Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 11, 2020

తిరుపతిలో జరిగిన అధ్బుతమయిన బాబా దర్శనం

Posted by tyagaraju on 7:27 AM
     Wallpics Shirdi Saibaba Wallpapers Glossy Photo Paper Poster for Living,  Bedroom, Office, Kids, Hall (Multicolor, 13X19): Amazon.in: Home & Kitchen

         Beautiful Yellow Roses Hd Wallpapers | Roses Gallery

11.09.2020  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిలీల పత్రికలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమయిన బాబా లీలను భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు తెలుగు అనువాదం చేసి పంపించారు.  తిరుపతి, మరియు నెల్లూరులలొ జరిగిన అధ్భుతాన్ని మీరు కూడా చదివి ఆనందించండి.

తిరుపతిలో జరిగిన అధ్బుతమయిన బాబా దర్శనం

అది 1980 .సంవత్సరంనాయుడుగారి భార్య తన పూజ గదిలో భక్తితో పూజ చేసుకుంటూ ఉంది.  సమయంలో ఒక సత్పురుషుడు ఆమెకెదురుగా దర్శనమిచ్చాడు.  ఆయన తలంతా జడలుకట్టి ఉన్నాయి. “నన్ను చూస్తే నీకు భయం వేయటంలేదా?” అని ఆమెని ప్రశ్నించాడు.  



ఆమెలేదు భగవాన్,  మీరెవరు?” అని అడిగింది.  వెంటనే ఆయన తన ప్రేగులను బయటకు తీసి మరలా లోపలిగి మ్రింగివేశారు.  సత్పురుషుడు తన ఉత్త చేతులలోనుండి తీర్ధాన్ని ఆమెకు ఇచ్చాడు.  నాకు దక్షిణ ఏమయినా ఇస్తావా?” అని ఆడిగాడు.  అపుడామె దక్షిణ ఇవ్వడం కోసం వెతుకుతూ ఉంది.  అపుడాయన అలమారలో చిల్లర పెట్టావు తీసుకొచ్చి ఇవ్వుఅన్నాడు.  ఆమె దక్షిణ ఇవ్వడానికి చిల్లర తెచ్చేలోపుగానే ఆయన తను నిలబడిన చోట పాదముద్రలు వదలి అదృశ్యమయ్యాడు.  దౌతీ చేయడం, దక్షిణ అడగడం గమనిస్తే ఆయన సాయిబాబా కాక మరెవరూ కాదు.  ఖచ్చితంగా ఆయనే అని గ్రహించుకోగానే ఆమెకు ఆశ్చర్యం ఆనందం రెండూ ఒకేసారి కలిగాయి.  అంతకన్నా ఆశ్చర్యకరమయిన సంఘటన నెల్లూరులో జరిగింది.
నెల్లూరులో జరిగిన సంఘటనఅమె అన్నయ్య శ్రీ వెంకట నాయుడు చెబుతున్న వివరాలు
నేను కాఫీ త్రాగడనికి నా స్నేహితులతో హోటల్ కు వెళ్ళాను.  అక్కడ హోటల్ లో గోడమీద అందరు దేవీదేవతల చిత్రపటాలతోపాటుగా శ్రీసాయిబాబా ఫోటో కూడా ఉంది.  ఫొటోలో సాయిబాబా ఒక రాతిమీద కాలుమీద కాలువేసుకుని ఆశీర్వదిస్తూ తలకు గుడ్ద చుట్టుకుని ఉన్నారు.  బాబా కళ్ళలో విశేషమయిన కృప ప్రసరిస్తూ ఉంది.  
        Shirdi Sai Baba in white Robe

నాకు సాయిబాబా ఫొటోమీదనే దృష్టి ఏకాగ్రమయింది.  బాబా ఎవరిని ఎపుడు ఎలా కృపాదృషితో చూస్తారో ఎవరూ ఊహించలేరు.  స్నేహితులందరూ కాఫీ త్రాగిన తరువాత వెళ్ళిపోయారు.  నేను బాబా ఫొటొవైపే తదేకంగా చుస్తూ నుంచుని ఉన్నాను.  మహనీయుని వదనంలో పరబ్రహ్మస్వరూపం కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంది.  ఆయన ఎవరయి ఉంటారు అనే ఆలోచనతోనే బయటకు వచ్చాను.  మనసులో ఆయన స్వరూపాన్నే నింపుకుని వెళ్ళసాగాను.  తరువాత సాయంత్రం బజారులో నా స్నేహితుడు కలిసాడు.  అతను నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.  అతని భార్య, “మేము మొన్న షిరిడీకి వెళ్ళాము,” అని చెప్పి నాకు ప్రసాదం, బాబా ఫోటో ఇచ్చింది.  నాకళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం, కన్నీళ్ళు ఆగటంలేదు.  అయితే ప్రొద్దున్న నేను హోటల్ లొ దర్శించుకున్నది మహనీయుడినేనా అని అనుకున్నాను.

ఇంటికి వెళ్ళిన తరువాత గురువారమునాడు బాబా ఫోటోను పూజగదిలో పెట్టుకుని రోజూ సాయిచరిత్ర పారాయణ, భజన, సత్సంగం అన్నీ చేసుకోవడం మొదలుపెట్టాము.  ఆరోజు కలలో సాయినాధుని సమాధిని దర్శించుకున్నాను.  సమాధిమందిరమంతా అగరువత్తు పరిమళంతో నిండిఉంది.  తరువాత గురువారమునాడు సాయిబాబా కలలో దర్శనమిచ్చారు.  నన్ను షిరిడీకి రమ్మన్నారు.  నా ఇష్టదైవం శ్రీరామ చంద్రుడు.  నాకు ఒకరోజు కలలో శ్రీరామచంద్రుడుదర్శనమిచ్చారు.  వెంటనే ఆయన స్థానంలో సాయినాధుడు కనిపించారు.  తరువాత మా కుటుంబ సభ్యులమందరం షిరిడీ వెళ్లాము.  అబ్దుల్ బాబా కుటీరంలో సాయినాధుడు స్వయంగా దర్శనమిచ్చారు.  నన్ను సమాధి మందిరానికి తీసుకువెళ్లారు.  జీవితాంతం తాను నాకు సహాయంగా ఉంటానని చెప్పారు.  విధంగా అన్నివేళలా నాకు సహాయపడుతూ నా బాగోగులను చూస్తున్నారు.

నాకు ఉన్న సాంసారిక బంధాలన్నీ అయిపోయాయి.  ఇపుడు చివరి శ్వాసవరకు ఆయన స్మరణ, ఆయన ధ్యాస, ఆయన ధ్యానం అంతే.
అసలు విషయం ఇప్పుడు వివరిస్తాను.  మా చెల్లె లకి ఎపుడయితే వాళ్ల ఇంటిలో దర్శనమిచ్చారో, అపుడే ఆయన నేను హోటల్ లో ఉన్న సమయంలో నన్ను తనవైపుకు లాగుకున్నారు.  తరువాత రెండురోజులకు మేము కలుసుకున్నపుడు మాకు జరిగిన అనుభవాలను చెప్పుకుని ఆశ్చర్యపోయాము.
వెంకటనాయుడు, నెల్లూరు
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List