31.07.2021 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయిభక్తులు తమ తమ అనుభవాలను పంపించినట్లయితే వాటిని కూడా బ్లాగులో ప్రచురిస్తానని ఇంతకుముందు నేను ఈ బ్లాగులోనే సందేశం ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి బోస్టన్ (అమెరికా) నుండి సాయి భక్తుడు శ్రీ రాకేష్ గారు తమ అనుభవాన్నిపంపించారు.
నిజానికి ఆయన తమ అనుభవాన్ని నాకు నెల క్రితమే పంపించారు. కాని అనుకోని పరిస్థితులలో కుటుంబ వ్యవహారాలలో మునిగిపోయి బాబా వారి సేవకూడా చేసుకోవడానికి తీరిక లేని కారణంగా ప్రచురించడానికి సాధ్యపడలేదు. బాబా వారికి నా పరిస్థితి తెలుసును కాబట్టి, తన బ్లాగును తనే నిర్వహించుకుంటారని నా ఉద్దేశ్యం.
ఇకముందు సమయాన్ని బట్టి ప్రచురిస్తూ ఉంటాను.
ఓమ్ సాయిరామ్
జై బోలో సాయినాధ్ మహరాజ్ కి జై
బాబాతో నాకు ఏర్పడిన సాన్నిహిత్యాన్ని వివరించేముందుగా బాబాకు నా నమస్కారాలను, ధన్యవాదాలను తెలుపుకుంటూ ఆతరువాత ఈ బ్లాగు నిర్వాహకులకు, నా స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
అవి నేను ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజులు. 
మా
అమ్మగారు సాయిబాబాను గురువారమునాడు ప్రార్ధిస్తున్న కారణంగా ఆ రోజు మాంసాహారము తినవద్దని చెప్పారు. 
అందువల్ల
మా కుటుంబమంతా ఆవిడ చెప్పినట్లుగానే నడచుకుంటూ సాయిబాబాను ప్రార్ధించసాగాము. 
అపుడు
నాకు 17 – 18 సంవత్సరాల వయసు. 
ఆ
వయసులో ఇంకా చిన్నతనం చాయలు ఇంకా మిగిలి ఉండటం వల్ల నేను మా అమ్మగారు 
చెప్పిన
మాటలను పెద్దగా పట్టించుకోలేదు. 
ఒక
గురువారమునాడు
నేను మాంసాహారం తినడంతో మా అమ్మగారికి చాలా కోపం వచ్చింది. 
ఒక
వారం తరువాత పరీక్షాఫలితాలు వచ్చాయి. 
నేను
ఫిజిక్స్ లో ఉత్తీర్ణతకు రావలసిన మార్కులమీద 
ఒక్క
మార్కుతో ఉత్తీర్ణుడినయ్యాను. 
కాని
నాతోపాటే మాంసాహారమును భుజించిన మా బావ (మా మేనత్త కొడుకు) పరీక్ష తప్పాడు. 
ఇది
మా ఇద్దరికీ మంచి గుణపాఠం. 
ఇక
మేమిద్దరం అమ్మ మాటను జవదాటకూడదని నిర్ణయించుకుని ప్రతి గురువారమునాడు మాంసాహారాన్ని మాని బాబాను ప్రార్ధించడం మొదలుపెట్టాము. 
బాబా
తన భక్తుల ఎడల ఎంత దయగా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. 
బాబాను
ప్రాధించడం మొదలుపెట్టగానే నా తప్పులను క్షమించమని బాబాను వేడుకొన్నాను.
కాలగర్భంలో పది సంవత్సరాలు గడిచాయి…
నా సహోద్యోగి బాబా భక్తుడు. అతను ఎప్పటినుండో బాబాను పూజిస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడూ నాకు బాబా గొప్పతనం గురించి, ఆయన తన భక్తులకు అవసరమయిన సమయాలలో ఏవిధంగా సహాయం చేస్తూ ఉంటారో ఇంకా ఆయనకు సంబంధించిన గొప్పగొప్ప విషయాలు అన్నీ చెబుతూ ఉండేవాడు. బాబాకు అతను అంతమంచి భక్తుడయినందుకు అతనిని ఎంతగానో ప్రశంసిస్తూ ఉండేవాడిని. మా అమ్మగారి తరువాత బాబా గురించి చెప్పిన రెండవ వ్యక్తి అతను.
