Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, November 26, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 1 వ.భాగమ్

Posted by tyagaraju on 5:56 AM

 




26.11.2020  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 1 వ.భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)


తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్ 

గత కొద్ది నెలలనుండి నాకు సాయిబాబా వారి మీద ఒక ధారావాహిక ప్రచురించాలనే సంకల్పం కలిగింది.  దానికనుగుణంగానే నిన్నటి రోజున ఇటలీ దేశస్థుడు శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ గారు సాయిబాబావారిమీద పరిశోధన చేసి వ్రాసిన పూర్తి పుస్తకం అంతర్జాలంలో లభించింది.  వెంటనే ఆయన మైల్ ఐ.డి కోసం వెదకినా పుస్తకంలో కనిపించలేదు.  చివరికి గూగుల్ లో వెదికితే దొరికింది.  ఆయన పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయడానికి అనుమతికోసం వెంటనే ఆయనకు మైల్ ఇచ్చాను.  ఒక అరగంటలోనే ఆయన నాకు జవాబు ఇవ్వడం జరిగింది.  ఆయన వ్రాసిన విషయాలన్నిటినీ ఎవరయినా ఏవిధంగానయినా ఉపయోగించవచ్చని, అది అంతా సాయిభక్తులందరికి ప్రచారం కోసమేనని జవాబు పంపించారు.  వారికి నా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. Love Sai Live in Sai వాట్స్ ఆప్ గ్రూపులో ఈ శ్రీ ఆంటోనియో గారు షిరిడిలో కొంతమందితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలను ORAL TESTIMONIES ON SAI BABA అనే పేరుతో పోస్ట్ చేసారు.  ORAL TESTIMONIES ON SAI BABA గురించి  తెలుసుకోవాలనే ఆసక్తితో అంతర్జాలంలో శోధించినపుడు ఆయన వ్రాసిన పుస్తకం లభించింది. (DIGITAL PUBLISHING) ఆయన షిరిడీలోని కొంతమంది వ్యక్తులతో  సాయిబాబా గురించి ముఖాముఖి సేకరించిన విషయాలను, ఆయన వ్రాసిన డైరీని ఈ రోజునుండి ప్రచురిస్తున్నాను.


ఆయన వ్రాసిన పుస్తకంలో తను వ్రాసిన ముందు మాటలోని కొన్ని ప్రధానమయిన విషయాలు సంగ్రహంగా….

శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ గారు ఇటలీ దేశస్థుడు.  ఆయన ప్రత్యేకంగా శ్రీ సాయిబాబా వారి గురించి పరిశోధన చేసే నిమిత్తం భారత దేశానికి వచ్చారు.  ఆయన ఇటలీలో బి.ఎ.విద్యనభ్యసిస్తూ సాయిబాబా జీవితం మీద ఆయన చేసిన ఉపదేశాలమీద పరిశోధన వ్యాసం తయారు చేయడానికి అక్టోబరు – నవంబరు 1985వ.సంవత్సరంలో తగిన ఏర్పాట్లు చేసుకొన్నారు.

శ్రీ సాయిబాబా గారు జీవించి ఉన్న రోజులలో ఆయనను ప్రత్యక్షంగా చూసినవారితో శ్రీ ఆంటోనియోగారు ముఖాముఖీ సంభాషించి అన్ని వివరాలను సేకరించారు.  ఆయన షిరిడీ వచ్చినపుడు ఒక దుబాసీ సహాయంతో తను అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసారు. ఆయన దుబాసీని వెంటబెట్టుకొని షిరిడీలో ఇంటింటికీ తిరిగి అందరితోను సంభాషించారు. ఆయనతో కూడా ఉన్న దుబాసీ మరాఠీలో భక్తులు చెప్పిన వివరాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి చెప్పేవాడు.  శ్రీ ఆంటోనియోగారు ఆ వివరాలన్నిటినీ ఆడియో రికార్డింగ్ కూడా చేసారు.  ప్రతిరోజు తాను జరిపిన సంభాషణలను ఒక డైరీలో ఇటలీ భాషలో వ్రాసుకొన్నారు. ఆయన పరిశోధననంతా ఒక పుస్తకరూపంలో ఆంగ్లంలో ORAL TESTIMONIES ON SAI BABA (DIGITAL PUBLISHING) పేరుతో  ప్రచురించారు.

శ్రీ ఆంటోనియో గారు 1980 వ.సంవత్సరం మధ్యలో బాబావారి అనుగ్రహంతో షిరిడికి వచ్చారు  తను సేకరించి వ్రాసిన పరిశోధన వివరాలన్నిటినీ 35 సంవత్సరముల తరువాత పుస్తక రూపంలో ప్రచురించారు.

