13.09.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిలీల ద్వైమాసపత్రిక మే – జూన్ 2016వ.సంవత్సరంలో ప్రచురింపబడిన అత్యద్భుతమయిన బాబా లీలను ఈ రోజు
ప్రచురిస్తున్నాను. బాబా
మనలని కనిపెట్టుకుని మన వెంటే ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు ఎలా అనూహ్యంగా మన జీవితంలోకి ప్రవేశిస్తారొ దీని ద్వారా మనం గ్రహించుకోవచ్చు.
ఇక
చదవండి.
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఊదీ ధరించిన వెంటనే బాబా ప్రవేశమ్
మా కుటుంబానికి మంచి స్నేహితుడయిన శ్రీ కె. గోపాలకృష్ణన్ గారి జీవితంలోకి బాబా ఏవిధంగా ప్రవేశించారో, ఆతరువాత జరిగిన మార్పులు అన్నీ కూడా బాబా చూపించిన
ఒక
అధ్భుతమయిన లీల.
పద్మా రామస్వామి – ఎ – 8/3 శ్రీరామ్ నగర్
ఎస్.వి.రోడ్, అంధేరీ(వెస్ట్)
ముంబాయి – 400 058
మొబైల్ (0)9820349755
ఒడలు పులకరించేటంతటి అనుభవాలని శ్రీ కె. గోపాల కృష్ణన్ గారు స్వయంగా వివరించారు.
“2015
వ.సంవత్సరం జూన్ 10వ.తారీకున ఎప్పటిలాగానే నేను ఆఫీసుకు వెళ్ళిపోయాను.
ఇంట్లో
నాభార్య ఒక్కతే ఉంది.
ఆమె
ఇంటిపనులన్నీ
చేసుకుంటూ ఉంది.
అకస్మాత్తుగా సాయంత్రం 5 గంటలకి ఆమెకి తలలో సూదులతో పొడుస్తున్నట్టుగా విపరీతమయిన పోటు ప్రారంభమయింది. కొద్ది సేపటిలోనే నొప్పి భుజాలలోకి వ్యాపించింది. తనకేదో అయిపోతోందన్నట్లుగా గ్రహించుకుంది. వెంటనే హాలులోకి వచ్చి మంచం మీద కూర్చుందామని ప్రయత్నించింది. కాని ఆమె కాళ్లు అందుకు సహకరించలేదు. సరిగా నిలబడలేని స్థితిలో ఉంది. అలాగే ఏదోవిధంగా బలవంతాన తనను తాను సంబాళించుకుని, వెంటనే మా కాలనీలోనే ఉంటున్న తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. (ఆమె స్నేహితురాలు క్రందటి రోజు రాత్రే దక్షిణదేశ యాత్రలను ముగించుకుని తిరిగి వచ్చింది.) తన పరిస్థితిని అతికష్టంమీద చెప్పి వెంటనే రమ్మంది. ఆమె స్నేహితురాలు ఆలస్యం చేయకుండా త్వరగా మాయింటికి వచ్చింది. ఆమె రాగానే నాభార్య హాలులో నేలమీద కూర్చుని ఉంది. శరీరమంతా బాగా చెమటలు కారిపోతున్నాయి. నాభార్య కళ్ళు సగం మూతలుపడి ఉన్నాయి. కాస్త మగతగా ఉన్న స్థితిలోనే తన స్నేహితురాలికి పరిస్థితిని చెప్పింది. నేను అప్పటికింకా ఆఫీసులోనే ఉన్నాను. మాయింటిలో జరుగుతున్నదేమీ నాకు తెలియదు. నా కజిన్ భార్య డాక్టరు. నాభార్య తన స్నేహితురాలికి డాక్టర్ డ్యూటీనుంచి తిరిగి వచ్చిందోలేదో కనుక్కోమని చెప్పింది. ఆమె స్నేహితురాలు డాక్టర్ కి ఫోన్ చేసి ఆమె వచ్చిందని తెలియగానే పరిస్థితినంతా చెప్పి వెంటనే రమ్మంది. డాక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాయింటికి వచ్చింది. వెంటనే బి.పి. పరీక్ష చేసింది. బి.పి. 170/130 ఉంది. గుండె 108 వేగంతో కొట్టుకొంటోంది. నాభార్యకు వాంతులు మొదలయ్యాయి. మంచినీళ్ళు కూడా తాగలేని స్థితిలో ఉంది. ఎలాగయినా బి.పి.ని తగ్గించడానికి డాక్టరు బలవంతాన్న టాబ్లేట్ నోటిలో పెట్టి మింగించింది. ఒక గంట గడిచాక బి.పి. కాస్త తగ్గి, హార్ట్ ఎటాక్ గాని, స్ట్రోక్ గాని రాకుండా ప్రమాదంనుంచి బయటపడింది.

