప్పుడు అర్ధమవుతోంది.  దైవశక్తి లేనిదే వైర్యులు కూడా ఏమీచేయలేరు.  నేను వైద్యురాలినయినా కూడ ఏదో  ఒకవిధమయిన శూన్యం నాలో ఆవరించింది.  నాకళ్ళంబట నీళ్ళు కారుతున్నాయి.  అనుకోకుండానే నా నోటినుండి “ఓమ్ సాయిరామ్” అనే మాటలు వెలువడ్డాయి.  ఆ మాటలు నాపెదవులనుండి వెలువడిన మరుక్షణమే ‘ఆవ్యక్తి’ నుండి ఫోన్ వచ్చింది. “ఎక్కడ ఉన్నావు.  నేను నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాను” అన్నాడు.  మేమిద్దరం మొట్టమొదటగా ఫోన్ లో మాట్లాడుకున్నపుడు ‘ఆవ్యక్తి’ “మనిద్దరి పరిచయం ఆస్పత్రిలో” అన్న మాటలు గుర్తొచ్చాయి.  నాకు ఆవ్యక్తి ఎవరో తెలియదు.  నేనావ్యక్తికి నేను ఉన్న ఆస్పత్రి అడ్రస్ చెప్పాను.  15 నిమిషాలలో ‘ఆవ్యక్తి’ నాదగ్గరకు వచ్చాడు.  'ఆవ్యక్తి' కి వయస్సు 30 సంవత్సరాల మధ్యలో ఉండచ్చు.  అతను మానాన్నగారికి దత్తపాదుకాభిషేక తీర్ధం ఇచ్చి, “మీరు మీ అమ్మాయి వివాహం చూస్తారు” అని అన్నాడు.  ఆవ్యక్తి మాటలకు నాలో బలీయమయిన నమ్మకం కలిగింది. 'ఆ వ్యక్తి' వెళ్ళిపోతుంటే దిగబెట్టడానికి కూడా వెళ్ళాను.
(మిగతా రేపటి సంచికలో)
(ఆణిముత్యాలు తరువాయి భాగం కూడా రేపటి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List