షిరిడీకి వెళ్లడానికి ముందుగా రెండు సంవత్సరాలకు పైగా ఆయన తన అధ్యాపకుల పర్యవేక్షణలో సాయిబాబా గురించిన అన్ని పుస్తకాలను, చాలా కూలంకుషంగా అధ్యయనం చేసారు.  సాయిబాబాకు సంబంధించిన పుస్తకాలు అంగ్లంలో దొరికినవాటినన్నిటిని క్షుణ్ణంగా చదవడమే కాకుండా ఆనాటి కాలంలో మహారాష్ట్రలోని మతాచారాలు, ఆనాటిచరిత్ర అంతా అవగాహన చేసుకొన్నారు.

శ్రీ బి.వి. నరసింహస్వామిగారు వ్రాసిన  SrI Sayibaba’s Characters and Sayings అనే పుస్తకానికి శ్రీ ఎమ్.బి.రేగే గారు ముందుమాట వ్రాసారు.  ఈ పుస్తకాన్ని శ్రీ ఆంటోనియో గారు ఇటలీ భాషలోకి అనువాదం చేసారు. అప్పుడు ఆయన వయస్సు 23 సంవత్సరాలు.  ఆయనకు ప్రాధమికంగా హిందీ భాష తెలుసు గాని మరాఠీ రాదు.  Ca’ Foscari యూనివర్సిటీలో హింది లెక్చరర్ గా పనిచేస్తున్న డా. మహేష్ జైస్వాల్ గారు ఆంటోనియో గారు చేసే పరిశోధనకి ఎంతగానో సహకరించారు.  డా.మహేష్ జైస్వాల్ గారికి మరాఠీ కూడా తెలిసి ఉండటం వల్ల ఆంటోనియోగారు భారతదేశానికి వెళ్ళేముందు, వచ్చిన తరువాత ఎన్నో విషయాలలో సందేహాలను తీర్చారు.

ఆంటోనియోగారు పరిశోధన ప్రారంభించిన దశనుండే డా.జైస్వాల్ గారు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు.

ఆయన భారతదేశానికి రెండు సార్లు వెళ్ళినప్పటికి, బాబా గురించి పరిశోధనా వ్యాసం వ్రాయడం ఇదే మొదటిసారి.  ఆయన తన ప్రొఫెసర్ల సహకారంతో బాబా గురించి ఎటువంటి ప్రశ్నలు అడగాలో అన్నీ ఒక ప్రాధాన్యతా క్రమంలో వ్రాసి పెట్టుకొన్నారు.  షిరిడిలోని గ్రామస్థులు ఎవరయినా తమ చిన్నతనంనుండి యుక్తవయసు వరకు బాబాను ప్రత్యక్షంగా చూసినవారు గాని, వారి గురించి విన్నవారు గాని ఉంటే వారిని అడగవలసిన ప్రశ్నలను,వారి జ్ఞాపకాలను, అనుభవాలను సేకరించడానికి ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకొన్నారు.

ఆయన షిరిడీకి వచ్చిన తరువాత షిరిడీ గ్రామస్థులతో, ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవారు.  ముందుగా వారి అనుమతిని తీసుకునేవారు.  మొట్టమొదటగా వారినేమీ ప్రశ్నించకుండా బాబా గురించి వారికి ఎంతవరకూ తెలుసునో అంతా వారి ద్వారానే చెప్పించడం ఉత్తమమని భావించారు. ఏవిధంగాను ఇబ్బంది కలిగించేలా ప్రశ్నించకుండా, సాయిబాబా గురించి వారికి స్వయంగా కలిగిన  అనుభవాలను వారినోటి ద్వారానే వినదలచుకొన్నారు.

ఒక్కొక్కసారి సందర్భానుసారంగా కొన్ని ప్రశ్నలు అడగటం అనివార్యమయ్యాయి. అటువంటివాటిలో సాయిబాబా ముస్లిమా, హిందువా, ఆయనకు వారసులు ఎవరయినా ఉన్నారా లాంటి ప్రశ్నలకు వారు నిజాయితీగా సమాధానాలు చెప్పగలిగి ఉండాలి.

షిరిడీ గ్రామస్థులలో కొంతమంది వృధ్ధులు తమ బాల్యంలోను యుక్తవయసులోను సాయిబాబాను ప్రత్యక్షంగా చూసినవారున్నారు.  వారిని కూడా ఆంటోనియోగారు కలుసుకొని మాట్లాడారు.  వారు మాట్లాడిన తరువాత వారి అనుమతితో ఫోటోలను కూడా తీసుకున్నారు.

(ఫోటోలు బ్లాగులో ప్రచురించడానికి వీలు కావడంలేదు.  అందుచేత కాపీ చేసి పోస్ట్ చేయడం కుదరలేదు.)

(రేపటినుండి ఆంటోనియో గారు వ్రాసిన డైరీ)

(సర్వం శ్రీ సాయినాధార్పనమస్తు)

 

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List