నా భార్యకు అకస్మాత్తుగా
ఈవిధంగా
జరిగిందనే విషయాన్ని మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పారు.
మా
అబ్బాయి ఆఫీసునుండి సాయంత్రం 6-40 కి ఇంటికి చేరుకున్నాడు.
అప్పటికీ
నాకు ఈవిషయం గురించి ఏమీ చెప్పలేదు.
కారణం
ఆఫీసునుండి నేను కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చే సమయంలో నేను చాలా ఆందోళన ఆత్రుతతో అస్థిమితంగా ఉంటాననే భయంతో చెప్పలేదు.
నేను
రాత్రి 7 గంటలకి ఇంటికి చేరుకున్నాను.
ఇంటికి
రాగానే నాభార్య పరిస్థితి చూసి దిగ్భ్రమ మలిగింది.
నా
భార్య ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండేది.
ఇంతకుముండు ఎటువంటి
అనారోగ్య పరిస్థితులు రాలేదు.
ఇపుడున్న
పరిస్థితిని
చూసి అసలేమయిందో నాకేమీ అర్ధం కాలేదు.
డాక్టర్
నాభార్య బి.పి.ని మాటిమాటికీ
పరీక్షిస్తూనే
ఉంది. క్రితం
రోజు బి.పి. 130/80 ఉంది.
నాభార్య
ఆరోగ్య పరిస్థితి
చాలా ఆందోళనకరంగా ఉండటం వల్ల వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సిందే అనుకుని తీసుకువెళ్లాము.
అక్కడ
ఇ సి జి తీసారు.
ఇ
సి జి లో గుండెపోటు లక్షణాలేవీ కనిపించలేదు.
కార్డియాలజిస్టు ఐ
సి యూ లో అబ్జర్వేషన్ లో ఉంచారు.
రాత్రి
10 గంటలకు కార్డియాలజిస్టు వచ్చి ఇ సి జి లో ఎటువంటి సూచనలు లేకపోవడంవల్ల సి టి స్కాన్ చేస్తామని చెప్పాడు.
మరుసటిరోజు
11వ.తారీకు
అర్ధరాత్రి గం.1.30 కు సి టి స్కాన్ చేసారు.
అందులో
బ్రైన్
హెమరేజ్ ఉన్నట్లుగా వెల్లడయింది.
అందుచేత
సెరిబ్రల్ యాంజియోగ్రఫీ చేయడానికి దగ్గరలోనే ఉన్న మరొక ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు.
11వ.తేదీ మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ చెప్పిన ఆస్పత్రికి తీసుకువెళ్ళాము.
ఎన్యూరిజమ్
కారణంగా బ్రైన్ హెమరేజ్ స్ట్రోక్ కు సర్జికల్ ట్రీట్ మెంటుకు యాంజియోగ్రఫీ చేసారు.
(ఎన్యూరిజమ్)
సర్జరీకి చాలా ఖర్చు అవుతుంది. దానికి ఎంత ఖర్చుఅవుతుందో విన్న తరువాత నేను, మా అబ్బాయి చాలా కలత చెందాము. అంత ఖర్చును భరించగలిగే శక్తి మాకు లేదు. నా ఆఫీసులోని నా సహోద్యోగులు ఉదార స్వభావంతో మనస్ఫూర్తిగా చేసిన సహాయానికి ఆస్పత్రిలో చేర్చవలసివస్తే ఖర్చులేకుండా వైద్యం చేయడానికి తగిన ఇన్సూరెన్స్ పాలసీలు వీటి సహాయంతో మేము అంతటి కష్టాన్ని అధిగమించాము. మరుసటి రోజు 12వ.తారీకున రాత్రి గం.1-30 కి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. నాభార్యకు వెంటిలేటర్ అమర్చిన తరువాత ఐ సి యూ లోకి మార్చారు.

నా జీవితంలోకి మొట్టమొదటిసారిగా
సాయిబాబా ప్రవేశించారన్న విషయం నాకు జూన్ 12వ.తారీకున అనుభవమయింది.
నిజం
చెప్పాలంటే ఈ అనుభవం జరగడానికి ముందు అసలు నేను సాయిబాబాకు భక్తుడినే
కాను. అలాగనిచెప్పి
నేను నాస్తికుడనూ కాదు.
నేను
ఆంజనేయస్వామికి
ప్రగాఢమయిన భక్తుడిని.
గత
35 సంవత్సరాలుగా
నేను క్రమం తప్పకుండా ప్రతి శనివారమునాడు హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి ఆయనను పూజించుకుంటూ ఉన్నాను.
హనుమంతుడిని పూజించుకున్న తరువాత, ఆస్పత్రిలో ఉన్న నా భార్యను చూడటానికి ఆస్పత్రికి బయలుదేరాను. నాభార్య త్వరగా కోలుకోవాలనే ఆశతో ఎదురు చూస్తూ ఉంది.
(బాబా ఏవిధంగా వచ్చారో రేపటి సంచికలో)
(శ్రీసాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలు 21వ.భాగం ఈ క్రింది లింక్ ద్వారా చదవండి.)
http://teluguvarisaidarbar.blogspot.com/
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

0 comments:
Post a Comment