Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, September 12, 2020

మందిరం మొదటి మెట్టు

Posted by tyagaraju on 7:42 AM

 

     Shri Shirdi Saibaba Satcharitra Parayanam - Telugu

          Beautiful light yellow roses HD picture free download

12.09.2020  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన మరొక లీల రోజు ప్రచురిస్తున్నాను.  హిందీనుండి తెలుగులోనికి అనువాదం చేసి భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించారు.

మందిరం మొదటి మెట్టు

1984.సంవత్సరంలో నేను లోడీరోడ్ లో ఉన్న దయాల్ సింగ్ కాలేజీలో B.Sc చదువుతున్న రోజులు.  పరీక్షలు అయిన తరువాత పరీక్షాఫలితాల కోసం కాలేజీకి వెళ్ళాను.  అప్పటికి ఇంకా ఫలితాలు ప్రకటించలేదని చెప్పారు.  నిరాశతో నేను నా స్నేహితుని ఇంటికి వెళ్లాను.  వెళ్ళేదారిలో మూడు మందిరాలు ఉన్నాయి.  ముందుగా నేను రెండు మందిరాలలోకి వెళ్ళి భగవంతునికి నమస్కరించుకున్నాను.  మూడవమందిరం దగ్గరకు వచ్చాక లోపలికి వెళ్ళడానికి మొదటి మెట్టు ఎక్కాను.  కాని, ఇంతలోనే నాకు మనసులో అనిపించింది.  పరీక్షలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయితేనే మందిరంలోకి వెళ్లాలి అనే ఆలోచనతో లోపలికి వెళ్లకుండానే తిరిగి వెళ్ళిపోయాను.  మరుసటిరోజు ఫలితాలు వచ్చాయి.  నేను 75శాతం మార్కులతో ఉత్తీర్ణుడయినట్లుగా నా స్నేహితులు శుభాకాంక్షలు చెప్పారు.  


కష్టపడి చదివి రాసాను కాని ఇన్ని మార్కులు వస్తాయని ఊహించలేదు.  నన్ను నేనే నమ్మలేకపోయాను.  వెంటనే నాకు మూడవమందిరం గుర్తుకు వచ్చింది.  వెంటనే మందిరానికి త్వరగా చేరుకొన్నాను.  అక్కడ మందిరంలో ఆరతి అవుతూ ఉంది.  ఆరోజు గురువారం అయినందు వల్ల చాలామంది భక్తులు ఉన్నారు.  అక్కడ తెల్లని పాలరాతి విగ్రహం కనిపించింది.  విగ్రహాన్ని చూడగానే నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది.  ఆ విగ్రహం షిరిడీ సాయిబాబా అని నాకు ముందు తెలియదు.  విధంగా నాకు తెలియకుండానే బాబా నన్ను తనవైపుకు లాగుకున్నారు.  అందరూ ఆరతి పాడుతున్నారునమస్కార సాష్టాంగ శ్రీసాయినాధ ఇదే నాకు మాటిమాటికీ మనసులో గుర్తుకు వస్తూ ఉంది.  ఆ తరువాత ప్రతిరోజు మందిరానికి రావాలనిపించింది..  ఈవిధంగా నాకు బాబా మీద భక్తి విశ్వాసాలు పెరుగుతూ వచ్చాయి.

B.Sc.లో మంచి మార్కులు వచ్చినందువల్ల M.Sc. చదవాలనిపించింది.  బాబా అనుగ్రహంతో నాకు హిందూ కాలేజీలో సీటు వచ్చింది.  ఆరోజుల్లోనె నాకు బాబామీద భక్తివిశ్వాసాలు పెరుగుతూ వచ్చాయి.  ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్ళడం ఒక నియమంగా పెట్టుకొన్నాను.  నాకు బాబాయే ప్రపంచం అనుకునేవాడిని.  చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం వస్తే నేను పనిచేసే ఆఫీసుకు ఒకటి రెండు కిలోమీటర్ల దురంలో బాబా మందిరం ఉంటే బాగుండును అని అనుకునేవాడిని.  ఇంకా M.Sc.ఫలితాలు రాలేదు.  బాబా నాకు DAB స్కూలులో PGT ఉద్యోగం ఇప్పించారు.  రోహిణి సెక్టార్-7 లో బాబా మందిరనిర్మాణం జరుగుతోందని ముందే నాకు తెలిసింది.  ఆ మందిరాన్ని సెక్టార్-3 లో నిర్మిద్దామనుకున్నారు కాని, అక్కడ స్థలం దొరకనందువల్ల సెక్టార్ 7 లో కట్టారు. 

                     Sai Baba Mandir Photos, Rohini Sector 7, Delhi- Pictures & Images Gallery -  Justdial

ప్రజలు ఇళ్ళు కట్టుకోవడం ముఖ్యమనుకుంటారు గాని, భగవంతుడు భక్తునికోసం మారడం చరిత్రలో ఇదే మొదటిసారేమో అనిపించింది.  ఇది బాబాయొక్క అధ్భుతమయిన లీలనే అనుకున్నాను.