నా కోరికను నెరవేర్చిన బాబా
నాకు 2019 వ.
సం. మే నెలలో వివాహమయింది. 
మేమిద్దరం
వేరువేరు ప్రదేశాలలో ఉంటున్నాము. 
మేమిద్దరం
ఉద్యోగరీత్యా
ఒకే చోట ఉండి కలిసి జీవిద్దామనేదే మా ప్రధమ లక్ష్యం. 
కాని
సంవత్సరకాలం
గడిచినా మాకోరిక నెరవేరలేదు. 
ఇద్దరం  వేరే
వేరే రాష్ట్రాలలో ఉద్యోగరీత్యా ఉండవలసివచ్చింది. 
ఈలోగా
కోవిడ్ ప్రభావం ప్రపంచదేశాలన్నిటి మీద పడింది. 
అందువల్ల
ఉద్యోగస్తులందరూ
ఇంటివద్దనే కూర్చుండి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. 
ఇటువంటి
పరిస్థితిలో
ఒకేచోట ఉద్యోగం ప్రయత్నించడమంటే అది సాధ్యమయే పనికాదు. 
ఆఖరికి
బాబా అనుగ్రహం వల్ల 
కోవిడ్
సమయంలో నా భార్య పనిచేస్తున్న ఊరిలోనే ఉంటూ ఇంటినుంచి పనిచేయడానికి అనుమతి లభించింది. 
ఆవిధంగా
మేమిద్దరం కలిసి ఒకేచోట ఉండే అవకాశం కలిగింది. 
ఈ
సమయంలోనే నేను ఇక్కడే మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను.
రోజులు గడుస్తున్నా ఏ ఒక్క ఇంటర్వ్యూ రాలేదు. 
కొన్ని
వచ్చినా గాని నేను వాటిల్లో అంతబాగా చేయలేకపోయాను. 
దీని
వల్ల నాలో నిరాశ ఏర్పడింది. 
దానికి
కారణం ఒకవేళ ఈ కరోనా ప్రభావం తగ్గిపోయినట్లయితే మా మేనేజరు మళ్ళీ ఆఫీసుకే వచ్చి పని చేయమంటే ఏమిచేయాలి? 
మళ్ళీ
నేను భార్యను విడిచి దూరంగా విడిగా ఇంతకు ముందు నేను పనిచేసిన ఊరికి వెళ్ళిపోవాలి. 
అదృష్టం
వరించడం వల్ల మాకు మొట్టమొదటి సంతానం కలగబోతూ ఉంది. 
అందుచేత
నేను నాభార్య పనిచేస్తున్న ఊరిలోనే ఉద్యోగం చేయడం ముఖ్యం, తప్పనిసరి. 
అపుడు
నా సహోద్యోగి  బాబాను ప్రార్ధించమని ఆయన తప్పకుండా సహాయం చేస్తారని చెప్పాడు.
నేను మనఃస్ఫూర్తిగా నాకు సహాయం చేయమని ఉద్యోగం ఇప్పించమని బాబాను ప్రార్ధించుకున్నాను. 
బాబాను
మనఃస్ఫూర్తిగా
ప్రార్ధించుకున్న
తరవాత బాబా నాకు నిజంగానే సహాయం చేసారు. 
నాలుగు
వారాలలోనే మంచి జీతంతో ఉద్యోగం ఇప్పించారు. 
అంతే
కాదు.  నేను
కోరుకొన్నవన్నీ
అనుగ్రహించి
సహాయం చేసారు. 
మరొక
శుభవార్త.  త్వరలోనే
మాకు సంతానం కలగబోతోంది. 
ఆయన
మీదనే భారం వేసి పూర్తి నమ్మకంతో వేడుకుంటే బాబా మనకు తప్పకుండా సహాయం చేస్తారు. 
బాబా
మీద అచంచలమయిన భక్తి విశ్వాసాలు మనం నిలుపుకోవాలి.
బాబా నాకోరికను తీర్చిన వెంటనే నా ఈ అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటిసాయి భక్తులందరితోను పంచుకుంటానని, దగ్గరలో ఉన్న బాబా మందిరానికి వెళ్ళి దర్శించుకుంటానని బాబాను ప్రార్ధించుకున్నాను.
ఆ విధంగా ప్రార్ధించుకున్న నాలుగు వారాలలోనే బాబా నా కోరికను నెరవేర్చారు. 
నా
కోరిక తీరగానే దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి బాబాను దర్శించుకుని నా ఈ అనుభవాన్ని మీ అందరితోను పంచుకుంటున్నాను.
సాయిబాబా మహరాజ్ కి జై.
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 
 
 
 


 




 
0 comments:
Post a Comment