ఆరోజునుంచి నాకు బాబా సేవ చేసుకునే భాగ్యం కలిగింది.  ముందునుంఛి నాకు భజనపాటలు పాడాలని ఉండేది.  కాని పాడలేకపోయాను.  మెల్లమెల్లగా బాబా దయవలన పాడటం మొదలుపెట్టాను.  క్రమక్రమంగా గంటసేపు పాడగలిగే శక్తి బాబా ప్రసాదించారు.  నాకు ఇంకా చదవాలని ఉండేది.  ఉద్యోగంతోపాటు B.Ed. చేసే అదృష్టాన్ని కూడా ఇచ్చారు.  ఒక సంవత్సరరం తరువాత M.Ed కూడా చేయగలననే ధైర్యం వచ్చింది.  అదికూడా పూర్తి చేసాను.  ఇపుడు Phd కూడా చేయాలని ఉంది.  ఈలోపు ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ నరేంద్రనాధ్ గారిని కలుసుకునే అవకాశాన్ని బాబాయే కలిగించారు.  మీదగ్గర Phd చేయాలని ఉంది నాకు అని ఆయనతో చెప్పాను.  ఆయన వెంటనే అంగీకరించారు.  ఇంతలో మరొక ప్రొఫెసర్ మదన్ మోహన్ బజాజ్ అనే ఆయనతో కలిసే అవకాశాన్ని బాబా కలిగించారు.  నీవు Phd మదన్ మోహన్ బజాజ్ వద్ద చేయిఅని బాబా ఆదేశం అయి ఉండవచ్చు.  ఇద్దరు ప్రొఫెసర్ లు ఒకే కాలేజీలో పనిచేస్తున్నారు.  ఇద్దరు మంచి స్నేహితులు కూడా.  నేను ఏపరీక్ష రాయకుండానే బజాజ్ గారివద్ద Phd ప్రారంభించాను.  ఇక్కడ పెద్దపెద్దవాళ్ళతో సమావేశాలు జరుగుతూ ఉంటాయి.  ప్రశంసా పత్రాలు తీసుకోవడం చాలా అవసరం ముందుగా నేను కలుసుకున్న ప్రొఫెసర్ ఇవ్వరేమో అనుకున్నాను.  కారణం, ఆయనకు తెలియచేయకుండా నేను బజాజ్ గారి దగ్గర Phd చేయడానికి చేరాను.  కాని బాబా అనుగ్రహం వల్ల ఆయనే వచ్చి, నాకు ప్రశంసాపత్రం ఇస్తానని చెప్పారు.  భగవంతుడు ఏమి చేసినా మనమంచికే చేస్తాడు.  ఇదంతా బాబా లీల అనే భావించాను.  ఎవరికయితే నేను అబధ్ధం చెప్పానో నరేంద్రనాధ్ గారే నాగురించి బాగా రాశారు.  ఆ తరువాత నాకు Phd లో ప్రవేశం లభించింది.  కాని దైవనిర్ణయం చాలా విచిత్రం.  నాకు ప్రశంసాపత్రం ఇచ్చిన మూడవరోజే అకస్మాత్తుగా నరేంద్రనాధ్ గారు మరణించారు.  బహుశ అందుకే బాబా నాకు ఆయన వద్ద Phd చేసే అవకాశాన్ని ఇవ్వలేదేమో అనిపించింది.  బాబాకు భూతభవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసు.  తన భక్తులను ఎన్నోరకాలుగా కాపాడుతూ ఉంటారు.  నా Phd పూర్తయిపొయింది.

నేను ‘సాయిశక్తిఅనే పుస్తకం కూడా రాసాను.  దానిలో ద్వారకామాయి చిత్రపటానికి దోమతెర కడతారు.  దీపం వెలిగిస్తారు.  చాలా సార్లు ఆదీపం గాలిలేకపోయినా దానంతటదే కదులుతూ ఉంటుంది.  విషయం గురించి సంస్థానంవారు వీడియో కూడా తీసారు.  నేను కూడా ఒకసారి ఆవీడియో సంపాదించాను.  ఈవిధంగా సాయిబాబా నా జీవిత పర్యంతం నాతోనే ఉన్నారు.  ఆ తరువాత బాబా గురించి చాలా పుస్తకాలు చదివాను.  చాలా పుస్తకాలు కూడా రాసాను.  మొట్టమొదట ఆయన మందిరం మొదటి మెట్టు ఎక్కి లోపలికి వెళ్ళకుండా వచ్చేసిన నన్ను బాబా ఏవిధంగా తీర్చిదిద్దారో తలుచుకుంటె నాకే ఆశ్చర్యం కలుగుతుంది.

రవీంద్రనాధ్ కాకరిగా న్యూఢిల్లీ

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List